Big Stories

Dual Channel ABS Bikes: యాంటీ లాక్ బ్రేకింగ్‌ సిస్టమ్‌.. ఈ ఫీచర్‌తో వచ్చే బైక్స్‌ మరింత సేఫ్.. లిస్ట్ ఇదిగో..!

Dual Channel ABS Bikes: దేశీయ మార్కెట్‌లో టూ వీలర్స్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీని కారణంగానే ప్రముఖ కంపెనీలు స్టైలిష్ లుక్, అదిరిపోయే డిజైన్, అధిక మైలేజీతో అద్భుతమైన బైక్‌లను రిలీజ్ చేస్తున్నాయి. అంతేకాకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బైక్‌లలో అధునాతన టెక్నాలజీ ఫీచర్లను అందించి బైక్ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఎక్కువ ధర ఉన్నా.. మంచి మైలేజీ గల బైక్‌ను కస్టమర్లు ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం మైలేజీతో పాటు సేఫ్టీ ఫీచర్లు గల బైక్‌ను కొనుక్కోవాలని అనుకుంటున్నారు. మరి మీరు కూడా అలాంటి ఆలోచనతో ఉన్నట్లయితే మీకో గుడ్ న్యూస్.

- Advertisement -

ఎందుకంటే బైక్‌లలో ఏబీఎస్ (యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్) అనేది అత్యంత ముఖ్యమైనది. ఇది ద్విచక్ర వాహనాల్లో అతి కీలకమైన ఫీచర్‌. ప్రమాదాలు జరిగినప్పుడు.. ఆ ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం ఈ ఫీచర్ చేస్తుంది. సడెన్‌గా యాక్సిడెంట్ జరిగినపుడు వీల్స్‌ను పూర్తిగా లాక్ చేయకుండా ఆ వ్యవస్థను నిరోదిస్తుంది. దీని కారణంగా బైక్ అనేది తన నియంత్రణ కోల్పోకుండా ఉంటుంది. అయితే ఈ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అన్ని బైక్‌లలో ఉండనప్పటికీ కొన్ని బైక్‌లలో మాత్రమే అందించారు. మరి ఈ సిస్టమ్‌ గల బైక్‌లు ఏవో తెలుసుకుందాం.

- Advertisement -

Bajaj Pulsar NS 160: బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 బైక్ 160 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 17.03 బిహెచ్‌పి పవర్, 14.6ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ABS (యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్)ను కలిగి ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అంటే.. ఇది వెనుక వీల్స్‌కు కూడా సేఫ్టీని అందిస్తుంది. ఇధి రూ.1.37 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది.

Also Read: మార్కెట్‌లోకి కొత్త 5g ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జింగ్‌తో 100 కి.మీ మైలేజీ..!

Bajaj Pulsar N 160: బజాజ్ పల్సర్ ఎన్ 160 బైక్ 164.82 సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 15.7బిహెచ్‌పి పవర్, 14.65 ఎన్‌ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 5స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఇక బజాజ్ పల్సర్ ఎన్ 160 బైక్ కూడా డ్యూయల్ ఛానల్ ABSను కలిగి ఉంటుంది. ఈ బైక్ 1.32 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లభిస్తుంది.

TVS Apache RTR 200 4V: టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ బైక్ 197.75 సిసి సింగిల్ సిలిండర్, 4వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది కూడా 5స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ కూడా డ్యూయల్ ఛానల్ ABSను కలిగి ఉంటుంది. దీని ధర రూ.1.49లక్షలుగా ఉంది (ఎక్స్ షోరూమ్).

Bajaj Pulsar N 250/F 250: బజాజ్ పల్సర్ ఎన్ 250/ఎఫ్ 250బైక్ రూ.1.51 లక్షల ఎక్స్ షోరూమ్ ధరలో లభిస్తుంది. ఈ బైక్ కూడా డ్యూయల్ ఏబీఎస్ ని కలిగి ఉంది. ఇది 249 సిసి సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది కూడా 5స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంటుంది

Bajaj Pulsar NS 200: బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 200 బైక్ 199సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. దీని ధర రూ.1.50 లక్షలుగా ఉంది (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కూడా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌ను కలిగి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News