Big Stories

GT Texa Electric Bike Launch: కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 130 కి.మీ మైలేజీ.. ధర తక్కువే..!

GT Texa Electric Bike Launched at Rs 1.19 Lakhs: భారత మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లతో హవా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ స్కూటర్లే కనిపిస్తున్నాయి. ఎలాంటి పెట్రోల్‌తో అవసరం లేకుండా కేవలం విద్యుత్‌తో మాత్రమే పరుగులు తీసే ఈ స్కూటర్లు అధిక మైలేజీని కూడా అందిస్తాయి. అందువల్లనే వాహన ప్రియులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీటి ప్రభావం ఎక్కువగానే ఉంది. కానీ ఎలక్ట్రిక్ బైక్‌లు మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. అందువల్ల ఇలాంటి సమయంలో తమ ఎలక్ట్రిక్ బైక్‌ను బడ్జెట్ ధరలో, అధిక మైలేజీతో లాంచ్ చేస్తే మంచి పాపులారిటీ వస్తుందని కొన్ని కంపెనీలు కొత్త కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను భారత మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లోకి వచ్చింది.

- Advertisement -

ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ జీటీ ఫోర్స్ ఈవీ తాజాగా జీటీ టెక్సా ఈవీ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. అధునాతన టెక్నాలజీ పరిజ్ఞానంతో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. కాగా ఈ ఎలక్ట్రిక్ బైక్ తయారీ కంపెనీ ఇప్పటికే జీటీ లైన‌ప్‌లో వెగాస్, జీటీ వన్ ప్లస్ ప్రో, జీటీ రైడ్ ప్లస్, జీటీ డ్రైవ్ ప్రో వంటి మోడళ్లను అమ్ముతుంది.

- Advertisement -

ఇక ఇప్పుడు జీటీ టెక్సా ఈవీ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకొచ్చింది. ఈ బైక్ రద్దీగా ఉండే నగరాలకు మంచి ఎంపికని కంపెనీ తెలిపింది. ఈ బైక్ 3.5 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌పై ఏకంగా 120 నుంచి 130 కి.మీ మైలేజీని అందిస్తుంది. జీటీ టెక్సా ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 80 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. దీనిని ఆటోకట్‌తో కూడిన మైక్రో ఛార్జర్‌తో 4 నుంచి 5 గంటల్లోపే ఫుల్‌గా ఛార్జింగ్ చేస్తుంది.

Also Read: ఫిదా చేసే లుక్‌లో జావా యెజ్డీ 350 బైక్స్‌.. అల్లాయ్, స్పోక్ వీల్స్ వేరియంట్‌లో విడుదల..!

ఈ బైక్‌ను రోడ్లపై దాదాపు 18 డిగ్రీల కర్వ్ ఉన్నా నడపవచ్చని కంపెనీ తెలిపింది. ఇక ఈ జీటీ టెక్సా బైక్‌ను బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ బైక్ నడిపే రైడర్ల సేఫ్టీ కోసం ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేకులు అందించారు. అంతేకాకుండా ఎక్స్‌ట్రా సేఫ్టీ కోసం ఇందులో ఇ-ABS కంట్రోలర్‌ను అమర్చారు. కాగా ఈ బైక్‌ను రిమోట్ లేదా కీతో స్టార్ట్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. దీని హ్యాండిల్‌బార్ మధ్యలో 17.78 సెంటీమీటర్ల LED డిస్‌ప్లేను అందించారు

వీటితో పాటు టర్న్ సిగ్నల్ ల్యాంప్స్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, టెయిల్‌లైట్, డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వంటి మరిన్ని ఫీచర్లను ఇందులో అందించారు. కాగా ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర విషయానికొస్తే.. కంపెనీ దీనిని రూ.1.19 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు అందుబాటులో ఉంచింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News