Big Stories

Ampere Nexus EV Scooter: ఇన్నాళ్లకు దొరికింది.. రూ.1 లక్షకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ తెలిస్తే..!

Ampere Nexus EV Scooter Range and Price: పెట్రోలు ధరల పెరుగుదల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీలు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఇటీవలే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ నెక్సస్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ పేరు ఆంపియర్ నెక్సస్. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 136 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.ఈ స్కూటర్ ఎలాంటి ఫీచర్లతో వస్తుందో తెలుసుకుందాం.

- Advertisement -

నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు
ఈ స్కూటర్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. దీనితో పాటు 12 అంగుళాల అల్లాయ్ వీల్ కూడా ఇందులో చూడొచ్చు. దీనితో పాటు మీరు 7.0 అంగుళాల టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీని కూడా ఉంటుంది. ఇది అన్ని స్కూటర్లలో అందుబాటులో ఉన్న లేటెస్ట్ ఫీచర్. Nexus ఎలక్ట్రిక్ స్కూటర్‌లో నావిగేషన్ కూడా అందుబాటుటో ఉంది.

- Advertisement -

నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్‌లు
నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 kwh LFP బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 3.3 kw, 4 kw పవర్ రిలీజ్ చేసే మిడ్-మౌంటైన్ పర్మనెంట్ మోటార్‌ను కలిగి ఉంటుంది. స్కూటర్‌లోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే అది 136 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. ఇది నాలుగు రైడ్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇందులో మీకు ఎకో, సిటీ, పవర్, లింప్ హోమ్ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 93 కిమీ. మీరు సిటీ మోడ్‌లో 63 kmph, ఎకో మోడ్‌లో 42 kmph వేగంతో దీన్ని డ్రైవ్ చేయవచ్చు. ఇందులో 30 శాతం జెరా బ్యాటరీ ప్యాక్ ఉంది.

Also Read: యమహా నుంచి స్పెషల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. అదరగొడుతున్న టెక్నాలజీ!

నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్కూటర్ ధర
నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర గురించి చెప్పాలంటే దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.09 లక్షలు. ఇది చెన్నై షోరూమ్ ధర. ఈ స్కూటర్ పూర్తిగా ఇండియాలో తయారైన స్కూటర్. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం చెన్నైలోని 11 టచ్ పాయింట్లలో అందుబాటులో ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News