Big Stories

Hyundai Inster EV Micro SUV: వాసివాడి తస్సాదియ్యా.. ఫుల్ ఛార్జింగ్‌తో 355 కి.మీ మైలేజీ ఇచ్చే కొత్త ఎలక్ట్రిక్ కారు.. రోడ్లపై పరుగులే!

Hyundai Inster EV Micro SUV: ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా జోరుగా పరుగులు పెడుతున్నాయి. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లలో ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో టాటా మోటార్స్ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ కంపెనీకి గట్టి పోటీ ఇచ్చేందుకు హ్యుందాయ్ ప్రయత్నిస్తోంది. ఇందులో బాగంగానే కొత్త కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తుంది. ఇప్పటికే హ్యుందాయ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కోనా ఓవర్సీస్‌లో మంచి క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది. కానీ భారత మార్కెట్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

- Advertisement -

దీంతో ఈ దక్షిణ కొరియా బ్రాండ్ ఇప్పుడు మరొక సరికొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా జరిగిన 2024 బుసాన్ ఇంటర్నేషనల్ మొబిలిటీ షోలో కొత్త సబ్ కాంపాక్ట్ ఈవీని కంపెనీ ఆవిష్కరించింది. ఈ కొత్త ‘హ్యుందాయ్ ఇన్‌స్టర్’ ఎలక్ట్రిక్ కారు తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజీ కోసం చూసే వారికి బెస్ట్ అవుతుందని కంపెనీ పేర్కొంది. అలాగే దీనిని ఇతర ఎలక్ట్రిక్ కార్ల ఆధారంగా రూపొందించినట్లు తెలిపింది.

- Advertisement -

అంతేకాకుండా ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు, టెక్నాలజీ పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని కంపెనీ చెప్పుకొచ్చింది. ఈ కొత్త హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారును 2021లో కొరియాలో లాంచ్ అయిన కాస్‌పర్ ప్రేరణతో తీసుకువచ్చారు. ఈ హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరీయర్‌తో బ్లాక్ రూఫ్‌ని కలిగి ఉంది. ఇందులో 10.25 అగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను అందించినట్లు తెలుస్తోంది.

Also Read: లాంచ్‌కు సిద్ధమైన నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్.. ఇక ఆ మోడళ్లకు గట్టి పోటీ తప్పదు..!

అలాగే 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను ఇందులో అమర్చారు. అంతేకాకుండా ఈ ఇన్‌స్టర్‌లోని ఇంటీరియర్లు కొరియన్ బ్రాండ్ మాదిరిగానే ఫుల్ ప్యాక్డ్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ఉండే ఇంటీరియర్ స్పేస్, అలాగే పొడిగించిన బాడీ అండ్ వీల్ బేస్ ఈ కొత్త ఇన్‌స్టర్‌ని సరికొత్త లుక్‌లో చూపిస్తాయి. వీటితో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి ఇతర ఫీచర్లు ఇంటీరియర్‌లతో మరింత స్టైల్ అండ్ ప్రీమియంగా ఉంటుంది.

అలాగే ఫ్రంట్ బెంచ్ సీట్ ఆప్షన్, హీటెడ్ ఫ్రంట్ సిటింగ్, అన్ని సీట్లకు ప్లాట్ ఫోల్డింగ్, స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఇన్‌స్టర్‌లో ఉండే రెండో వరుస సీట్లను మడతపెట్టుకోవచ్చు కూడా. ఇక దీని బ్యాటరీ ప్యాక్డ్ విషయానికొస్తే.. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. అందులో లో-రేంజ్ 42 కిలో వాట్ల.. లాంగ్ రేంజ్ 49 కిలో వాట్ల బ్యాటరీ ఆప్షన్స్‌ను కలిగి ఉన్నాయి.

Also Read: Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బైక్ రెడీ.. లాంచ్ డేట్, ధర, స్పెసిఫికేషన్లు ఇవే..!

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఈ రెండు మోడళ్లు ఒకే మోటారుతో నడుస్తాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ కారు బేస్ వేరియంట్ 97బిహెచ్‌పిని, లాంగ్ రేంజ్ 115బిహెచ్‌పీ శక్తిని జనరేట్ చేస్తుంది. అయితే ఈ రెండూ 147 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక దీని మైలేజీ విషయానికొస్తే.. దీని లాంగ్ రేంజ్ ఫుల్ ఛార్జింగ్‌తో 355 కి.మీ, అలాగే స్టాండర్డ్ వేరియంట్ 300 కి.మీ మైలేజీని అందిస్తాయి. ఇక దీని స్టాండర్డ్ వేరియంట్ గరిష్ట వేగం ఒక గంటకు 140కిలోమీటర్లు, లాంగ్ రేంజ్ వేరియంట్ గరిష్ట వేగం ఒక గంటకు 150 కి.మీ పరుగులు పెడతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News