Big Stories

Bajaj CNG Bike Launch: జులై 5 లాంచ్ కానున్న ప్ప్రపంచపు తొలి సీఎన్‌జీ బైక్.. రిజిస్ట్రేషన్స్ ఓపెన్.. ధర ఎంతంటే..?

Bajaj CNG Bike Launch on July 5 in India: ప్రస్తుతం ఆటో మొబైల్ మార్కెట్‌లో ప్రముఖ కంపెనీలు తమ ద్విచక్ర వాహనాలను అటు పెట్రోల్ వెర్షన్‌లోనూ ఇటు ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలతో చాలామంది టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చు ఎక్కువ మైలేజీని అందించే వాహనాలను కొనుక్కుంటున్నారు. అదే సమయంలో ప్రముఖ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఫుల్‌గా ఫోకస్ పెట్టాయి.

- Advertisement -

ఇందులో భాగంగానే మైలేజీ పరంగా కానీ, సేఫ్టీ పరంగా కానీ కొత్త కొత్త మార్పులు తీసుకొచ్చి వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా చాలా వరకు ఫెల్యూర్ అవుతున్నాయి. ఒక్కో సారి ఎలక్ట్రిక్ టూ వీలర్‌లో మంటలు చెలరేగి అక్కడికక్కడే కాలిపోవడం ఇదివరకు చాలానే చూశాం. ఈ తరుణంలో ప్రముఖ వాహన తయారీదారు బజాజ్ పెట్రోల్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్లేస్‌లో సీఎన్‌జీ టూ వీలర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

- Advertisement -

ఇందులో భాగంగానే ఈ సీఎన్‌జీ బైక్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు ఈ బైక్‌కు సంబంధించి చాలా వార్తలు వినిపించాయి. ఈ సీఎన్‌జీ బైక్ ఎలా ఉంటుందో అని అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కంపెనీ కూడా సీఎన్‌జీ వెర్షన్‌లో ద్విచక్ర వాహనాలను లాంచ్ చేయలేదు. కానీ ఇప్పుడు బజాజ్ ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలో తొలి సిఎన్‌జీ బైక్‌ను భారతీయ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

Also Read: బజాజ్ తొలి CNG బైక్ లాంచ్‌కు సిద్ధం.. 50 శాతం ఇంధన ఖర్చు ఆదా.. ధర చాలా తక్కువ..!

ఈ బైక్‌ను తీసుకువస్తున్నట్లు కంపెనీ ప్రకటించినప్పటి నుంచి అందరిలోనూ ఒకటే ఉత్కంఠ మొదలైంది. కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వాహన ప్రియుల ముందుకు ఈ బైక్ మరికొద్ది రోజుల్లో దర్శనమివ్వనుంది. ఈ మేరకు కంపెనీ తాజాగా లాంచ్ డేట్‌ను వెల్లడించింది. ఈ బైక్‌ను భారతదేశంలో జూలై 5న గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే లాంచ్‌కు మరో మూడు రోజులు ఉండటంతో ఈ బైక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో స్టార్ట్ అయింది.

దీని కోసం కస్టమర్లు కేవలం తమ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అందువల్ల ఎప్పట్నుంచో ఈ సీఎన్‌జీ బైక్‌ కోసం ఎదురుచూస్తున్న వాహన ప్రియులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ బైక్ ఒక్క సీఎన్‌జీతోనే కాకుండా పెట్రోల్‌తో కూడా నడుస్తుందని కంపెనీ తెలిపింది. సీఎన్‌జీ అయిపోయాక పెట్రోల్‌తో నడుపవచ్చని.. పెట్రోల్ అయిపోతే సీఎన్‌జీతో నడుపవచ్చని పేర్కొంది.

Also Read: ప్రపంచంలోనే తొలి CNG బైక్.. బజాజ్ నుంచి.. జూన్ 18న లాంచ్!

కాగా ఈ బైక్‌ పేరును కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ బైక్‌ను ‘బజాజ్ బ్రూజర్ సీఎన్‌జీ’గా పిలుస్తున్నారు. ఈ బైక్ కిలో సిఎన్‌జీకి దాదాపు 100 కి.మీ మైలేజీ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే దీని ధర కూడా వెల్లడించలేదు. కానీ అంచనా ధర ప్రకారం.. ఈ సీఎన్‌జీ బైక్ రూ.1లక్ష లోపు ఉంటుందని అంటున్నారు. వీటిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News