Big Stories

Lakhs of jobs in India: రండి బాబూ రండి!

Lakhs of jobs in Indian: ఆర్ధిక మాంద్యానికి భయపడి అమెజాన్‌, ట్విట్టర్‌, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బడా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. వచ్చే ఏడాది కూడా సిబ్బందిని తగ్గించుకోవడంతో పాటు కొత్త నియామకాలు చేపట్టబోమని ప్రకటించాయి. దిగ్గజ కంపెనీలే ఉద్యోగుల్ని సాగనంపుతూ ఉంటే… మనదేశంలో స్టార్టప్ కంపెనీల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉద్యోగం కావాలా… అయితే రండి అంటూ ఆహ్వానిస్తున్నాయి… భారత స్టార్టప్ కంపెనీలు. అవసరాన్ని బట్టి ఇప్పటికే 2 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించిన స్టార్టప్‌ కంపెనీలు… ఇంకా లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తేలింది. వచ్చే మూడు నాలుగేళ్లలో స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య భారీ స్థాయిలో పెరగనుంది.

- Advertisement -

ఆర్థిక సేవల ప్లాట్‌ఫామ్ అయిన స్ట్రైడ్‌వన్ నివేదిక ప్రకారం 2022లో మనదేశంలో స్టార్టప్‌లు 2లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాయి. స్టార్టప్‌ల ద్వారా ఉద్యోగాల కల్పన 2017-22 మధ్య 78 శాతం వృద్ధి సాధించినట్లు నివేదిక వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ ఎకానమీపై దృష్టి సారించడంతో ఉద్యోగాల కల్పన 2025 నాటికి 70 రెట్లు పెరుగుతుందని స్ట్రైడ్‌వన్ అంచనా వేసింది. ఇండియన్‌ స్టార్టప్‌ ఈకో సిస్టం… అమెరికా, చైనా తర్వాత ప్రపంచ దేశాల్లో మూడవ అతి పెద్దదిగా అవతరించింది. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య విభాగంలో ఇప్పటికే 7,70,000లకు పైగా స్టార్టప్‌లు నమోదయ్యాయి. 108 యునికార్న్‌ల స్టార్టప్‌ల మొత్తం విలువ 400 బిలియన్ డాలర్లకు పైగా ఉంది.

- Advertisement -

స్కేలబిలిటీ, ఆల్టర్నేట్ ఫండింగ్ ఆప్షన్లు, గ్లోబల్ మార్కెట్‌లోకి విస్తరించడం వంటి వివిధ అంశాలలో వ్యవస్థ పెరుగుదల అనేక అవకాశాలను సృష్టించిందని, తద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించే సామర్ధ్యాన్ని కూడా పెంచిందిని స్ట్రైడ్‌వన్ తెలిపింది. ఇది భారతదేశ జీడీపీకి సుమారు 4 నుంచి 5 శాతం దోహదం చేస్తుందని వెల్లడించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News