Big Stories

Hyundai Inster EV Teased: టాటాతో పోటీకి సిద్ధమైన హ్యుందాయ్.. 355 కిమీ రేంజ్‌తో కొత్త ఈవీ!

Hyundai Inster EV Teased Launch: దేశంలో గత కొంతకాలంగా ఎలక్ట్రిక్ కార్లకు (EV)  విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఈవీ సెగ్మెంట్‌లో టాటా మోటర్స్ ఇప్పటికీ నంబర్ వన్‌గా తన హవాని కొనసాగిస్తుంది. దేశంలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలలో టాటా మోటార్స్ మాత్రమే 65 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. వీటిలో టాటా పంచ్ EV, టాటా నెక్సాన్ EV, టాటా టియాగో EV, టాటా టిగోర్ EV అత్యంత పాపులర్ అయిన ఎలక్ట్రిక్ కార్లు.

- Advertisement -

అయితే ఇప్పుడు హ్యుందాయ్ టాటా పంచ్ EVకి పోటీగా కొత్త సబ్-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయబోతుంది. హ్యుందాయ్ తన రాబోయే ఎలక్ట్రిక్ SUV హ్యుందాయ్ ఇన్‌స్టర్ టీజర్‌ను విడుదల చేసింది. హ్యుందాయ్ రాబోయే ఎలక్ట్రిక్ SUVలో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి, పవర్‌ట్రెయిన్, డ్రైవింగ్ రేంజ్ గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

హ్యుందాయ్ తన కొత్త ఇన్‌స్టర్‌ EVని టీజ్ చేసింది. టీజ్ చేసిన ఫోటోలో రాబోయే SUV బానెట్, విండ్‌స్క్రీన్, మొత్తం వైపు సిల్హౌట్ క్లియర్‌గా చూడవచ్చు. అదే సమయంలో EVలో ఛార్జింగ్ పోర్ట్ ఫ్రంట్‌లో ఉంది. ఇది టాటా పంచ్ EVలో మధ్యలో ఉంటుంది. అదనంగా హ్యుందాయ్ ఇన్‌స్టర్ కొత్త పిక్సెల్-స్టైల్ క్వాడ్-ఎలిమెంట్ సర్క్యులర్ LED DRL, పిక్సెల్-స్టైల్ 7-ఎలిమెంట్ LED టర్న్ ఇండికేటర్‌లను కూడా ఉంటాయి. మరోవైపు హ్యుందాయ్ ఇన్‌స్టర్  అల్లాయ్ వీల్స్ చాలా స్పెషల్‌గా కనిపిస్తాయి. హ్యుందాయ్ ఎన్‌స్టర్‌లో రూఫ్ రైల్స్, బాడీ క్లాడింగ్, హై గ్రౌండ్ క్లియరెన్స్ వంటి క్రాస్‌ఓవర్ బిట్స్ కూడా తీసుకొచ్చారు.

Also Read: వావ్.. ప్రపంచంలోనే తొలి CNG బైక్.. ఇక పెట్రోల్ అక్కర్లేదు!

హ్యుందాయ్ కంపెనీ ప్రకారం SUV ఒకే ఛార్జ్‌తో 355 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది. రాబోయే హ్యుందాయ్ ఇన్‌స్టర్ EV డ్రైవింగ్ రేంజ్, టెక్నాలజీలో కూడా టాటా పంచ్‌ని బీట్ చేసేందుకు సిద్ధంగా ఉంది.  హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 355 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే రాబోయే ఎలక్ట్రిక్ SUV బ్యాటరీ, మోటార్ స్పెక్స్‌ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. హ్యుందాయ్ ఇన్‌స్టర్ EV భారతదేశంలో ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUV అయిన టాటా పంచ్ EVతో పోటీ పడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News