Big Stories

Land Rover Defender Octa: గాడ్ ఫాదర్ ఆఫ్ SUV.. డిఫెండర్ ఆక్టా లాంచ్.. ఆల్ రౌండర్ ఏనుగు ఇది!

Land Rover Defender Octa: ల్యాండ్ రోవర్ తన ఫేమస్ డిఫెండర్ ఆక్టా SUVని విడుదల చేసింది. ఈ లగ్జరీ SUV పీక్ పర్ఫామ్ వేరియంట్. ఇండియాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా ధర రూ. 2.65 కోట్లతో (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ లగ్జరీ కార్ కంపెనీ కూడా ఈ SUV కోసం అధికారిక బుకింగ్‌లు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించింది. అయితే కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. ఈ ఏడాది జూలై 11-14 వరకు జరగనున్న 2024 గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ ఈవెంట్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టాను చూడవచ్చు.

- Advertisement -

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా డిజైన్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 ఆధారంగా తీసుకొచ్చారు. ఈ SUV అన్ని విధాలుగా బెస్ట్‌గా ఉంటుంది. ఈ SUV చాలా ఎత్తుగా, వెడల్పుగా ఉంటుంది. ఇది రోడ్డుపై స్ట్రాంగ్ కమాండింగ్ మోడ్‌తో వస్తుంది. ఈ SUVకి ముందు, వెనుక భాగంలో కొత్తగా డిజైన్ చేసిన బంపర్‌లు ఉన్నాయి. ఇవి బెటర్ అప్రోచ్ యాంగిల్స్‌ను కలిగి ఉన్నాయి.

- Advertisement -

Also Read: అదిరిపోయే న్యూస్.. మీ డ్రీమ్ మారుతీ నిజం చేస్తోంది!

SUV స్ట్రాంగ్ అండర్‌బాడీ ఫ్రొటక్షన్ కలిగి ఉంటుంది. ఇది రైడర్‌ను ఆఫ్-రోడింగ్‌కు వెళ్లడానికి కూడా అనుమతిస్తుంది. ఇది కాకుండా SUV లోతైన నీటిలో కూడా వేగంగా దూసుకెళుతుంది. ఇది ఒక మీటరు నీటిలో కూడా సులభంగా వెళుతుంది. SUV ప్రత్యేకమైన కొత్త పెట్రా కాపర్, ఫారో గ్రీన్ ఎక్స్‌టీరియర్ పెయింట్ థీమ్‌లో అందుబాటులో ఉంది. ఇది 20-అంగుళాల ఫోర్గింగ్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. ఇవి ఆల్-టెర్రైన్ టైర్‌లతో ఉంటాయి.

పెట్రా కాపర్, ఫారో గ్రీన్ ఎక్ట్సీరియర్ పెయింట్‌తో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా ఇంటీరియర్ డిజైన్ చేశారు. ఇది లెదర్ కంటే 30 శాతం తేలికైనది. క్యాబిన్ లోపల, డిఫెండర్ ఆక్టా స్టాండర్డ్ డిఫెండర్ 110ని పోలి ఉంటుంది. దీనిలో ఒక బటన్ ఉంది. దీని ద్వారా SUV ఆఫ్-రోడింగ్ పర్ఫామెన్స్ చూడవచ్చు. ఇందులో ఆక్టా మోడ్ కూడా ఉంది.

ఆఫ్-రోడింగ్ డ్రైవింగ్ అసిస్ట్ SUV ఇసుక, మట్టి, గుంతలు, గడ్డి, మంచు, రాక్ క్రాల్ కోసం ప్రత్యేక అరేంజ్‌మెంట్ అందించే ఫెమిలియర్ టెర్రైన్ రెస్పాన్స్ మోడ్‌ల సూట్‌తో వస్తుంది. ఇది క్లియర్‌సైట్ గ్రౌండ్ వ్యూ 2 వంటి ఆఫ్-రోడింగ్ డ్రైవర్ అసిస్ట్ ఫీచర్‌లను కలిగి ఉంది. డిఫెండర్ ఆక్టా సాధారణ మోడల్ కంటే 28 మి.మీ పొడవు, 68 మి.మీ విశాలమైనదిగా ఉంటుంది. ఇది బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్, స్టెబిలిటీని ఇస్తుంది. దీన్ని బ్రెంబో కాలిపర్‌లతో 400ఎమ్ఎమ్ ఫ్రంట్ బ్రేక్ డిస్క్‌లతో అప్‌గ్రేడ్ చేశారు.

Also Read: భలే ఆఫర్లు.. వోక్స్‌వ్యాగన్ కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు!

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా పవర్‌ట్రైన్ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా డిఫెండర్ 110 కెపాసిటీ కొత్త రేంజ్‌కి తీసుకువెళుతుంది. SUV 4.4-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ మైల్డ్-హైబ్రిడ్ V8 ఇంజన్‌తో వస్తుంది. ఇది డిఫెండర్ ఆక్టాను అత్యంత పవర్‌ఫుల్ డిఫెండర్‌గా మార్చింది. ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లింక్ చేశారు. ఇందులో ఉన్న ఇంజన్ గరిష్టంగా 626bhp పవర్, 750nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ SUV ఇంజన్ 4 సెకన్లలో 0-100 కిమీల వేగాన్ని అందుకుంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News