Big Stories

Bajaj CNG Bike: బజాజ్ తొలి CNG బైక్ లాంచ్‌కు సిద్ధం.. 50 శాతం ఇంధన ఖర్చు ఆదా.. ధర చాలా తక్కువ..!

Bajaj CNG Bike: బజాజ్ ఆటో నుంచి సరికొత్త CNG బైక్ జూన్ 2024లో భారతదేశంలో విడుదల కానుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్‌గా కంపెనీ పేర్కొంది. దీనికి ‘బజాజ్ బ్రూజర్’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బైక్‌కు సంబంధించిన ఫొటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాల విషయానికొస్తే..

- Advertisement -

బజాజ్ CNG బైక్‌లు అత్యంత తక్కువ ధర, అధిక మైలేజీతో బైక్ ప్రియులను అట్రాక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ CNG బైక్ పెట్రోల్ బైక్ కంటే చాలా చౌకగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సిఎన్‌జీ బైక్ జూన్ 18, 2024న విడుదల కానుంది. కాగా బజాజ్ CNG బైక్ పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే 50 శాతం వరకు ఇంధన ఖర్చులను ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది.

- Advertisement -

ఈ వినూత్న బైక్ 100-125సీసీ కేటగిరీలో రయ్ రయ్‌మనేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ బైక్ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీని బట్టి చూస్తే.. ఈ బైక్ ఫీచర్లలో కొన్నింటిని అంచనా వేయవచ్చు. ఈ వినూత్న బైక్‌లో స్ట్రెయిట్ సీట్, హాయిగా కూర్చోవడానికి హ్యాండిల్ బార్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు చేతులకు సేఫ్టీగా హ్యాండ్ గార్డ్‌లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే కాళ్లు పెట్టుకునే ప్లేస్ చాలా ఎత్తుగా లేదా చాలా తక్కువగా ఉండదు. ఇది సరిగ్గా మధ్యలో ఉంటుంది.

Also Read: ప్రపంచంలోనే తొలి CNG బైక్.. బజాజ్ నుంచి.. జూన్ 18న లాంచ్!

ఈ బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, పిలియన్ కోసం గ్రాబ్ రైల్, సేఫ్టీ కోసం ఇంజన్ వైపు లెగ్ గార్డ్‌లు, స్టైలిష్ బ్లాక్ ఎగ్జాస్ట్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఇది పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంది. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే.. CNG ట్యాంక్ దాని బలమైన ఫ్రేమ్‌లో సౌకర్యవంతంగా సరిపోతుంది.

అలాగే ఇందులో సిఎన్‌జి అయిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో చిన్న పెట్రోల్ ట్యాంక్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీని సస్పెన్షన్ సిస్టమ్‌లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్ వంటివి ఉన్నాయి. ఇక బ్రేకింగ్ కోసం.. ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ అందించారు.

ఇందులో సింగిల్-ఛానల్ ABS కూడా ఉంది. ఇది సడన్ బ్రేకింగ్ సమయంలో వాహనం బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. దీని ధర విషయానికొస్తే.. ఇది దాదాపు రూ.80,000 (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఇది తక్కువ బడ్జెట్ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఎంపిక. CNG బైక్‌ను విడుదల చేయనున్న మొదటి కంపెనీగా అవతరించడం ద్వారా మోటార్‌సైకిల్ పరిశ్రమలో సంచలనం సృష్టించడానికి బజాజ్ సిద్ధంగా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News