Big Stories

First CNG Bike from Bajaj: 100 కిమీ మైలేజీతో బజాజ్ కొత్త CNG బైక్.. జూలై 5న లాంచ్..!

Worlds First CNG Bike from Bajaj Launching on July 5: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బజాజ్ CNG బైక్‌ను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు బజాజ్ ఆటో వెల్లడించింది.రాబోయే బజాజ్ CNG బైక్ జూలై 5, 2024న విడుదల కానుంది. ఇది గతంలో జూలై 17 విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించి.. ఇప్పుడు ఆ తేదీని మార్చింది. బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్‌తో పాటు రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో కొత్త CNG‌ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

దీనికి సంబంధించిన టీజర్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. దీని ప్రకారం బజాజ్ CNG  ఫ్లాట్ సింగిల్ సీటును కలిగి ఉంటుంది. దానితో పాటు CNG ట్యాంక్ తీసుకోవడం కోసం ఒక మూత కూడా కనిపిస్తుంది. ఈ బైక్ సిఎన్‌జి, పెట్రోల్ ట్యాంక్‌లతో కూడిన డ్యూయల్ ఫ్యూయల్ ట్యాంక్‌లతో వచ్చే అవకాశం ఉంది. రెండు CNG బైక్‌ల విషయంలో ధరలు చాలా ముఖ్యం. అలానే సేఫ్టీ, మెయింట్నెస్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

- Advertisement -

బాజాజ్ నుంచి రాబోయే CNG బైక్  ప్రపంచంలోనే మొదటిది. ఇది గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. CNG బైక్  ‘బ్రూజర్’ అనే పేరుతో వస్తుంది. బజాజ్ ఇటీవల ట్రేడ్‌మార్క్ చేసిన షార్ట్‌లిస్ట్ చేసిన నేమ్‌ప్లేట్లలో ఇది ఒకటి. అదే సెగ్మెంట్‌లోని పెట్రోల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లతో పోలిస్తే CNG మోటార్‌సైకిల్ రన్నింగ్ ఖర్చులను 50 శాతం తగ్గించుకోవచ్చని బజాజ్ తెలిపింది.ద్విచక్ర వాహన తయారీదారుకి CNG త్రీ-వీలర్‌లను తయారు చేయడంలో సుదీర్ఘ చరిత్ర ఉంది.

Also Read: బడ్జెట్‌లో మంచి మైలేజీ ఇచ్చే కార్లు.. రూ.3 లక్షలతో కొనుగోలు చేయవచ్చు!

అయితే ఈ కంపెనీ CNG ఆధారిత బైక్‌ను తీసుకురావడం ఇదే మొదటిసారి. కంపెనీ 100-150 cc కమ్యూటర్ ఇంజన్‌తో వస్తుంది. బైక్ రౌండ్ LED హెడ్‌లైట్, చిన్న సైడ్ వ్యూ మిర్రర్, కవర్ CNG ట్యాంక్, పొడవైన సింగిల్ సీట్, హ్యాండ్ గార్డ్, అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డిజిటల్ స్పీడోమీటర్ వంటి ఫీచర్లతో రావచ్చు. కంపెనీ తన ఎంట్రీ లెవల్ బైక్‌లో CNG టెక్నాలజీని ప్రవేశపెట్టవచ్చు. దీని కారణంగా దీని మైలేజ్ కిలోకు 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కానీ సరైన సమాచారం లాంచ్ సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News