Big Stories

ITR Filing 2024: ఐటీఆర్ ఫైల్స్‌ చేస్తున్నారా? అయితే ఈ పది రూల్స్ పాటిస్తే డబ్బు ఆదా చేసుకోవచ్చు..!

Alternative Options to Save Income Tax: పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని సంపాదించే వ్యక్తుల్లో చాలామంది తాము చెల్లించాల్సిన పన్ను విషయంలో ఆదా చేసుకునేందుకు వివిధ మార్గాలను వెతుకుతుంటారు. వీరు తప్పనిసరిగా ప్రతీ ఏటా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) పైల్స్ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

కొంతమంది ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఇబ్బంది పడుతుంటారు. మరికొంతమంది వివిధ రూపాల్లో ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఎలాంటి ఇన్వెస్ట్ చేయకుండా పన్నును ఆదా చేసుకోవచ్చు. ఆదాయ పన్ను చట్టం ప్రకారమే.. కొన్ని రూల్స్ ఫాలో అయితే భారీ మొత్తంలో డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ ఫైల్ చేసే ముందు 10 నియమాలు తప్పక తెలుసుకోవాలి.

- Advertisement -

ట్యాక్స్ ఆదా చేసుకునేందుకు ఎక్కువమంది 80Cనే ఉపయోగిస్తుంటారు. అయితే పన్ను ఆదా చేసుకునేందుకు 80Cనే కాకుండా మిగతా రూపాల్లోనూ ఆదా చేసుకోవచ్చు.

Also Read: 2024 Nissan X-Trail SUV: నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్ లాంచ్‌కు సిద్ధం.. ఇక ఆ మోడళ్లకు గట్టి పోటీ తప్పదు..!

సెక్షన్ 80D:
మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కింద ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. మీరు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చేసిన ప్రీమియంలపై డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు.

సెక్షన్ 80DD:
సెక్షన్ 80DD కింద దివ్యాంగులపై ఆధారపడిన ఖర్చుల కింద పొందే ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. సుమారు 80 శాతం వరకు అంగ వైకల్యం ఉన్న వారికి రూ.77వేల మినహాయింపుతోపాటు తీవ్రమైన అంగవైకల్యాల కోసం రూ.1.25 లక్షల వరకు క్లెయిమ్ చేసుకునే వీలు ఉంటుంది.

సెక్షన్ 80E:
ఈ సెక్షన్ కింద ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ చెల్లింపు కింద ప్రయోజనాలను క్లెయియ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం తీసుకునే విద్యా రుణంపై చెల్లించే వడ్డీకి సెక్షన్ 80 E కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డిడక్షన్ అమౌంట్ పై ఎటువంటి లిమిట్ లేదు.

Also Read: Tata Altroz Racer Review: ఆల్ట్రోజ్ రేసర్‌ కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

సెక్షన్ 80EE:
ఈ సెక్షన్ కింద ఇంటి కోసం తీసుకునే హోమ్ లోన్ పై చెల్లించే వడ్డీకి డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆదాయం పన్ను చట్టంలోనిసెక్షన్ 24 ప్రకారం.. రూ.2 లక్షల పరిమితికి మించి రూ.50వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

సెక్షన్ 80G:
ఆమోదం తెలిపిన స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాల కింద డిడక్షన్ క్లెయిమ్ పొందవచ్చు. ప్రధాన సామాజిక సంస్థలకు విరాళాల కోసం జాతీయ రక్షణ నిధి, ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి, జాతీయ పిల్లల నిధి వంటి వాటికి 50 లేదా 100 వరకు డిడక్షన్ పొందవచ్చు.

సెక్షన్ 80 GG:
సెక్షన్ 80 GG ప్రకారం..హెచ్ఆర్ఏ లేని ఉద్యోగులు చెల్లించే రూం రెంట్ కింద ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే రూం రెంట్ ఉడ్యోగుడకి వచ్చే ఆదాయంలో 25 శాతం కంటే తక్కువగా ఉండాలి. లేదా నెలకు గరిష్టంగా 5వేలు లేదా మొత్తం ఆదాయంలో 10 శాతానికి మించి రూం రెంట్ చెల్లించాలి.

Also Read: Car Offers: మారుతి ఆఫర్ల జాతర.. ఒక్కోదానిపై లక్షల్లో డిస్కౌంట్లు!

సెక్షన్ 80 TTA:
ఈ సెక్షన్ కింద సేవింగ్ అకౌంట్ వడ్డీ కింద ప్రయోజనాలు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదైనా బ్యాంక్, పోస్టాఫీసు లేదా కో ఆపరేటివ్ సొసైటీలో సేవింగ్ అకౌంట్ ఉన్న వారు అత్యధికంగా రూ.10వేల తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు.

సెక్షన్ 80 U:
దివ్యాంగ పన్ను చెల్లింపుదారులు మినహాయంపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. సాధారణ అంగ వైకల్యం ఉన్న వారికి రూ.75వేలు నిర్ణయించగా..తీవ్ర అంగవైకల్యం వారికి రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది.

సెక్షన్ 80 DDB:
హెల్త్ ఇష్యూస్‌లో ప్రధానంగా చికిత్స కోసం ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. 60 ఏళ్ల వయస్సు వరకు రూ.40వేల వరకు మినహాయింపును క్లెయిమ్ ఉంటుంది. ఇక, సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.లక్ష వరకు అనుమతి ఇవ్వనున్నారు.

Also Read: ఈ ఐదు కార్లపైనే అందరిచూపు.. మైండ్ బ్లాక్ చేస్తున్న రేంజ్.. దుమ్ములేచిపోద్ది!

సెక్షన్ 80 GGB & 80GGC:
ఈ సెక్షన్ కింద కంపెనీలతోపాటు వ్యక్తులు రాజకీయ పార్టీకి చేసిన విరాళాలకు తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News