Big Stories

Bajaj CNG Bike Launching: ప్రపంచంలోనే తొలి CNG బైక్.. బజాజ్ నుంచి.. జూన్ 18న లాంచ్!

World First CNG Bike from Bajaj Launching on June 18th: పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. సాధారణంగా కార్లలో సీఎన్‌జీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే సీఎన్‌జీ తక్కువ ధరకే లభిస్తుంది. వాటితో పోలిస్తే ఎక్కువ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. ఈ సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకొని టూ వీలర్ కంపెనీలు సైతం సీఎన్‌జీ బైక్‌లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేయనుంది. జూన్ 18, 2024న కంపెనీ విడుదల చేయనున్నట్లు తెలిపింది.

- Advertisement -

పల్సర్ NS400Z లాంచ్ సందర్భంగా బజాజ్ మొదటి CNG బైక్ విడుదల చేయనున్నట్లు బజాజ్ ఆటో తెలిపింది. కొత్త బజాజ్ CNG మోటార్‌సైకిల్ అనేక సందర్భాల్లో గుర్తించబడింది. టెస్టింగ్ సమయంలో బైక్ ఒక పెద్ద ఇంధన ట్యాంక్‌ కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఇది డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్‌ను సూచిస్తుంది. బైక్ ఇంజన్ 100-125 ccగా ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

Also Read: డ్యూక్‌కు పోటీగా పల్సర్ NS400Z లాంచ్.. ధర ఎంతంటే?

బజాజ్ CNG మోటార్‌సైకిల్‌లో ప్రత్యేకత ఏమిటంటే ఇది డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్‌పై వస్తుంది. టెస్ట్ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్, డిస్క్, డ్రమ్ బ్రేక్ సెటప్‌తో కనిపించింది. భద్రతా పరంగా బైక్‌లో సింగిల్-ఛానల్ ABS, కాంబి-బ్రేకింగ్‌ ఉండే అవకాశం ఉంది.

బజాజ్ కొత్త CNG బైకు పేరు ఏమిటనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. బజాజ్ ఇటీవలే బ్రూజర్ అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఇది ఈ సీఎన్‌జీ బైక అపిషీయల్ పేరు కావచ్చు. మొదటి బజాజ్ సీఎన్‌జీ బైక్ భవిష్యత్తులో మరిన్ని సీఎన్‌జీ మోడళ్లకు మార్గాన్ని సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.

Also Read: ఇసుజు నుంచి కొత్త పికప్ ట్రక్ లాంచ్.. ఇక దుమ్ములేపుడే!

పల్సర్ NS400Zను బజాజ్ ఇటీవల భారత్ మార్కెట్‌లో తన ఫ్లాగ్‌షిప్ పల్సర్‌ను విడుదల చేసింది. దీని దీని ధర రూ. 1.85 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. కేటీఎమ్ డ్యూక్ 390కి పవర్ ఇచ్చే ఇంజన్ పల్సర్ NS400Zలో తీసుకొచ్చారు. ఇది లిక్విడ్-కూల్డ్ 373 cc యూనిట్, ఇది 8800 rpm, 39 bhp, 6500 rpm వద్ద 35 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. రైడ్-బై-వైర్, రైడింగ్ మోడ్, ట్రాక్షన్ కంట్రోల్ అలాగే ABS మోడ్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News