Big Stories

Upcoming Honda Scooters: ఎన్‌ఫీల్డ్‌తో పోటీకి సిద్ధమైన హోండా.. త్వరలో రెండు స్టన్నింగ్ స్కూటర్లు!

Upcoming Honda Scooters: హోండా టూవీలర్ కంపెనీ నుంచి యాక్టివా అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటిగా ఉంది. కంపెనీ ఈ స్కూటర్‌ను యువత కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ఈ సిరీస్‌లో హోండా రెండు కొత్త స్కూటర్లు హోండా ఫోర్జా 350, హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌లను త్వరలో విడుదల చేయనుంది. వీటికోసం హోండా లవర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఫోర్జా 350లో బుల్లెట్ పవర్‌తో 330 సిసి ఇంజన్ ఉంటుంది. అయితే, యాక్టివా ఎలక్ట్రిక్ ఫ్యూచరిస్టిక్ లుక్‌తో రానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో 349 సిసి ఇంజన్ ఉంటుంది.

- Advertisement -

Honda Forza 350
హోండా ఫోర్జా 350 గురించి చెప్పాలంటే.. ఇది ముందు వైపు నుండి చాలా బాక్సీగా కనిపిస్తుంది. ఇందులో డిజిటల్ కన్సోల్, టైర్ వరకు పెద్ద హెడ్‌లైట్ ఉంటుంది. సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇది స్ప్లిట్ సీటుతో రానుంది. అంతే కాకుండా ఇందులో మంచి లెగ్ స్పేస్‌ అందుబాటులో ఉంటుంది. దీనికి హై ఎండ్ ఎగ్జాస్ట్ ఇవ్వబడింది. ఇది రెండు టైర్లలో అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది. 330 సిసి ఇంజన్ వస్తోంది. 29.2 PS పవర్, 31.5 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. లీటర్‌కు 30 kmpl మైలేజ్ ఇస్తుంది.

- Advertisement -

మీడియా నివేదికల ప్రకారం హోండా ఫోర్జా 350 దాదాపు 30kmpl అధిక మైలేజీని ఇస్తుంది. బాక్సీగా కనిపించే ఈ స్కూటర్ బరువు 184 కిలోలు. హోండా ఈ సాలిడ్ స్కూటర్ ప్రస్తుతం ఒక వేరియంట్ ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. సేఫ్టీ పరంగా ఈ స్కూటర్ ముందు, వెనుక రెండు టైర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. బైక్ 29.2 ps పవర్ రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ భారత్‌లో విడుదల తేదీని వెల్లడించలేదు. దీనిని 2025లో ప్రవేశపెట్టవచ్చని అంచనా. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ రూ. 3.70 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.

హోండా ఫోర్స్ 350 హై స్పీడ్ స్కూటర్. దీని గరిష్ట వేగం గంటకు 140 కిమీ. స్కూటర్ ఫ్రంట్ ఆప్రాన్‌లో డ్యూయల్ LED హెడ్‌లైట్ అందుబాటులో ఉంటాయి. ఈ స్కూటర్ 15-అంగుళాల ఫ్రంట్, 14-అంగుళాల బ్యాక్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. హోండా ఈ స్కూటర్‌లో LED టైలాంప్, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్‌ను అందిస్తుంది. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కలిగి ఉంది.

Activa EV
Activa ev అధిక పవర్ బ్యాటరీ బ్యాకప్ సెటప్‌తో వస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ సుమారు 236 కిలోమీటర్లు నడుస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం ఒక గంటలో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇది హై స్పీడ్ స్కూటర్. ఇది 105 kmph గరిష్ట వేగాన్ని ఇస్తుంది. ప్రస్తుతానికి, కంపెనీ తన కొత్త తరం స్కూటర్ లాంచ్ తేదీ గురించి సమాచారాన్ని వెల్లడించలేదు. ఈ స్కూటర్‌ను జూలై 2024లో విడుదల కావచ్చు. దీని ధర రూ. 1.20 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంటుంది.

హోండా యాక్టివా ఈవీ ఫీచర్ల విషయానికి వస్తే బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ మీటర్ ఉంటుంది. రెండు టైర్లలో సింపుల్ హ్యాండిల్ బార్, డిస్క్ బ్రేక్‌లు అందుబాటులో ఉంటాయి.స్కూటర్ పొడవు 1761mm మరియు వెడల్పు 710mm. స్కూటర్ సౌకర్యవంతమైన ప్రయాణానికి ముందువైపు టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్‌లను, వెనుకవైపు హైడ్రాలిక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News