Big Stories

Ducati Hypermotard 698: బైక్ లవర్స్‌కు పండగే.. డూకాటి నుంచి స్పోర్టీ బైక్.. కెటిఎమ్ కోసమేనా?

Ducati Hypermotard 698: స్పోర్ట్స్ బైకులకు డుకాటి పెట్టిందిపేరు. ఈ కంపెనీ తన బైకులకు మంచి స్పోర్టీ లుక్ ఇస్తోంది. కంపెనీ బైక్‌లు సూపర్ స్టైలిష్‌గా ఉంటాయి. అంతేకాకుండా అధిక వేగాన్ని అందిస్తాయి. ఇప్పుడు కంపెనీ తన కొత్త బైక్ డుకాటి హైపర్‌మోటార్డ్ 698ని తీసుకురాబోతోంది. ఇటీవల దీని లుక్ రిలీజ్ చేశారు. ఈ బైక్ మార్కెట్లో కెటిఎమ్ 690 డ్యూక్‌తో పోటీపడనుంది. రెండూ రేసర్ లుక్ బైక్‌లు, సేఫ్టీ కోసం రెండు టైర్లలో హై ఎండ్ ఎగ్జాస్ట్, డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

- Advertisement -

డుకాటి హైపర్‌మోటార్డ్ 698 3.8-అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది దాని లుక్‌ను బెటర్‌గా చేస్తుంది. దీనికి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్‌లో 659సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది చెడ్డ రోడ్లపై అధిక వేగం, టాప్ పర్ఫామెన్స్ అందిస్తోంది. స్పీడ్ కోసం ఈ బైక్ 77.5bhp పవర్, 63Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. బైక్ కొన్ని సెకన్లలో 0 నుండి 100kmph వేగాన్ని అందుకుంటుంది.

- Advertisement -

Also Read: నిజంగానే ‘కింగ్’ కోహ్లీ.. ఆహా.. ఎన్నేసి కార్లు.. ఆ రేట్లేంటి బ్రో!

డుకాటీ హైపర్‌మోటార్డ్ 698 మోనో మొదట్లో స్టాండర్డ్, RVE అనే రెండు వేరియంట్‌లలో విడుదల కానుంది. ఈ బైక్‌లో అధిక పికప్ కోసం 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ బైక్ LED హెడ్‌లైట్, స్లిమ్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ముందు భాగంలో USD ఫోర్క్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్‌ అందించారు. సేఫ్టీ బ్రేకింగ్ కోసం బైక్ ముందు, వెనుక రెండు టైర్లలో డిస్క్ బ్రేక్లలను తీసుకొచ్చారు.

డుకాటి హైపర్‌మోటార్డ్ 698 మోనోలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. ఈ సిస్టమ్ రెండు టైర్‌లకు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది బైక్‌ టాప్ స్పీడ్‌కు వెళ్లడానికి ఎక్కువ సమయాన్ని ఇస్తుంది. బైక్‌కు సౌకర్యవంతమైన సింగిల్ పీస్ సీటు లభిస్తుంది. ఇది నార్మల్ హ్యాండిల్ బార్, రియర్ వ్యూ మిర్రర్ కలిగి ఉంది. బైక్‌లో ట్యూబ్‌లెస్ టైర్లు అందుబాటులో ఉన్నాయి. రోడ్డుపై బలమైన గ్రిప్ కోసం ఇది ట్రాక్షన్ కంట్రోల్‌తో వస్తుంది. ఈ బైక్ మైలేజీ మోడ్‌తో వస్తుంది.

Also Read: బడ్జెట్ కింగ్‌లు.. ఈ ఐదు బైక్‌లకు తిరుగులేదు!

డుకాటి హైపర్‌మోటార్డ్ 698 మోనోతో పోటీ పడుతున్న KTM 690 డ్యూక్ గురించి మాట్లాడితే KTM ప్రేమికులు ఈ బైక్‌ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి ఈ బైక్ లాంచ్ తేదీ గురించి కంపెనీ ఎటువంటి సమాచారం అందించలేదు. ఇందులో 650 సిసి హై పవర్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. KTM ఈ బైక్ రెండు టైర్లపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. బైక్‌కు షార్ప్ ఎడ్జ్ LED లైట్ లభిస్తుంది. పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, లుక్ టెయిల్‌లైట్ ఇందులో చూడొచ్చు. బైక్‌కు హై ఎండ్ ఎగ్జాస్ట్ ఇవ్వబడింది. కంపెనీ యువత కోసం ఆరెంజ్, నియాన్ కలర్ ఆప్షన్‌లలో తీసుకొస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News