Big Stories

Low Price CNG Cars: అధిక మైలేజీ ఇచ్చే బెస్ట్ సిఎన్‌జీ కార్లు.. ఒక్క కిలోకి ఎన్ని కి.మీ పరుగులు పెడతాయంటే..?

Low Price CNG Cars with High Mileage: ఇటీవల కాలంలో ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోయింది. అదే క్రమంలో పెట్రోల్ కార్ల హవా బాగా తగ్గిపోయింది. పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా పెట్రోల్ కార్లపై వాహన ప్రియులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ప్రముఖ కంపెనీలు సైతం వాహన ప్రియులను దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రాక్ కార్లును మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో కూడా వాహన ప్రియులు మైలేజీ అండ్ సేఫ్టీనే ఎక్కువగా చూస్తున్నారు.

- Advertisement -

దీంతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలు మైలేజీని పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రముఖ కంపెనీలు సీఎన్‌జీ కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. పెట్రోల్ కంటే ఇవి చాలా చౌకగా ఉంటాయి. అందువల్లనే కార్ల తయారీ కంపెనీలు తమ మోడళ్లలో కొన్ని కార్లను సీఎన్‌జీలో తీసుకొచ్చాయి. మరి ఇప్పటికీ అందుబాటులో ఉన్న సీఎన్‌జీ కార్లు ఏవో.. అవి ఏ మేరకు మైలేజీ ఇస్తాయో తెలుసుకుందాం.

- Advertisement -

Maruti Suzuki Brezza

మారుతి కార్లకు ఆటో మొబైల్ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే వచ్చిన పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. అలాగే కంపెనీ సీఎన్‌జీలో కూడా కార్లను పరిచయం చేసింది. అందులో మారుతి సుజుకి బ్రెజ్జా సీఎన్‌జీలో అందుబాటులో ఉంది. ఈ సీఎన్‌జీ వెర్షన్ రూ.8.29 లక్షల నుండి రూ.14.14 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో కూడా ఉంది. అలాగే సీఎన్‌జీ మోడల్‌లో కూడా అదే ఇంజిన్ ఆప్షన్ ఉంటుంది. ఇది 88 పిఎస్ పవర్, 121.5 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సీఎన్‌జీ మోడల్ 5స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో పెట్రోల్ వేరియంట్లు లీటర్‌కు 17.38 కి.మీ నుంచి 19.8 కి.మీ మైలేజీ అందిస్తాయి. అదే సమయంలో సీఎన్‌జీ వేరియంట్లు కిలో సీఎన్‌జీకి 25.51 కి.మీ మైలేజీని అందిస్తాయి.

Also Read: తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మైలేజ్ ఇచ్చేవి ఇవే.. ఈ CNG కార్లను అస్సలు మిస్ చేయకండి!

Maruti Suzuki Franks

మారుతి సుజుకి కంపెనీ తన ఫ్రాంక్స్‌ ఎస్యూవీని ఎస్-సీఎన్‌జీ వేరియంట్లలో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫ్రాంక్స్ ఎస్-సీఎన్‌జీ ఎస్యూవీ రూ.8.41 లక్షల ధరలో అందుబాటులో ఉంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఫ్రాంక్స్ ఎస్యూవీ సిగ్మా వేరియంట్ రూ.8.41 లక్షలు, డెల్టా వేరియంట్ రూ.9.27 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. కాగా ఫ్రాంక్స్ ఎస్-సీఎన్‌జీ కిలోకి 28.51 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఈ మోడల్ మార్కెట్‌లో ఉన్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ మోడల్‌కు గట్టిపోటీనిస్తుంది.

Hyundai Exter

హ్యుందాయ్ ఎక్స్‌టర్ sx 1.2 సిఎన్‍జి వేరియంట్ మార్కెట్‌లో మంచి క్రేజ్‌ను కలిగి ఉంది. ఈ కారుపై వాహన ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇది రూ.9.16 లక్షల ధరతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మోడల్ కిలో సీఎన్‌జీకి 27.1 కిమీ మైలేజీ ఇస్తుంది. ఈ సీఎన్‌జీ ఎంట్రీ మోడల్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉంది. ఇది ఆరు కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. వీటితో మరిన్ని కంపెనీలకు చెందిన సీఎన్‌జీ కార్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News