Big Stories

Free OTT Subscription: అంబానీ అదుర్స్.. ఫ్రీగా 13 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్.. ఇది కదా అసలైన పండగ..!

Free 13 OTT Subscription from Jio: ఒటీటీల క్రేజ్ రోజురోజుకు పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి OTT ప్లాట్‌ఫామ్‌లు అవసరంగా మారాయి. వీటి ద్వారా థియేటర్‌కు వెళ్లకుండానే సినిమాలను ఉచితంగా చూడొచ్చు. అందుకే టెలికాం కంపెనీలు రీచార్జ్‌తో పాటు ఫ్రీ ఓటీటీ సబ్‌స్క్రీబ్షన్ అందిస్తున్నాయి. అన్ని పెద్ద టెలికాం కంపెనీలు తమ అనేక ప్లాన్‌లతో ఉచిత OTT బండిల్‌లను అందించడం ప్రారంభించడానికి ఇదే కారణం. అయితే ఇటువంటి వాటిలో జియో మిగతా వాటి కంటే ముందుంది. రూ. 400 కంటే తక్కువ ప్లాన్‌లలో డజనుకు పైగా OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తోంది.

- Advertisement -

నిజానికి జియో పోర్ట్‌ఫోలియోలో అనేక ఉచిత OTT ప్లాన్‌లు ఉన్నాయి. అయితే ఎంపిక చేసిన ప్లాన్‌లు ఒకటి కంటే ఎక్కువ యాప్‌ల నుండి కంటెంట్‌ను చూసే అవకాశాన్ని ఇస్తాయి. JioTV ప్రీమియం ఇలాంటి ప్లాన్‌లను అందిస్తుంది. వీటిలో చౌకైన రీఛార్జ్ రూ. 148. ఇది డేటా-మాత్రమే వోచర్, కాలింగ్,  SMS వంటి బెనిఫిట్స్ అందించదు. మీరు దీనికి బదులుగా మరొక మంచి ప్లాన్‌ని ఎంచుకుంటే మంచిది.

- Advertisement -

మీరు రోజువారీ డేటా SMS వంటి అవసరాలతో పాటు డజనుకు పైగా OTT సేవల నుండి కంటెంట్ కావాలనుకుంటే Jio రూ. 398 ప్లాన్ బెటర్‌గా ఉంటుంది. దీనితో రీఛార్జ్ చేసుకున్న సబ్‌స్క్రైబర్‌లు 28 రోజుల వ్యాలిడిటి వరకు ప్రయోజనాలను పొందుతారు. రోజుకు 2GB డేటాతో పాటు ఈ ప్లాన్ రోజుకు 100 SMS వస్తాయి. అన్నీ నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది.

Also Read: రికార్డులు బ్రేక్.. భారీగా పెరిగిన హీరో స్ప్లెండర్ సేల్స్!

ఈ 398 ప్లాన్‌తో 6GB అదనపు డేటా కూడా లభిస్తుంది. దీనితో 13 OTT సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది. వాటిలో SonyLIV నుండి జియో సినిమా ప్రీమియం, LionsGate Play, Discovery+, FanCode, ZEE5 మొదలైనవి ఉన్నాయి. అర్హత ఉన్న వినియోగదారులు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫట్స్ కూడా పొందుతారు. Jio 5G సేవలు అందుబాటులో ఉన్న, 5G స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వినియోగదారులకు ఇవి అందుబాటులో ఉంటాయి. అన్ లిమిటెడ్ 5G కోసం కనీసం వినియోగదారులు కనీసం రూ. 239 యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ కలిగి ఉండటం అవసరం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News