Big Stories

BGauss RUV350: మైలేజీలో కింగ్.. మార్కెట్‌లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

BGauss RUV350 Electric Scooter Launched At Rs 1.10 Lakh:ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ బిగాస్ తన కంపెనీని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేస్తూ వాహన ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. బడ్జెట్ ధరలో.. అధిక మైలేజీని అందిస్తూ మార్కెట్‌లో తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఇప్పటికే పలు ఈవీ స్కూటర్లను మార్కెట్‌లో పరిచయం చేసిన బిగాస్ తాజాగా మరొక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌ విడుదలతో ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో కంపెనీ తనదైన ముద్ర వేసేందుకు వస్తుంది.

- Advertisement -

బిగాస్ కంపెనీ తాజాగా ‘BGauss RUV350’ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో తయారు చేయబడింది. దీనిని భారతదేశ వాహన ప్రియులకు అనుగుణంగా రూపొందించారు. ఇక దీని డిజైన్ అండ్ ఫీచర్ల విషయానికొస్తే.. బిగాస్ ఆర్‌యూవీ 350 దాని డిజైన్, ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇది ఫారిన్ దేశాల రోడ్లపై తిరిగే స్కూటర్‌ వలే కనిపిస్తుంది. ఈ స్కూటర్‌లో స్క్వేర్ హెడ్‌లైట్‌ని అందించారు.

- Advertisement -

అలాగే ఫంట్ ఆప్రాన్ సెంట్రల్ సెక్షన్ గ్లోస్ బ్లాక్ సెక్షన్‌తో వస్తుంది. ఇది తలతల మెరుస్తూ మంచి లుక్‌ను అందిస్తుంది. ఇకపోతే ఇందులో 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను గ్రే, ఆరెంజ్, ఎల్లో వంటి మూడు కలర్‌ ఆప్షన్లలో చాలా అందంగా, ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. కాగా ఈ బిగాస్ ఆర్‌యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎంతో విశాలవంతమైన ఫ్లోర్‌బోర్డ్ ఉంది.

Also Read: కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 130 కి.మీ మైలేజీ.. ధర తక్కువే..!

అలాగే సింగిల్ పీస్ గ్రాబ్ హ్యాండిల్‌ను కూడా అందించారు. టర్న్ సిగ్నల్, టెయిల్‌లైట్‌తో చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. అంతేకాకుండా 5 అంగుళాల టిఎఫ్‌టి డిస్‌ప్లే ఐపీ67 రేటింగ్‌తో ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్‌లో కాల్ నోటిఫికేషన్స్, రైడింగ్, ఛార్జింగ్ పర్సంటేజ్, టర్న్ బై టర్న్ వంటి ఫీచర్లు అందించారు. కాగా ఈ స్కూటర్ కంపెనీ కొత్త హైపర్‌డ్రైవ్ ఇన్ వీల్ మోటార్‌ ద్వారా ఆధారితమైనది.

ఇది 4.69 బిహెచ్‌పి, 165ఎన్ ఎం గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 3కెడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అందించారు. ఇది ఫుల్ ఛార్జింగ్ పై దాదాపు 120 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఈ బ్యాటరీని ఆఫ్ బోర్డ్ ద్వారా కనెక్ట్ చేసినపుడు 1 గంట 55 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేయాలంటే మరో 44 నిమిషాలు పడుతుంది. అయితే ఎకో రైడింగ్ మోడ్‌లో ఇది 120 కి.మీ మైలేజీని అందిస్తుంది.

Also Read: వాసివాడి తస్సాదియ్యా.. ఫుల్ ఛార్జింగ్‌తో 355 కి.మీ మైలేజీ ఇచ్చే కొత్త ఎలక్ట్రిక్ కారు.. రోడ్లపై పరుగులే..!

ఈ స్కూటర్ గంటకు 45 కి.మీ గరిష్ట వేగంతో పరుగులు పెడుతుంది. ఇందులో రెండు మోడ్‌లు కూడా ఉన్నాయి. అవి రైడ్, స్పోర్ట్.. రైడ్ మోడ్ గరిష్ట వేగాన్ని 60కి.మీ/అవర్.. అలాగే స్పోర్ట్ మోడ్‌లో గరిష్ట వేగం 75కి.మీ/ అవర్‌గా ఉన్నాయి. రోడ్లపై బిగాసు ఆర్‌యూవీ 350 సాధారణ స్కూటర్‌లా కనిపిస్తుంది. ఇందులో మోడ్‌లు మారుతున్నప్పుడు దీని పనితీరులో మార్పులు కనిపిస్తాయి. ఘాట్ రోడ్లపై కూడా మంచి అనుభూతిని అందిస్తాయి. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో RUV 350i వేరియంట్ రూ.1.10 లక్షల ధరతో లాంచ్ అయింది. అదే సమయంలో మిడ్ రేంజ్ RUV 350 EX రూ.1.25 లక్షలు, టాప్-స్పెక్ RUXV 350 Max రూ. 1.35 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News