Big Stories

Tips To Boost Your Credit Score Fast : మీ క్రెడిట్ స్కోర్ పెరగాలంటే ఇవి పాటించండి..

Tips To Boost Your Credit Score Fast : మీ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే మీకు గుర్తింపు పొందిన బ్యాంకుల నుంచి రుణాలు వస్తాయి. ఇంటి లోన్ తీసుకోవాలంటే మీ క్రెడిట్ స్కోర్ ఖచ్చితంగా బాగుండాలి. గతంలో మీరు తీసుకున్న రుణాలను సరిగ్గా చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ అమాంతం తగ్గిపోతుంది. తగ్గిన క్రెడిట్ స్కోర్ పెరగాలంటే సమయం పడుతుంది. కాబట్టి క్రెడిట్ స్కోర్ మెయింటెయిన్ చేసే విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

- Advertisement -

మీ క్రెడిట్ రిపోర్ట్‌ను ఒకసారి పరిషీలించండి. మీరు తీసుకున్న రుణాలు, ఎగవేసిన రుణాలను సంబంధించిన పూర్తి సమాచారం మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఉంటుంది. రుణాలు తీసుకుంటే వాటిని సమయానికి చెల్లించండి లేదంటే మీ క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. ఒక నెల రుణం చెల్లించడం ఆలస్యమైతే వెంటనే క్రెడిట్ స్కోరు పడిపోతుంది. తరువాతి నెలలో కూడా మీరు ఈఎమ్ఐ చెల్లిండంలో లేట్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ మరింత దిగజారిపోతుంది.

- Advertisement -

రుణాలు తీసకునేటప్పుడు మీ ఆదాయం మొత్తంలో 40 శాతానికి మించకుండా మీరు రుణం తీసుకోవాలి లేదంటే అది మీకు పెను భారంగా మారుతుంది. మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఇచ్చినా దానిలో 30 శాతానికి మించకుండా జాగ్రత్త పడండి. లేదంటే బ్యాంకింగ్ సంస్థలు మీపై రుణభారం పెరుగుతందని అంచనాలకు వస్తాయి. క్రెడిట్ బ్యూరో ఈ విషయాలను తెలుసుకొని మీ క్రెడిట్ స్కోరును అమాంతం తగ్గించేస్తాయి.

రుణాల కోసం ఎక్కువ సార్లు దరఖాస్తు చేయవద్దు. అలా ఎక్కువ లాగిన్‌లను మీరు బ్యాంకింగ్ సంస్థలతో చేయిస్తే మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. మీకు క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఉంటే లిమిట్ ఎక్కువ ఉండే కార్డులను కాకుండా లేని కార్డులను రద్దు చేయించంది. కార్డు రద్దు చేయించనప్పుడు కూడా మీ క్రెడిట్ స్కోరు కొంత తగ్గుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News