Fixed Deposits : ఎక్కువ రాబడి ఇచ్చే పథకాలు ఎన్నో ఉన్నా.. కొంత మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లకే మొగ్గుచూపుతుంటారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి మంచి రాబడులు వస్తాయి. కాని, పెట్టిన పెట్టుబడికి సేఫ్టీ ముఖ్యం అనుకునే వాళ్లు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనే పెడుతుంటారు. అలా డిపాజిట్స్ చేస్తున్నారు కాబట్టే.. బ్యాంకులు అప్పులు ఇవ్వగలుగుతున్నాయి. కొంతకాలంగా బ్యాంకుల వద్ద లిక్విడిటీ తగ్గడంతో డిపాజిట్ రేట్లను పెంచాయి. ప్రభుత్వ బ్యాంకులను చూసి ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు మించి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుకుంటూ పోయాయి.
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనగానే.. అందరికీ ముందుగా ప్రభుత్వ బ్యాంకులే గుర్తొస్తాయి. కాని, అంతకు మించి వడ్డీ ఇచ్చే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఏకంగా 9 శాతం వడ్డీ ఇచ్చేవి కూడా ఉన్నాయి.
సపోజ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిన్ కేర్ విషయానికొస్తే.. ఈ బ్యాంక్ 750 రోజుల కాల పరిమితికి 8.71 శాతం ఇంట్రస్ట్ రేట్ ఇస్తోంది. కాకపోతే, సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ ఆఫర్. ఈమధ్య బాగా దూసుకెళ్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈక్విటాస్. ఈ సంస్థ కూడా 888 రోజుల కాల పరిమితి గల డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇలా 8 శాతానికి మించి వడ్డీ చెల్లిస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఉజ్జీవన్ అనే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సైతం 559 రోజుల కాల పరిమితి ఉండే డిపాజిట్లపై 8.20 శాతం వడ్డీ ఇస్తోంది. వీటిల్లో 9 శాతం వడ్డీ చెల్లించే ఎస్‌ఎఫ్‌బీలు సైతం ఉన్నాయి. యూనిటీ ఎస్‌ఎఫ్‌బీ 1001 రోజుల కాల పరిమితికి గాను 9.5 శాతం వడ్డీని అందిస్తోంది. కాకపోతే, ఇది కూడా సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న ఆఫర్. ఇక సూర్యోదయ ఎస్ఎఫ్‌బీ కూడా సీనియర్ సిటిజన్ల కోసం 999 రోజుల డిపాజిట్లపై 9.05 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
Leave a Comment