Big Stories

Muvi 125 5g: మార్కెట్‌లోకి కొత్త 5g ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జింగ్‌తో 100 కి.మీ మైలేజీ..!

Muvi 125 5g: భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై కంపెనీలు ఫోకస్ పెట్టాయి. కొత్త కొత్త ఈవీలను రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అందులో ఎలక్ట్రిక్ స్కూటర్లు విపరీతంగా మార్కెట్‌లో లాంచ్ అవుతున్నాయి. ప్రతి రోజు ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య పోటీపోటీ ఏర్పడుతుంది. ఇందులో భాగంగానే తాజాగా మరొక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఆవిష్కరించబడింది. ప్రముఖ కంపెనీ ఇ-బైక్ గో ఎలక్ట్రిక్ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. సరికొత్త ఫీచర్లతో దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో తన లేటెస్ట్ ‘మువి 125 5జీ’ (Muvi 125 5g) ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఆవిష్కరించింది.

- Advertisement -

మల్టీ హార్డ్‌వేర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఏసర్ భాగస్వామ్యంతో ఇ-బైక్ గో ఈ కొత్త స్కూటర్‌ని రూపొందించింది. అయితే ప్రస్తుతం రోడ్లపై పరుగులు పెడుతున్న Muvi 125 4g ఎలక్ట్రిక్ స్కూటర్లను రీప్లేస్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా Muvi 125 5g ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అద్భుతమైన డిజైన్, ఫీచర్లతో తయారుచేశారు. చూడగానే వాహన ప్రియులను అట్రాక్ట్ చేసేలా షైనింగ్‌గా రూపొందించారు.

- Advertisement -

ఈ Muvi 125 5g ఎలక్ట్రిక్ స్కూటర్ అతి పెద్ద, శక్తివంతమైన 5కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని కారణంగా ఈ బ్యాటరీకి ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే ఏకంగా 100 కి.మీ మైలేజీ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీ ప్యాక్‌ అభివృద్ధి చేయడానికి ఇ-బైక్ గో సంస్థ ఎన్నో టెక్నాలజీ నైపుణ్యాలను యూజ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో అధిక పనితీరు గల బ్యాటరీ వ్యవస్థకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంది.

 Also Read : వారికి పండగే.. త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది!

Muvi 125 5g ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఇంకా ప్రకటించనప్పటికీ.. త్వరలో దీని ధరను వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఈ స్కూటర్ మొబైల్ యాప్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా స్మార్ట్ ఎల్‌ఈడీ డిజిటల్ డిస్‌ప్లే డ్యాష్‌బోర్డ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఈ స్కూటర్ డ్రైవ్ చేసే వారికి ఎలాంటి సమస్యా లేని అనుభూతిని అందిస్తుంది. కాగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్‌ విషయంలో కీలక నిర్ణయంతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్‌ను దాదాపు 1 లక్ష యూనిట్లకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమచారం. దీంతోపాటు మరిన్ని పట్టణాలకు తమ కార్యకలాపాలను విస్తరించేపనిలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇ-బైక్ గో ఎలక్ట్రిక్ కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను అద్దెకు సైతం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలా కొత్త కొత్త ఆలోచనలతో కంపెనీ ముందడుగేస్తూ రాబోయే కాలంలో తమ కంపెనీ వాహనాలను మరింతగా విస్తరించాని చూస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News