Big Stories

Kia Cars In Army Canteen: కియా మరో ముందడుగు.. పోలీస్ క్యాంటీన్లలో అమ్మకాలు!

Kia Cars In Army Canteen: దేశంలో అత్యధిక కార్లను విక్రయిస్తున్న టాప్-5 కంపెనీల్లో కియా ఇండియాకు చోటు దక్కింది. కియా ఇండియా తన ఫేమస్ వాహనాల అమ్మకాలను పెంచడానికి కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కియా ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకం కింద పారామిలటరీ, పోలీసు సిబ్బందికి ప్రత్యేక ప్రయోజనాలను అందించనుంది.

- Advertisement -

ఈ భాగస్వామ్యం కింద కియా తన అన్ని మాస్ సెగ్మెంట్ ఉత్పత్తులను అంటే సెల్టోస్, సోనెట్, క్యారెన్స్‌లను క్యాంటీన్‌లో యాక్టివ్, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది కుటుంబాల కోసం విక్రయిస్తుంది. ఇందులో పారామిలటరీ బలగాలు, రాష్ట్ర, కేంద్ర పోలీసు సిబ్బంది, హోంశాఖ ఉద్యోగులు ప్రత్యేక ధరలకు కియా కార్లను కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Also Read: టాటా హారియర్ EV.. మైండ్ బ్లాక్ చేస్తున్న ఫీచర్లు.. వేరే లెవల్ అంతే!

కియా కార్లు అవుట్ లుక్, ఇంటీరియర్ డిజైన్, పవర్‌ఫుల్ పర్పామెన్స్, కనెక్ట్ చేయబడిన కారు వంటి స్మార్ట్ టెక్నాలజీలు, కంఫర్ట్ సంబంధిత ఫీచర్లకు ఫేమస్ అయ్యాయి. అన్ని కియా ఉత్పత్తులు సెగ్మెంట్ లీడర్లు, ఇన్నోవేటర్లు, కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్ (KPKB) క్రింద 119 మాస్టర్ క్యాంటీన్లు, 1900 లింక్ క్యాంటీన్లలో అందుబాటులో ఉంటాయి.

ప్రస్తుతం సెంట్రల్ పోలీస్ కళ్యాణ్ భండార్ 35 లక్షల మంది పోలీసు, పారామిలటరీ బలగాల లబ్ధిదారులకు సేవలు అందిస్తోంది. KPKB డిమాండ్లను తీర్చడానికి Kia ఉత్పత్తి లైన్ 88 డిఫరెంట్ వేరియంట్లను అందుబాటులో ఉంచడానికి362 Kia డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ మాట్లాడుతూ.. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా పారామిలటరీ, పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు సేవ చేయడం మాకు గర్వకారణం. మా క్లాస్ లీడింగ్ కార్లను వారి అవసరాలను తీరుస్తాయని నాకు నమ్మకం ఉందని అన్నారు.

Also Read: లిమిటెడ్ ఆఫర్.. కారుపై రూ.2.62 లక్షల డిస్కౌంట్!

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా 2006లో సెంట్రల్ పోలీస్ కళ్యాణ్ భండార్ స్థాపించబడిందని, దీని ద్వారా చాలా మంది ప్రజలు ప్రయోజనాలను పొందుతారు. ఇది BSF, CRPF, CISF, SSB, ITBP అస్సాం రైఫిల్స్‌తో కూడిన కేంద్ర సాయుధ పోలీసు బలగాల అవసరాలను తీరుస్తుంది. IB, BPRD, NCRB వంటి వివిధ కేంద్ర పోలీసు సంస్థలు కూడా దీని నుండి ప్రయోజనం పొందుతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News