Big Stories

Best Selling Hatchback Cars: నంబర్ వన్‌గా బలెనో.. సేల్స్‌లో రికార్డులే రికార్డులు..!

Best Selling Hatchback Cars: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో చాలా కంపెనీ కార్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రకరకాల విభాగాల్లో నంబర్ వన్ కార్లుగా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో దేశంలోనే నంబర్ వన్ కార్లుగా నిలిచాయి. తాజాగా ఈ జాబితాలో మారుతీ సుజికీకి చెందిన బలెనో కూడా చేరింది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో బెలెనో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. గత నెలలో కూడా కస్టమర్‌లు ఈ కారును చాలా ఎక్కువగా కొనుగోలు చేశారు. దీని 14,895 యూనిట్లు సేల్ అయ్యాయి. టాప్-10 కార్ల జాబితాలో బాలెనో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -

టాప్-10 కార్లలో మారుతి బాలెనో మాత్రమే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. భారతీయ మార్కెట్లో ఇది హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, టయోటా గ్లాంజా వంటి మోడళ్లతో పోటీపడుతుంది. అయితే అమ్మకాల పరంగా ఈ మోడల్స్ అన్నీ బాలెనో కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. గత 6 నెలల్లో 94,521 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని ఆధారంగా బెలెనో డిమాండ్‌ను అంచనా వేయవచ్చు. అంటే ప్రతినెలా సగటున 15,754 యూనిట్లు అమ్ముడవుతున్నాయి.

- Advertisement -

Also Read: దమ్మున్న ఎస్‌యూవీలు.. రోడ్లపై దుమ్ముదులిపేస్తాయి!

aleno 1.2-లీటర్, నాలుగు-సిలిండర్ K12N పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 83bhp పవర్ రిలీజ్ చేస్తుంది. అదే సమయంలో మరొక ఆప్షన్ 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్. ఇది 90bhp పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీని CNG వేరియంట్ 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 78ps పవర్, 99nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బాలెనో పొడవు 3990mm, వెడల్పు 1745mm, ఎత్తు 1500mm, వీల్‌బేస్ 2520mm. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 360 డిగ్రీల కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటోతో పాటు ఆపిల్ కార్ ప్లేలకు సపోర్ట్ చేస్తుంది. కారులో HUD ఫీచర్ కూడా ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా కనిపిస్తుంది. మ్యూజిక్ కోసం ARKAMYS సరౌండ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది.

Also Read: గాడ్ ఫాదర్ ఆఫ్ SUV.. డిఫెండర్ ఆక్టా లాంచ్.. ఆల్ రౌండర్ ఏనుగు ఇది!

వీటితోపాటు కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, అలెక్సా వాయిస్ కమాండ్ ఉంటుంది. హెడ్‌అప్ డిస్‌ప్లే, కొత్త ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఇతర సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ల ఉన్నాయి. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-స్టార్ట్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, ABSతో EBD, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్, రివర్సింగ్ కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News