Big Stories

BSA Gold Star 650 Bike: మార్కెట్‌లోకి సరికొత్త బైక్ ‘బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ 650’.. లాంచ్ ఎప్పుడంటే?

BSA Gold Star 650 Bike Launching on August 15th in India: ప్రముఖ బ్రిటన్ బైక్‌ల తయారీ కంపెనీ BSA త్వరలో భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్లో ‘BSA Gold Star 650’ అనే కొత్త బైక్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో త్వరలో అందుబాటులోకి రానున్న ఈ బైక్.. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మోడల్‌కి సంబంధించి కొన్ని వివరాలు బయటకొచ్చాయి. ఈ సరికొత్త బైక్ కర్వడ్ ఫెండర్స్, క్రోమ్ డీటెయిలింగ్, సైడ్ ప్యానెల్స్ వంటి వాటిని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే 41MM టెలిస్కోపిక్ ఫ్రెట్ ఫోర్క్స్, ట్యూబ్యులర్ స్టీల్ డ్యూయెల్ క్రాడిల్ ఫ్రేమ్, ట్విన్ రేర్ షాక్ అబ్సార్భర్స్ వంటివి కూడా ఈ బైక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ సరికొత్త రెట్రో లుక్‌లో రానుంది.

- Advertisement -

ఈ BSA Gold Star 650 బైక్ 652cc, లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తున్నట్లు సమాచారం. ఇది 6500 rpm వద్ద 45hp పవర్‌ని అందిస్తుంది. అలాగే 4000 rpm వద్ద 55nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ కనెక్ట్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు స్లిప్పర్ క్లచ్ కూడా ఇందులో ఉంటుందని తెలుస్తోంది.

Also Read: కొత్త లుక్‌తో టీవీఎస్ జూపిటర్.. పిచ్చెక్కిస్తోన్న ఫీచర్లు!

అలాగే ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఏబీఎస్, ముందు వెనుక సింగిల్ డిస్క్, వైర్ స్పోక్ వీల్స్, బ్రెంబో కాలిపర్స్ వంటి ఫీచర్లు ఈ బైక్‌లో అందించినట్లు సమాచారం. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650, ఎన్‌ఫీల్డ్ మిటియర్ 650 వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా లాంచ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీని ధర విషయానికొస్తే.. BSA Gold Star 650 బైక్‌ యూకేలో 6500 నుంచి 7,500 పౌండ్లు.. రాయల్​ ఎన్‌ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్ 6400 నుంచి 6900 పౌండ్లుగా కంపెనీ నిర్ణయించింది.

ఇక ఇప్పుడు ఈ బైక్‌ను ఇండియాలోనే తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ బైక్ రూ.3.5 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ అవ్వొచ్చని అంటున్నారు. దీని బట్టి చూస్తే BSA Gold Star 650 బైక్‌.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ హై ఎండ్ టాప్ వేరియంట్ కంటే రూ.20,000 ఎక్కువ అని చెప్పాలి. కాగా దీని లాంచ్ డేట్ ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. త్వరలోనే కంపెనీ దీనిపై అఫీషియల్ అప్డేట్ అందించే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News