Big Stories

Financial Rules Changes: జూలైలో మారనున్న నిబంధనలు ఇవే.. తెలుసుకోకుంటే నష్టపోతారు!

Financial Rules Changes From July 2024: నేటి నుంచి ఫైనాన్షియల్‌కు సంబంధించిన నిబంధనలు మారాయి. జూలై నెలలో బ్యాకింగ్, ఫైనాన్షియల్, ఇతర రంగాలకు సంబంధించిన పలు నియమ, నిబంధనలు మారాయి. అలాగే కొన్ని డెడ్ లైన్లకు సంబంధించి సైతం ఈ నెలలోనే ముగియనున్నాయి. ఈ నిబంధనలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చిన్నవే అనుకుంటాం. కానీ సామాన్యుడిపై ఈ నిబంధనలు చాలా పెద్ద ప్రభావం చూపుతాయి. ఈ నిబంధనలు జీవితాలపై ప్రభావితం చేస్తాయి. లేదంటే పర్స్‌కు చిల్లు పడినట్టే. మారిన నిబంధనలు, మార్పులు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

పేటీఎం వాలెట్..
జూలై 20 నుంచి కొన్ని రకాల వాలెట్లు మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు లేని, బ్యాలెన్స్ లేని ఇన్ యాక్టివ్ గా ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను జూలై 20 నుంచి మూసివేయనున్నారు. దాదాపు అందరికీ మేసేజ్ వెళ్లనుంది. 30 రోజుల నోటీసు ఉండే అవకాశం ఉందని పీపీబీఎల్ నోటీసులో పేర్కొంది.

- Advertisement -

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు..
జూలై 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్ మెంట్ ఫీజు పెరగనుంది. ప్రస్తుతం ఛార్జీలు రూ.100 ఉండగా.. కార్డు రీప్లేష్ మెంట్ ఫీజుగా రూ.200 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. అలాగే చెక్ లేదా క్యాష్ పికప్ ఫీజు కింద వసూలు చేసే రూ.100 నిలిపివేశారు. దీంతోపాటు స్లిప్ రిక్వెస్ట్ ఛార్జ్, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్ ఛార్జీలను బ్యాంక్ నిలిపివేయనుంది.

ఐటీఆర్ గడువు..
2023-24 ఆర్థిక సంవత్సరానికి(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్నను రిటర్న్(ఐటీఆర్) దాఖలు చేసేందుకు చివరి తేదీ జూలై 31 వరకు ఉంది.

ఎస్బీఐ క్రెడిట్ కార్డులు..
కొన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు, రివార్డ్ పాయింట్లు జూలై 15 నుంచి ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై వర్తించవని ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది.

పీఎన్బీ రూపే ప్లాటినం డెబిట్ కార్డు..
జూలై 1నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే ప్లాటినం డెబిట్ కార్డు లాంజ్ యాక్సెస్ ప్రోగ్రాంలో మార్పులు చేశారు. దీంట్లో డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లేదా రైల్వే లాంజ్ యాక్సెస్ ప్రతీ మూడు నెలలకు ఒకటి, ఏడాదికి రెండు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ లభించనున్నాయి.

సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మైగ్రేషన్
జూలై 15 నాటికి కార్డుల మైగ్రేషన్ పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. దీని తర్వాత ప్రస్తుత సిటీ, బ్రాండెడ్ కార్డులకు కొత్త యాక్సిస్ బ్యాంకు కార్డుల ప్రయోజనాలు లభిస్తాయి. మైగ్రేషన్ తర్వాత కొన్ని నెల్లో కస్టమర్లు తమ కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు పొందే వరకు సిటీ, బ్రాండెడ్ కార్డులు పనిచేయనున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News