Big Stories

Two Wheeler Sales May 2024: రికార్డులు బ్రేక్.. భారీగా పెరిగిన హీరో స్ప్లెండర్ సేల్స్..!

Two Wheeler Sales May 2024: దేశంలో ద్విచక్ర వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. గత నెలలో మరోసారి హీరో స్ప్లెండర్ సేల్స్‌లో అగ్రస్థానాన్ని సాధించింది. హీరో స్ప్లెండర్ మేల నెలలో మొత్తం 3,04,663 యూనిట్లను విక్రయించింది. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అంటే మే, 2023లో హీరో స్ప్లెండర్ మొత్తం 3,42,526 యూనిట్ల సేల్ చేసింది. వార్షిక ప్రాతిపదికన హీరో స్ప్లెండర్ విక్రయాల్లో 11.05 శాతం క్షీణత కనిపించింది. ఈ సేల్‌తో ఒక్క హీరో స్ప్లెండర్ మాత్రమే 26.68 శాతం మార్కెట్‌ వాటను కైవసం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు గత నెలలో అత్యధికంగా సేల్ అయిన 10 ద్విచక్ర వాహనాల విక్రయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

ఈ విక్రయాల జాబితాలో బజాజ్ పల్సర్ నాలుగో స్థానంలో, హోండా యాక్టివా రెండో స్థానంలో నిలిచాయి. హోండా మొత్తం 2,16,352 యూనిట్లు హోండా యాక్టివా స్కూటర్‌లు అమ్మకాలు జరిపింది. అదే సమయంలో ఈ సేల్స్‌లో హోండా షైన్ మూడవ స్థానంలో ఉంది. హోండా షైన్ మొత్తం 1,49,054 యూనిట్ల టూవీలర్లను విక్రయించింది. హోండా షైన్ అమ్మకాలలో వార్షికంగా 43.74 శాతం పెరుగుదల కనిపించింది.

- Advertisement -

Also Read: షావోమా నుంచి బుజ్జి EV.. సింగిల్ ఛార్జ్‌తో 1200కిమీ రేంజ్.. బుడ్డోడే గానీ గట్టోడు!

ఈ విక్రయాల జాబితాలో బజాజ్ పల్సర్ నాలుగో స్థానంలో ఉంది. బజాజ్ పల్సర్ మొత్తం 1,28,480 యూనిట్ల మోటార్‌ బైక్‌లను విక్రయించింది. ఇది కాకుండా ఈ విక్రయాల జాబితాలో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఐదవ స్థానంలో ఉంది.  హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ మొత్తం 87,143 యూనిట్ల అమ్మకాల జరిపింది. అయితే మోటార్‌సైకిల్ విక్రయాలలో వార్షికంగా 20 శాతానికి పైగా క్షీణత నమోదైంది.

మరోవైపు ఈ విక్రయాల జాబితాలో టీవీఎస్ రైడర్ పదో స్థానంలో నిలిచింది. మే నెలలో టీవీఎస్ జూపిటర్ మొత్తం 75,838 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. ఇది కాకుండా ఈ విక్రయాల జాబితాలో సుజుకి యాక్సెస్ ఏడవ స్థానంలో ఉంది. యాక్సెస్ మొత్తం 64,812 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది.

Also Read: ఓలా ఎలక్ట్రిక్‌లో కొత్త ఫీచర్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

అదే సమయంలో TVS XL ఈ విక్రయాల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. టీవీఎస్ ఎక్స్‌ఎల్ మొత్తం 40,394 యూనిట్లను విక్రయించింది. ఇది కాకుండా,ఈ విక్రయాల జాబితాలో TVS అపాచీ తొమ్మిదో స్థానంలో ఉంది. కాగా ఈ విక్రయాల జాబితాలో టీవీఎస్ రైడర్ పదో స్థానంలో ఉంది. టీవీఎస్ రైడర్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 8.16 శాతం పెరిగాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News