Big Stories

Jio Tariff Hikes: భారీగా పెరిగిన జియో రీచార్జ్ ధరలు.. అంబానీపై ట్రోల్స్..!

Reliance Jio Increases Prices of all Plans: జియో నెట్వర్క్ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. రిలయన్స్ జియో మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిద్ ధరలు రెండూ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ నెలవారీ ప్లాన్లనుంచి ఎక్కువ రేటు ప్లాన్ల వరకు ఏ ఒక్క ప్లాన్ వదలకుండా అన్నింటినీ పెంచేసింది. ఈ పెంచిన ధరలు జులై 3 నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల నుంచి పెరగనున్న ధరల ప్రకారం..కస్టమర్లకు నెలకు రూ.600 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది.

- Advertisement -

రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఇటీవల ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి సంబంధించి కాస్ట్ లీ వివాహ ఆహ్వాన పత్రిక వైరల్ అవుతోంది. ఒక్కో వెడ్డింగ్ కార్డు కోసం 6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. దీంతో నెటిజన్లు ఆ వెడ్డింగ్ కార్డు తో పాటు పెళ్లి ఖర్చును మా మీద వేస్తున్నావా ? అంటూ ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -

‘చిన్న కుమారుడు వివాహం ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ మావా’ అంటూ నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరికొంతమంది ‘ఇక ఎన్నికలు పూర్తయ్యాయి.. బాదుడే బాదుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అసలు జియో సిగ్నల్ రావడం లేదు.. ధరలు మాత్రమే పెంచుతారా? అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Also Read: మైలేజీలో కింగ్.. మార్కెట్‌లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!

జియో సంస్థ దాదాపు అన్ని ప్లాన్‌లలో మొబైల్ సేవల రేట్లను పెంచింది. రెండున్నరేళ్ల తర్వాత జియో మొబైల్ రిఛార్జ్ రేట్లను పెంచింది. జియో అత్యల్ప రీఛార్జ్ ధర రూ.15 నుంచి రూ.19 వరకు, రూ.25 నుంచి రూ.29 వరకు పెరగగా.. రూ.61 నుంచి రూ.69 వరకు పెరిగాయి. అలాగే కనిష్ట నెలవారీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫ్లాన్‌ను రూ.155 నుంచి రూ.189 వరకు పెంచింది. అలాగే రూ.209 నుంచి రూ.249, రూ.239 నుంచి రూ.299, రూ.299 నుంచి రూ.349 వరకు పెంచింది.

అదే విధంగా రూ.479 నుంచి రూ.579 వరకు పెరిగాయి. ఇలా రూ.533 నుంచి రూ.629, రూ395 నుంచి రూ.479, రూ.349 నుంచి రూ.399, రూ.399 నుంచి రూ. 499 వరకు పెంచింది. దీంతో పాటు సంవత్సర ప్లాన్లను సైతం భారీగా పెంచేసింది. రూ.1,559 నుంచి రూ.1,899, రూ.2, 999 నుంచి రూ.3,599 వరకు గణనీయంగా పెరిగాయి. ఈ ధరలను చూసిన జియో నెట్వర్క్ కస్టమర్స్ లబోదిబోమంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News