Big Stories

Gold Rate: ఐదేళ్లలో 60 శాతం పెరుగుదల.. ధరే బంగారమాయేనే..

gold-price-hike

Gold Rate: అక్షయ తృతీయకు వారం రోజులు ఉండగానే ధర పెరగడం పసిడిప్రియులకు షాక్ అనే చెప్పాలి. అక్షయ అంటే క్షయం లేనిది. ఆ రోజు బంగారం కొంటే.. ఎన్నటికీ సంపద తరిగిపోదనే భావన అత్యధికుల్లో ఉంది. అందుకే పర్వదినాల్లో బంగారం కొనుగోళ్లు బాగా పుంజుకుంటాయి. ఈ నెల 1 నుంచి పుత్తడి కొనుగోళ్ల నిబంధనలు మారాయి. సో.. కొనుగోలుదారులు జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -

బంగారం స్వచ్ఛతను తెలిపేందుకు గతంలో స్వర్ణాభరణాలపై హాల్ మార్క్ వేసేవారు. భారత నాణ్యతా ప్రమాణాల సంస్థ(BIS) దానిని నిషేధించింది. దాని స్థానంలో 6-డిజిట్ ఆల్ఫాన్యూమరిక్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను(HUID) ప్రవేశపెట్టింది. ఎవరైనా ఆభరణాలు కొనదలుచుకుంటే దీనిని గమనించాల్సిందే. మీరు కొనే ఆభరణాలపై మూడు రకాల మార్కులు తప్పనిసరిగా ఉండాలి. బీఐఎస్ లోగో, దాని స్వచ్ఛత వివరాలు, 6-డిజిట్ నంబర్‌ను గమనించుకోవాలి. అలాగే మన దగ్గర గతంలో ఉన్న హాల్‌మార్క్‌డ్ ఆభరణాల గురించి ఎలాంటి చింత పెట్టుకోనక్కర్లేదు. వాటికీ విలువ ఉంటుంది. బీఐఎస్ నిబంధనల్లో 49 సెక్షన్‌ను అనుసరించి ఆ విలువను లెక్కగడతారు.

- Advertisement -

బంగారం ధరల్లో పెరుగుదలే కానీ.. తగ్గుదల ఉండదు. రానున్న ఏడాది కాలంలోనే తులం బంగార రూ.లక్షకు చేరుతుందనేది మార్కెట్ నిపుణుల అంచనా. 1965లో 24 కేరట్ల పసిడి పది గ్రాముల ధర రూ.71.75 మాత్రమే. నాటి నుంచి ఆ ధర అలా పైపైకి ఎగబాకుతూనే ఉంది. 2000 సంవత్సరంలో తగ్గినట్టే తగ్గి.. ఆ తర్వాత ఐదేళ్లలోనే ఏకంగా 60 శాతానికి పైగా పెరిగింది. మళ్లీ 2020లో ఒక్కసారిగా జంప్ వచ్చింది. ఆ ధర రూ.48 వేలకు చేరింది. ఈ మూడేళ్లలోనే రూ.9 వేలకు పైగా పెరిగి రూ.61 వేల మార్క్ దాటేసింది.

దేశంలో బంగారం ధర ఇలా.. (10 గ్రాములు.. 24 కేరట్)
1965 రూ.71.75
1970 రూ.184.50
1975 రూ.540
1980 రూ.1330
1985 రూ.2130
1990 రూ.3200
1995 రూ.4680
2000 రూ.4400
2005 రూ.7000
2010 రూ.18500
2015 రూ.26343
2020 రూ.48651
2022 రూ.52670
2023 రూ.61780

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News