Big Stories

Kia India Exports New Record: రికార్డులు బద్దలుకొట్టిన కియా.. విదేశాల్లో భారీగా పెరిగిన క్రేజ్..!

Kia India Exports CreatedNew Record: కియా మోటార్స్ ఎగుమతుల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా భారతదేశంలో MPV, SUV విభాగంలో వాహనాలను అందిస్తుంది. ఈ కంపెనీ ప్రపంచంలోని అనేక దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. గత 60 నెలల్లో కంపెనీ ఎలాంటి రికార్డు సృష్టించింది. విదేశాల్లో ఏ వాహనానికి అత్యధిక డిమాండ్ ఉంది? భారతదేశంలో తయారైన కార్లను ఏ దేశాలకు పంపుతారు? తదితర వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

కియా మోటార్స్ కేవలం 60 నెలల్లోనే కొత్త మైలురాయిని సాధించింది. కేవలం ఐదేళ్లలో భారత్ నుంచి విదేశాలకు 2.5 లక్షలకు పైగా వాహనాలు ఎగుమతి అయినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ 2019 సంవత్సరంలోనే భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి ఇది భారతదేశంతో పాటు విదేశాలలో లక్షల వాహనాలను విక్రయించింది.

- Advertisement -

కంపెనీ నుండి అందిన సమాచారం ప్రకారం ఐదేళ్లలో ఇప్పటివరకు మొత్తం 255133 యూనిట్ల వాహనాలు ఎగుమతి చేసింది. ఇందులో కియా సెల్టోస్, సోనెట్, కారెన్స్ వంటి వాహనాలు ఉన్నాయి. వీటిలో అత్యంత డిమాండ్ ఉన్న మిడ్-సైజ్ SUV సెల్టోస్. ఎగుమతి చేసిన వాహనాల్లో కంపెనీ ఈ SUV మొత్తం 59 శాతం యూనిట్లను పంపింది. ఇది కాకుండా ఎగుమతుల్లో సోనెట్ వాటా 34 శాతం, కారెన్స్ వాటా 7 శాతంగా ఉంది.

Also Read: దుమ్ములేపనున్న మారుతీ.. నాలుగు CNG కార్లు.. మైలేజ్ చూస్తే నమ్మలేరు!

కంపెనీ తన వాహనాలను ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇందులో దక్షిణాఫ్రికా, చిలీ, పరాగ్వే, దక్షిణ అమెరికా దేశాలు ఉన్నాయి. కియా ఇండియా తన అనంతపురం ప్లాంట్ నుండి 12 లక్షలకు పైగా వాహనాలను ఎగుమతి చేసింది. వీటిలో 9.8 లక్షల వాహనాలు దేశీయ మార్కెట్‌కు, 2.5 లక్షల వాహనాలు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి.

భారతీయ రోడ్లపై నాలుగు లక్షలకు పైగా కనెక్ట్ చేయబడిన కార్లతో దేశంలోని కనెక్ట్ చేయబడిన కార్ లీడర్‌లలో కియా ఒకటిగా నిలిచింది. కంపెనీ 265 నగరాల్లో 588 టచ్‌పాయింట్‌ల విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా కియా తాజాగా ఈ టచ్ పాయింట్లను విస్తరించే పనిలో పడింది.

Also Read: టాటా నుంచి కొత్త కార్లు.. ఇక EV సెగ్మెంట్‌లో యుద్ధమే

కియా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ.. కొత్త మోడల్ వేరియంట్‌లను పరిచయం చేయడం, కంపెనీ సేల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించడం వల్ల అమ్మకాలు పెరడానికి కారణమని అన్నారు. కియా ఇండియా త్వరలో 1 మిలియన్ దేశీయ విక్రయాల మైలురాయిని దాటతుందని అన్నారు. కియా భారతదేశంలో 9.8 లక్షలకు పైగా వాహనాలను విక్రయించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News