Big Stories

5 Star Rating Cars in Tata: టాటా కార్లా మజాకా.. క్రాష్‌ టెస్ట్‌లో ఈ మోడళ్లకు 5-స్టార్‌ రేటింగ్స్!

Tata Cars got 5 Star Rating in Bharat NCAP Crash Test: దేశీయ మార్కెట్‌లో టాటా కార్లు సేఫ్టీ పరంగా కానీ, ఫీచర్ల పరంగా కానీ, ధర పరంగా ఇలా అన్నింటిలోనూ అద్భుతమైన రెస్సాన్స్‌తో దూసుకుపోతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో భారత్ ఎన్‌సిఏపీ ని ప్రారంభించగా.. కార్ల టెస్టింగ్ డిసెంబర్‌లో స్టార్ట్ అయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు టాటా మోటార్స్‌కు చెందిన మొత్తం నాలుగు ఎస్యూవీలను పరీక్షించారు. మరి అవి ఏ మేరకు రేటింగ్స్ అందుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

టాటా నెక్సాన్ ఈవీ:

- Advertisement -

టాటా నెక్సాన్ ఈవీ ఇటీవల నిర్వహించిన భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో దుమ్ము దులిపేసింది. గ్లోబల్ ఎన్‌సిఏపీ క్రాష్ టెస్ట్‌లో టాటా నెక్సాన్ ఏకంగా 5స్టార్ రేటింగ్ సాధించి అదరగొట్టేసింది. అదే క్రమంలో భారత ఎన్‌సీఏపీ క్రాస్ టెస్టింగ్‌లో టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ 5 స్టార్స్‌ని అందుకుని కుమ్మేసింది. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ అడల్ట్స్ విభాగంలో 32 స్కోర్‌కి గానూ 29.86, చిల్డ్రన్స్ విభాగంలో 49కి 44.95 స్కోరును సాధించింది. దీని ధర రూ.14.49 లక్షల నుంచి రూ.19.49 లక్షల మధ్య ఉంటుంది. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 465 కి.మీ మైలేజీ అందిస్తుంది.

Also Read: మిడిల్ క్లాస్ కార్లు.. బైక్ కంటే ఇవే బెటర్!

టాటా పంచ్ ఈవీ:

భారత్ ఎన్సీఏపీ క్రాస్ టెస్ట్‌లో టాటా పంచ్ ఈవీ 5స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఇది అడల్ట్స్ సేఫ్టీ విభాగంలో 32కి 31.46, చైల్డ్ విభాగంలో 49కి 45 మార్కులు సాధించి అదరగొట్టేసింది. దీని ధర ప్రస్తుతం రూ.10.99 లక్షల నుంచి రూ.15.49 లక్షల మధ్య ఉంది.

టాటా హారియర్:

టాటా మోటార్స్‌లో అత్యంత ఖరీదైన ఎస్యూవీగా టాటా హారియర్ ఉంది. గతేడాది డిసెంబర్‌లో భారత్ ఎన్సీఏపీ టెస్ట్ చేసిన తొలి కారుగా హారియర్ గుర్తింపు పొందింది. ఇక అందరూ అనుకున్నట్లు గానే టాటా హారియర్ భారత్ ఎన్సీఏపీ కాస్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించి అదరగొట్టేసింది. ఇది అడల్ట్స్ సేఫ్టీ విభాగంలో 32కి 30.08, చైల్డ్ విభాగంలో 49కి 44.54 మార్కులు అందుకుంది. కాగా ఇది రూ.15.49 లక్షల నుంచి రూ.26.44లక్షల మధ్య ఉంది. దేశంలో అత్యంత సేఫ్టీ కార్లలో హారియర్ మొదటి స్థానంలో ఉంది.

Also Read: Top 5 Budget Cars: బడ్జెట్‌లో మంచి మైలేజీ ఇచ్చే కార్లు.. రూ.3 లక్షలతో కొనుగోలు చేయవచ్చు!

టాటా సఫారి:

టాటా సఫారి కారు హారియర్ చాలా ఖరీదైనది. ఈ టాటా సఫారి కూడా క్రాస్ టెస్ట్‌లో 5స్టార్ రేటింగ్ అందుకుని అదరగొట్టేసింది. ఇది అడల్ట్స్ విభాగంలో 32కి 30.08, పిల్లల సేఫ్టీ విభాగంలో 49కి 44.54 స్కోర్ సాధించింది. కాగా దీని ధర విషయానికొస్తే.. టాటా సఫారి రూ.16.19 లక్షల నుంచి రూ.27.34 లక్షల మధ్య ఉంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే. దీని బట్టి చూస్తే టాటా మోటార్స్ తన వినియోగదారులకు సేఫ్టీ విషయంలో ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో అర్థం అవుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News