Big Stories

Jawa 350 Range Launch: ఫిదా చేసే లుక్‌లో జావా యెజ్డీ 350 బైక్స్‌.. అల్లాయ్, స్పోక్ వీల్స్ వేరియంట్‌లో విడుదల!

Jawa 350 Range Launched at Rs 1.99 Lakhs: యూత్‌ని అట్రాక్ చేసేందుకు ప్రముఖ బైక్ తయారీ కంపెనీలు కొత్త కొత్త స్టైలిష్ లుక్‌లో బైల్‌లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో జావా యెజ్డీ కంపెనీ ఒకటి. యూత్‌ను టార్గెట్ చేస్తూ భారత మార్కెట్‌లో విడుదల చేస్తున్న ఈ కంపెనీ బైక్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో యూత్ క్రేజీ బైక్‌ల జాబితాలో ఈ కంపెనీ చేరిపోయింది. అయితే ఇప్పటికే ఈ కంపెనీ 350 లైనప్‌ బైక్‌లకు దేశంలో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు ఆ లైనప్‌ను మరింత విస్తరించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

- Advertisement -

ఇందులో భాగంగానే కంపెనీ అల్లాయ్ వీల్స్, స్పోక్ వీల్స్‌, అద్భుతమైన లుక్‌తో జావా 350 రేంజ్ బైక్‌ వేరియంట్లను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ బైక్ వేరియంట్స్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.. జావా 350 బైక్ మొత్తం నాలుగు కలర్ వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. ఇప్పుడు కొత్త జావా 350 బైక్ రూ.1,99 లక్షల నుంచి రూ.2.23 లక్షల ప్రారంభ ధరతో రిలీజ్ అయింది. ముందుగా ఈ జావా యెజ్డీ 350 లైనప్‌లో బేస్ వేరియంట్ రూ.1,98,950 ధరలో రిలీజ్ చేసింది. ఈ వేరియంట్‌లో స్పోర్క్ వీల్స్ అందించారు.

- Advertisement -

ఇది మొత్తం ఒబ్సిడియన్ బ్లాక్, డీప్ ఫారెస్ట్, గ్రే వంటి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇక ఇంకో బైక్‌లో అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. ఆ వేరియంట్ రూ.2,08,950 ధరలో రిలీజ్ అయింది. ఇది కూడా ఒబ్సిడియన్ బ్లాక్, డీప్ ఫారెస్ట్, గ్రే వంటి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇక మరొక వేరియంట్ జావా 350 క్రోమ్ స్పోక్ వీల్స్‌తో వచ్చింది. ఇది రూ.2,14,950 ధరలో రిలీజ్ అయింది. ఇందులో బ్లాక్, మెరూన్, ఆరెంజ్, వైట్ వంటి 4 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: మార్కెట్‌లోకి సరికొత్త బైక్ ‘బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650’.. లాంచ్ ఎప్పుడంటే?

ఇక దీని హై ఎండ్ క్రోమ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. ఇది రూ.2,23,950 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ కూడా బ్లాక్, మెరూన్, ఆరెంజ్, వైట్ వంటి 4 కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ బైక్ 334 సిసి లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 22.2బిహెచ్‌పి పవర్, 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

దీని ఫ్రంట్ సైడ్ 35ఎంఎం సస్పెన్షన్‌ను అమర్చారు. అలాగే బ్యాక్ సైడ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లను అందించారు. ఇందులో ఫైబర్ గ్లాస్ డిస్క్ బ్రేకులు అందించారు. ఫ్రంట్ సైడ్ 220 ఎంఎం డిస్క్, బ్యాక్ సైడ్ 240 ఎంఎం డిస్క్ బ్రేకులు కలిగి ఉన్నాయి. ఇందులో డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్ కూడా ఉంది. అందువల్ల డ్రైవింగ్ సమయంలో మంచి అనుభూతిని అందించే అధిక ధర గల బైక్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News