Big Stories

BSNL Low Recharge Plans: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసు.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ సూప‌ర్‌ రీఛార్జ్ ప్లాన్స్!

BSNL New Recharge Plan 2024: ప్రస్తుతం అంతా స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్‌కు అట్రాక్ట్ అయినవారే. అందువల్ల ప్రముఖ కంపెనీలు సైతం బడ్జెట్ ధర నుంచి ప్రీమియం ధరలో ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎంత ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ అయినా రీఛార్జ్ లేకపోతే దేనికీ యూజ్ అవ్వదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఫోన్ ఎంత ముఖ్యమో దానికి రీఛార్జ్ కూడా అంతే ముఖ్యం. ఆ రీఛార్జే లేకపోతే కాల్స్ వెళ్లవు, ఇంటర్నెట్ రాదు. దీని కారణంగా సకాలంలో చేసుకోవలసిన పనులు కూడా మధ్యలోనే ఆగిపోతాయి. కాబట్టి చాలా మంది ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ నెలల వ్యాలిడిటీతో రీఛార్జ్ చేసుకుంటారు.

- Advertisement -

అయితే ఇటీవల ప్రముఖ టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీఛార్జ్ ఆఫర్లు ఇచ్చినట్టే ఇచ్చి ప్లాన్ ధరలను అధికంగా పెంచేశాయి. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి సర్వీస్ ప్రొవైడర్లు తమ టారిఫ్‌ల ధరలను పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించి షాక్ ఇచ్చాయి. దాదాపు 26శాతం వరకు పెంచాయి. దీంతో యూజర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

- Advertisement -

Also Read: SBI Plans to Expand Branch Network: పెరగనున్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లు..ఇక నిమిషాల్లోనే

రీఛార్జ్ ప్లాన్‌లో పలు ఆఫర్లు ఇచ్చిన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా సంస్థలు ఇప్పుడేంటి ఇంతలా ప్లాన్ ధరలను పెంచేశాయని ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇలాంటి సమయంలో మరో టెలికాం సంస్థ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) అదిరిపోయే వార్తను తీసుకొచ్చింది.

ఓ సరికొత్త ప్లాన్‌ను తమ యూజర్లకు అందించి శభాష్ అనిపించుకుంది. అయితే మరి బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన కొత్త ప్లాన్ ఏంటి.. ఆ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త ప్లాన్‌లో యూజర్లు రూ.249తో రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 45 రోజుల భారీ వ్యాలిడిటీని పొందుతారు. అలాగే ఇండియాలో ఏ నెట్‌వర్క్‌కి అయినా అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంది. ఈ ప్లాన్ ద్వారా డైలీ 2జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా డైలీ 100 ఫ్రీ ఎస్ఎమ్ఎస్‌లను పొందవచ్చు.

Also Read: యూజర్లకు వరుస షాక్‌లు.. మొన్న జియో, నిన్న ఎయిర్‌టెల్, ఇవాళ వొడాఫోన్-ఐడియా.. భారీగా పెంచేసింది బాబోయ్?

అయితే ఇదే ధరలో ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్లాన్ వివరాలు చూసుకుంటే.. రూ.249 తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల ప్లాన్ వ్యాలిడిటీ మాత్రమే అందిస్తుంది. డైలీ 1జీబీ డేటా లభిస్తుంది. ఈ రెండు ధరల ప్రకారం.. బీఎస్‌ఎన్ఎల్ అందిస్తున్న బెనిఫిట్స్‌లో 17 అదనపు రోజుల సర్వీస్ పొందవచ్చు. అంతేకాకుండా డైలీ డేటా కూడా రెట్టింపు వస్తుంది. దీంతో అధిక రీఛార్జ్ ప్లాన్‌ ధరల నుంచి ఉపశమనాన్ని కోరుకునే వారికి బీఎస్‌ఎన్ఎల్ తక్కువ ధరలోనే ఎక్కువ ప్రయోజనాలను తీసుకురావడంతో చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News