Big Stories

Honda Magical Monsoon 2024: హోండా కార్లపై మాన్‌సూన్ డీల్స్.. అదనంగా గిఫ్ట్‌లు కూడా.. ఎప్పటి వరకు ఉంటుందంటే..?

Honda Offers Monsoon Deals: వర్షాకాలంలో తన కార్ల సేల్స్ పెంచుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హూండా కార్స్ ఇండియా లిమిటెడ్ తాజాగా అదిరిపోయే డీల్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ‘హూండా మ్యాజికల్ మాన్సూన్’ పేరుతో ప్రమోషనల్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ ప్రమోషనల్ ప్రోగ్రామ్ జూలై 1 నుంచి జూలై 31 వరకు కొనసాగనుంది. ఇందులో హూండా కార్ కొనుగోలు చేసిన కస్టమర్లకు అనేక ప్రయోజనాలు, అదిరిపోయే గిఫ్ట్‌లు అందించనున్నారు.

- Advertisement -

ఈ ఆఫర్స్ అనేవి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హూండా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉండనున్నాయి. దీని ద్వారా కంపెనీ ఈ వర్షాకాలంలో కార్ల కొనుగోలును మరింత లాభదాయకంగా పెంచుకునే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ హూండా మ్యాజికల్ మాన్సూన్ ప్రకారం.. హూండా సిటీ, హూండా అమేజ్, హూండా ఎలివేట్, హూండా సిటీ ఇ:హెచ్‌ఇవి హైబ్రిడ్ వేరియంట్‌తో పాటు మరిన్ని కార్లపై ఆఫర్స్ వర్తిస్తాయి.

- Advertisement -

కాగా హూండా కార్లపై వినియోగదారులు ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు అదనంగా రూ.75,000 వరకు విలువైన గిఫ్ట్‌లు కూడా పొందొచ్చు. అంతేకాకుండా జూలై 1 నుంచి జూలై 31 వరకు నిర్వహించే ఈ హూండా మ్యాజికల్ మాన్సూన్‌ ప్రమోషనల్ కార్యక్రమంలో టెస్ట్ డ్రైవ్‌పై కూడా కళ్లు చెదిరే గిఫ్ట్‌లను సొంతం చేసుకోవచ్చు. అందువల్ల మంచి ఆఫర్లు, అలాగే బహుమతుల కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు ఇదే మంచి ఛాన్స్. ఎన్నో రకాల ప్రయోజనాలు పొందే సదావకాశం ఇప్పుడు వచ్చింది. కాగా ఈ ప్రమోషనల్ ప్రోగ్రామ్ ద్వారా స్విట్జర్లాండ్ పర్యటన కోసం లక్కీ డ్రా కూడా ఉంది. ఇలాంటి ఆఫర్‌లకు భారతీయ కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని, రానున్న నెలల్లో విక్రయాల శాతం పెరగవచ్చని కంపెనీ భావిస్తోంది.

Also Read: అదిరిపోయే న్యూస్.. మీ డ్రీమ్ మారుతీ నిజం చేస్తోంది!

ఇకపోతే హూండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈ ఏడాది గత నెల అంటే జూన్ 2024 సేల్స్‌లో కాస్త వెనకబడింది. అనుకున్నంత సేల్స్‌ను నమోదు చేయలేకపోయింది. గతేడాది జూన్ 2023లో దేశీయ సేల్స్ 5,080 యూనిట్లు నమోదు చేసింది. అయితే ఈ ఏడాది జూన్ 2024లో దేశీయ సేల్స్ 4,804గా నమోదు చేసింది. అంటే గతేడాది జూన్ కంటే ఈ ఏడాది జూన్ సేల్స్ 5 శాతం తగ్గుముఖం పట్టాయి. అయితే ఒక్క జూన్ 2024లోనే కాకుండా.. అంతకు ముందు నెల మే 2024లో కూడా కంపెనీ సేల్స్ బాగా తగ్గాయి. మే 2023 కంటే తక్కువగానే నమోదు అయ్యాయి.

అయితే కంపెనీ తన కార్ల ఎగుమతుల్లో మాత్రం మంచి వృద్ధిని సాధించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ 2023 జూన్‌లో 2,112 యూనిట్లను ఎగుమతి చేసింది. అదే సమయంలో 2024 జూన్‌లో కంపెనీ 4,972 యూనిట్లను ఎగుమతి చేసి అబ్బురపరచింది. దీని ప్రకారం చూస్తే దాదాపు 135 శాతం వృద్ధిని సాధించిందని చెప్పుకోవచ్చు. ఇలా కంపెనీ దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయంగా కూడా తన ఉనికిని విస్తరించడానికి విశ్వప్రయత్నాలు చేసి మంచి ఫలితాల్ని అందుకుంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News