Big Stories

Best Mileage Scooters At Low Price: మీ ఇంటి ఆడపడుచులకు ఈ స్కూటర్లే బెస్ట్.. ధర తక్కువ మైలేజీ ఎక్కువ.. వదొలొద్దు..!

best 110cc scooters suitable for womens: ప్రస్తుత రోజుల్లో టూ వీలర్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో కచ్చితంగా ఒక వెహికల్ అయితే ఉంటుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా బైక్, స్కూటీలకు బాగా అలవాటు పడిపోయారు. అంతేకాకుండా ఉద్యోగాల కోసం, పిల్లలను స్కూల్‌కు డ్రాప్ చేయడానికి, ఇంట్లో ఉండే మహిళలకు స్కూటీలు బాగా అవసరం అవుతాయి. అదే సమయంలో ప్రముఖ కంపెనీలు సైతం తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు గల టూ వీలర్ వాహనాలను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. మరి మహిళలకు సరిపడా బడ్జెట్ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండే స్కూటర్ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

హూండా యాక్టివా

- Advertisement -

హూండా యాక్టివా స్కూటర్ ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇది 109.51 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 7.8 పిఎస్ శక్తిని, 8.9 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హూండా యాక్టివా స్కూటర్ లీటర్‌కు 55.9 కి.మీ నుండి 59.5 కి.మీ మైలేజీని అందిస్తుంది. దీని ధర విషయానికొస్తే.. ఈ హూండా యాక్టివా స్కూటర్ రూ.78,174 నుంచి రూ.84,674 మధ్య ఉంటుంది.

హీరో ప్లెజర్ ప్లస్

హూండా యాక్టివా తర్వాత హీరో ప్లెజర్ ప్లస్ నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది. ఇది 110.9 సిసి పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8.1 పిఎస్ శక్తిని, 8.7 ఎన్‌ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ స్కూటీ లీటర్‌కు 50 కి.మీ మైలేజీ అందిస్తుంది. దీనిని రూ.72,163 నుంచి రూ.83,918 ఎక్స్ షోరూమ్ ధరతో కొనుక్కోవచ్చు.

టీవీఎస్ జూపిటర్

Also Read:  ఎన్‌ఫీల్డ్‌తో పోటీకి సిద్ధమైన హోండా.. త్వరలో రెండు స్టన్నింగ్ స్కూటర్లు!

హూండా యాక్టివా, హీరో ప్లెజర్ ప్లస్ తర్వాత ప్లేస్‌లో టీవీఎస్ జూపిటర్ ఉంది. ఇది 109.7 సిసి ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 7.9 పిఎస్ శక్తిని, 8.8 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కి 52 నుంచి 64 కి.మీ మైలేజీని ఇస్తుంది. టీవీఎస్ జూపిటర్ ధర విషయానికొస్తే.. ఇది రూ.77,121 నుండి రూ.92,201 మధ్య ఉంటుంది.

హీరో జూమ్

ఇక నాలుగో ప్లేస్‌లో హీరో జూమ్ ఉంది. ఇది 110.9 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8.15 పిఎస్ శక్తిని 8.70 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హీరో జూమ్ లీటర్ పెట్రోల్‌కి 45 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది రూ.75,761 నుంచి రూ.84,400 ఎక్స్ షోరూమ్ మధ్య ఉంటుంది.

హోండా డియో

వీటన్నీతో పాటు హూండా డియో ఐదో ప్లేస్‌లో ఉంది. ఇందులో 109.51 సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 7.85 పిఎస్ శక్తిని, 9.03 ఎన్‌ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 50 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఇది రూ.74,629 నుంచి రూ.82,130 మధ్య ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో మంచి మైలేజీ అందించే స్కూటీని కొనుక్కోవాలని ప్లాన్ చేసే వారికి ఇదే మంచి అవకాశం అని చెప్పాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News