Big Stories

Hyundai Launch New EV Models: హ్యుందాయ్ నుంచి నాలుగు కొత్త కార్లు.. సింగిల్ ఛార్జ్‌తో 452 కిమీ రేంజ్!

Hyundai Launch Four New EV Models: గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం టాటా మోటార్స్ ఈ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలలో టాటా మోటార్స్ మాత్రమే 65 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. అయితే, హ్యుందాయ్ ఇండియా రానున్న రోజుల్లో 4 కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటిలో హ్యుందాయ్ క్రెటా EV కూడా ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

హ్యుందాయ్ క్రెటా EV టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ రాబోయే హ్యుందాయ్ క్రెటా EVని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దేశంలోని రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అవసరమైన విడి భాగాల స్థానిక ఉత్పత్తిని పెంచడం ద్వారా EVల ధరలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో బ్యాటరీ సెల్‌లు, బ్యాటరీ ప్యాక్‌లు, పవర్ ఎలక్ట్రానిక్స్, డ్రైవ్ ట్రైన్‌లు ఉన్నాయి. ఇది కాకుండా దేశ ప్రజలకు అనుగుకూలంగా వీటి ధరలు ఉండేలాని అనుకుంటుంది.

- Advertisement -

కంపెనీ హ్యుందాయ్ క్రెటా EVని చెన్నై ప్లాంట్‌లో స్టాండర్డ్ క్రెటా తరహాలో ఉత్పత్తి చేస్తుంది. అంటే రాబోయే SUV క్రెటాతో సమానంగా ఉంటుంది. ఇది ధరను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అయితే Creta EV‌లో కొన్ని స్టైలింగ్ మార్పులు ఉంటాయి. రాబోయే క్రెటా EV ఒక క్లోజ్డ్ గ్రిల్‌తో పాటు కొద్దిగా డిఫరెంట్ ఫ్రంట్, బ్యాక్ బంపర్‌లను కలిగి ఉంటుంది. ఇది కాకుండా అల్లాయ్ వీల్స్ ఏరో-ఆప్టిమైజ్డ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. మరోవైపు కారు క్యాబిన్ వేరే స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్ కోసం ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.

Also Read: సిట్రోయెన్ నుంచి ధోని స్పెషల్ ఎడిషన్.. ఈ కార్లు కావాలంటే లక్ ఉండాలి!

హ్యుందాయ్ ఇండియా మొట్టమొదటి మాస్-మార్కెట్ EV విదేశాల్లో అందుబాటులో ఉన్న కొత్త జనరేషన్ కోనా ఎలక్ట్రిక్  ఎంట్రీ లెవల్ వెర్షన్‌తో తన ఎలక్ట్రిక్ మోటార్‌ను తీసుకురానుంది. ఇది 450 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. ఈ ఫ్రంట్ మౌంటెడ్ మోటార్ సుమారు 138bhp పవర్‌ని 255Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. రాబోయే హ్యుందాయ్ క్రెటా EV మోటారు 45kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది వినియోగదారులకు సింగిల్ ఛార్జ్‌పై 452 కిమీల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News