Big Stories

Jeep Renegade: జీప్ నుంచి చౌకైన SUV.. ధర ఎంతంటే?

Jeep Renegade: కార్ మార్కెట్‌లో ఎస్‌యూవీల క్రేజ్ ఇప్పుడల్లా ఆగేలా కనిపించడం లేదు. కాంపాక్ట్ SUV నుండి మిడ్-సైజ్ కాంపాక్ట్ SUV వరకు భారతదేశంలో అత్యధికంగా సేల్ అవుతున్నాయి. హ్యుందాయ్ క్రెటా నుండి కియా సెల్టోస్ చాలా బాగా అమ్ముడయ్యాయి. ఇప్పుడు జీప్ కూడా దాని SUV పోర్ట్‌ఫోలియోను విస్తరించబోతోంది. దీని కోసం సిట్రోయెన్‌తో చేతులు కలిపింది. Citroen నుండి SUV ప్లాట్‌ఫారమ్ ఆధారంగా కంపెనీ తన కొత్త SUVని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -

నివేదికల ప్రకారం జీప్ తన కొత్త SUVని కాంపాక్ట్ సెగ్మెంట్లో విడుదల చేయనుంది. కొత్త మోడల్ పేరు ‘జీప్ రెనెగేడ్’ కావచ్చు. అయితే ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. విశేషమేమిటంటే కొత్త జీప్ తక్కువ ధరకే వస్తుంది. కొత్త మోడల్‌ను మిడ్ రేంజ్ ప్రైస్‌లో తీసుకురావడానికి ఇది సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. రెండు కంపెనీలు స్టెల్లాంటిస్ గ్రూప్‌లో భాగమైనందున ఇది తక్కువ ధరకే లభిస్తుంది.

- Advertisement -

Also Read: మహీంద్రా నుంచి కొత్త పికప్ ట్రక్.. రూ. 25 లక్షలతో త్వరలో లాంచ్!

జీప్ కొత్త SUVలో 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వవచ్చు. ఇందులో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్  ఉంటుంది. ఈ ఇంజన్ పవర్‌తో పాటు మంచి మైలేజీని అందిస్తుంది. జీప్ కొత్త మోడల్‌ను సి-క్యూబ్ ప్లాట్‌ఫారమ్‌లో తీసుకురానున్నారు. ఇది కాకుండా దాని పొడవు 4.3 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతానికి కొత్త మోడల్ ధరకు సంబంధించి జీప్ నుండి ఎటువంటి సమాచారం అందలేదు. అయితే అది కూడా త్వరలో వెల్లడించనున్నారు. కొత్త ఎస్‌యూవీ ధర దాదాపు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండవచ్చు. దేశంలో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, మారుతి సుజుకి గ్రాండ్ విటారాతో నేరుగా పోటీపడుతుంది. కొత్త మోడల్‌ను 2025 చివరిలో లేదా 2026లో భారతదేశంలో విడుదల చేయవచ్చు.

Also Read: 155 సీసీతో యమహా కొత్త స్కూటర్.. మతిపోగొడుతున్న ఫీచర్లు!

కంపెనీ జీప్ రెనెగేడ్ ఎలక్ట్రిక్ మోడల్‌ను కూడా లాంచ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది 4X4 ఆప్షన్‌తో వస్తుంది. కొత్త మోడల్ ధర దాదాపు రూ. 20 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు. కంపెనీ తక్కువ ధర కార్లపై దృష్టి సారించింది. భారతదేశంలో రాబోయే కాలం ఎలక్ట్రిక్ వాహనాలు కానుంది. జీప్‌తో పాటు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా, హోండా వంటి కార్ల కంపెనీలు కూడా సరసమైన కార్ల కోసం కసరత్తు చేస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News