Big Stories

2024 Bajaj Pulsar N250 : కిర్రాక్ లుక్‌తో స్టైలిష్ ఫీచర్స్‌తో బజాజ్ పల్సర్ N250 కొత్త వెర్షన్!

2024 Bajaj Pulsar N250
2024 Bajaj Pulsar N250

2024 Bajaj Pulsar N250 : మార్కెట్‌లో పల్సర్ బైక్స్‌కు ఎంత క్రేజం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బైక్స్‌కు మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ఆటోమొబైల్ మార్కెట్‌‌లోకి కొత్తకొత్త బైకులు వస్తున్నా పల్సర్ డిమాండ్ మాత్రం పెరగడం తప్పా తగ్గడం లేదు. అయితే టెక్ యుగంలో యువత లేటేస్ట్ ఫీచర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పల్సర్ కూడా కాలానికి తగ్గట్టుగా అప్‌డేట్ అవుతూ సరికొత్త ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా బజాజ్‌ పల్సర్‌ N250 మోడల్‌ను విడుదల చేసింది. అట్రాక్ట్ చేసే లుక్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. కొత్త పల్సర్ ధర, ఫీచర్లు తదితర విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

పల్సర్ బైకులు ఎప్పుడు కూడా యూత్ ఫేవరేట్‌గా ఉంటాయి. అందులో బజాజ్ పల్సర్ N250 బైక్‌ అప్‌డేటెడ్ వెర్షన్ కూడా కచ్చితంగా ఉంటుంది. అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను బజాజ్ పల్సర్ రూ. 1.51 లక్షల ఎక్స్-షోరూమ్‌ ధరగా నిర్ణయించింది. ఈ బైక్‌ను దాని ముందు వెర్షన్ కంటే మంచి లుక్, మార్పులతో చూడొచ్చు.

- Advertisement -

Also Read : క్రేజీ డీల్.. టాటా పంచ్ EVపై భారీ డిస్కౌంట్

2024 బజాజ్ పల్సర్ మోడల్‌లో అతిపెద్ద మార్పు ఏమిటంటే.. బైక్‌ ముందు వైపు ఎండ్యూరెన్స్-సోర్స్డ్ 37mm అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో వస్తుంది. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో కలిగి ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది.

ఇందులో ABS మోడ్‌లు ఉన్నాయి. రోడ్ మరియు ఆఫ్-రోడ్ వంటి మోడ్‌లను సంస్థ తీసుకొచ్చింది. మీరు రైడ్‌లో ఎంచుకున్న మోడ్‌ ఆధారంగా ABS పనితీరు మారుతుంటుంది. బైక్‌‌‌పై రెయిన్‌ మోడ్‌లో రైడింగ్‌ చేసేటప్పుడు ఏబీఎస్‌ సిస్టమ్‌ అత్యంత అప్రమత్తంగా పనిచేస్తుంది. వీల్‌ లాక్‌ను కూడా గుర్తిస్తూ రైడర్‌కు మరింత అనుకూలంగా మారుతుంది. ఇక ఆఫ్‌ రోడ్‌ మోడ్‌లో మాత్రమే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను ఆఫ్ చేయవచ్చు.

కొత్త బజాజ్‌ పల్సర్ N250లో 140-సెక్షన్ వెనుక టైర్‌ కలిగి ఉంటుంది. ఫ్రంట్ టైరులో ఎటువంటి మార్పు చేయలేదు. కలర్స్‌ విషయానికొస్తే.. ఇందులో రెడ్, బ్లాక్, వైట్‌లో లభిస్తుంది. ఫోర్క్‌లు మాత్రం బ్లాక్, గోల్డ్ కలర్స్ పొందుతుంది.

ఇంజిన్‌ విషయానికొస్తే.. పల్సర్ N250 లో 249 cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 24.1 bhpని, 21.5 Nm గరిష్ఠ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది.

Also Read : రూ. 50 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ చూస్తే రచ్చే!

బజాజ్‌ పల్సర్‌ N250 పూర్తి అప్‌గ్రేడ్‌ల తర్వాత దీని ధర రూ.1,829 పెరుగుతుంది. ఫైనల్‌గా రూ. 1.51 లక్షల వద్ద ఉంటుంది. 250 cc వేరియంట్లలో ఉన్న ఇతర కంపెనీ బైకులకు పల్సర్ గట్టిపోటీని ఇవ్వనుంది. బజాజ్ పల్సర్‌లోని అనేక మోడళ్లను అప్‌గ్రేడ్ చేస్తూ కాలానికి అనుగుణంగా మార్పులు చేస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News