Big Stories

Bajaj Freedom 125 Launched: అసలు ఊహించలేదు.. బజాజ్ CNG అదిరింది.. లుక్ చూస్తే పిచ్చెక్కిపోద్ది..!

Bajaj Freedom 125 CNG Bike Launched: బజాజ్ ఆటో ఈరోజు జూలై 5, 2024న దేశంతో పాటు ప్రపంచంలోనే మొట్టమొదటి CNG-ఆధారిత బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 CNGని విడుదల చేసింది. ఈ బైక్‌ను మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ లాంచ్ ఈవెంట్‌లో, బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్‌తో పాటు ప్రత్యేక అతిథిగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ బైక్‌లో 125సీసీ ఇంజన్ ఉంది. ఈ బైక్‌కు CNG నుండి పెట్రోల్‌కి, పెట్రోల్ నుండి CNGకి మారడానికి స్విచ్ ఉంది. ఇది దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్‌గా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది.

- Advertisement -

బజాజ్ ఆటో ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్‌ను మూడు వేరియంట్‌లతో విడుదల చేసింది. ఇందులో మొదటి వేరియంట్ డ్రమ్, రెండవది డ్రమ్ LED, మూడవది డిస్క్ LED వేరియంట్. దీని ప్రారంభ ధర రూ. 95,000 ఎక్స్-షోరూమ్. బేస్ డ్రమ్ వేరియంట్ ధర రూ.95,000, డ్రమ్ ఎల్ఈడీ ప్రారంభ ధర రూ.1.05 లక్షలు. డిస్క్ ఎల్ఈడీ ప్రారంభ ధర రూ.1.10 లక్షలు. ఇక్కడ పేర్కొన్న మూడు ధరలు ఎక్స్-షోరూమ్.

- Advertisement -

Also Read: దమ్మున్న ఎస్‌యూవీలు.. రోడ్లపై దుమ్ముదులిపేస్తాయి!

బైక్ డిజైన్ గురించి మాట్లాడితే దీనికి ప్రాధమిక కమ్యూటర్ డిజైన్ ఇచ్చారు. బైక్‌‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, టర్న్ ఇండికేటర్‌లు ఉంటాయి. ఈ బైక్‌లో మీకు పొడవైన సింగిల్-పీస్ సిట్ అందించారు. దాని క్రింద CNG ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్‌లో 17-అంగుళాల చక్రాలు, ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. ఫ్రీడమ్ 125 CNG బైక్‌లో ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ కాంబో కాంబినేషన్ ఉంది. LED హెడ్‌లైట్ స్పై షాట్‌లలో ఇచ్చారు.

బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్‌లో పెట్రోల్ ట్యాంక్‌తో పాటు CNG సిలిండర్ ఉంటుంది. అందులో చిన్న పెట్రోల్ ట్యాంక్ కూడా అందించారు. CNG నుండి పెట్రోల్‌కి, పెట్రోల్ నుండి CNGకి మారడానికి కూడా ఒక స్విచ్ ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌లో ఇది చాలా స్ట్రాంగెస్ట్ ట్యాంక్, రౌండ్ హెడ్‌లైట్, హ్యాండిల్ బార్ బ్రేస్‌లు, నకిల్ గార్డ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి.

Also Read: నంబర్ వన్‌గా బలెనో.. సేల్స్‌లో రికార్డులే రికార్డులు!

బైక్‌కు గ్రౌండ్ క్లియరెన్స్ ,అడ్వెంచర్ స్టైల్‌లో డిజైన్ చేశారు. ఇది పెద్ద సైడ్ పాన్, స్టైలిష్ బెల్లీ పాన్, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, పిలియన్ కోసం బలమైన గ్రాబ్ రైల్, రిబ్డ్ సీట్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనో-షాక్ సెటప్, టైర్ హగ్గర్ ఉన్నాయి. ఇందులో 2 కిలోల CNG ట్యాంక్, 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉన్నాయి. బజాజ్ ఫ్రీడమ్ 125 సిఎన్‌జి బైక్ 330 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News