Big Stories

Petrol to CNG Motorcycle: మీ పాత స్కూటర్‌ను సీఎన్‌జీగా మార్చుకోవచ్చు.. ఖర్చు కూడా ఎక్కువేం కాదండోయ్

Convert Petrol Motorcycle to CNG by Kit: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ త్వరలో అంటే జూలై 5న గ్రాండ్ లెవెల్లో ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేయబోతుంది. దీనికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనికారణంగా బజాజ్ మరో అడుగు ముందుకేసిందనే చెప్పాలి. ఈ బైక్ రూ.80000 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులకు ఎలాంటి పెట్రోల్ సమస్య ఉండదు. అంతేకాకుండా మైలేజీ పరంగా కూడా ఈ సీఎన్‌జీ బైక్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

- Advertisement -

అయితే దీనికోసం రూ.80 వేలు పెట్టడం కష్టంగా ఉన్నవారికి మరొక ఆప్షన్ కూడా ఉంది. మీ పాత టూ వీలర్‌లో సీఎన్‌జీ కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని పెట్రోల్ ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. ఈ విషయాన్ని నిపుణులే చెబుతున్నారు. దీని కోసం మార్కెట్‌లో చాలా కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. అయితే సీఎన్‌జీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

- Advertisement -

మీ టూ వీలర్ వాహనంలో సీఎన్‌జీ కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా అధిక ధరలో ఉన్న పెట్రోల్ ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. అదీగాక పెట్రోల్ కంటే సీఎన్‌జీ ధర తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సీఎన్‌జీ పై వాహనం మంచి మైలేజీని కూడా అందిస్తుంది. దీనిబట్టి తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశాన్ని పొందవచ్చు. ఇకపోతే ఇప్పటి వరకు ఏ బ్రాండెడ్ కంపెనీ కూడా సీఎన్‌జీ కిట్‌తో టూ వీలర్ వాహనాన్ని లాంచ్ చేయలేదు.

Also Read: స్మార్ట్‌ఫోన్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఇవి మహిళల కోసమే గురూ!

అయితే మరి మార్కెట్‌లో సీఎన్‌జీతో నడిచే వాహనాలు కొన్ని కనిపిస్తున్నాయి కదా అంటే.. అవన్నీ థర్డ్ పార్టీ ద్వారా ఇన్‌స్టాల్ చేసినవే అని చెప్పుకోవాలి. అయితే మరి ఈ సీఎన్‌జీ కిట్‌ను పాత టూ వీలర్‌ వాహనంలో ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అని అంతా అనుకోవచ్చు. దీనిపై ఢిల్లీలో లొవాటో అనే కంపెనీ పనిచేస్తుంది. దీనికోసం కేవలం రూ.15000 మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పబడింది.

అయితే ఈ సీఎన్‌జీ కిట్‌ను ఇప్పటి వరకు స్కూటీలు, స్కూటర్‌లలో మాత్రమే అమర్చారు. అలా ఫిక్స్ చేయడం ద్వారా ఇది అటు పెట్రోల్‌తోనూ.. ఇటు సీఎన్‌జీతోనూ నడుస్తుంది. ఒకేసారి కాకుండా దీనికి ఒక స్విచ్‌ను ఏర్పాటు చేస్తారు. తద్వారా సీఎన్‌జీ నుండి పెట్రోల్‌కు.. లేదా పెట్రోల్ నుండి సీఎన్‌జీకి మారవచ్చు. కాగా స్కూటర్లలో ఈ కిట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News