Big Stories

Auto Expo 2025: ఈ ఐదు కార్లపైనే అందరిచూపు.. మైండ్ బ్లాక్ చేస్తున్న రేంజ్.. దుమ్ములేచిపోద్ది!

Auto Expo 2025: ఆటో మొబైల్ కంపెనీలు తమ రాబోయే కార్లను 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నాయి. ఆటో ఎక్స్‌పో అనేది భారతీయ కార్ల తయారీ కంపెనీలు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న తమ కొత్త ఉత్పత్తుల కాన్సెప్ట్ మోడల్‌లను ప్రదర్శించడానికి ఒక వేదిక. 2023 ఆటో ఎక్స్‌పో మాదిరిగానే 2025 ఆటో ఎక్స్‌పో కూడా అనేక కొత్త ఉత్పత్తుల దర్శనమిస్తాయి. రాబోయే ఆటో ఎక్స్‌పోలో అనేక ఎలక్ట్రిక్ కార్లు, కాంపాక్ట్ SUVలు, హైబ్రిడ్ కార్లు కూడా ప్రదర్శించనున్నారు. 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడే 5 మోస్ట్-వెయిటింగ్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

Hyundai Creta EV
హ్యుందాయ్ క్రెటా EV హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఘన విజయం తర్వాత, కంపెనీ ఈ SUV ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో రాబోయే ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనున్నట్లు అనేక మీడియా నివేదికలు చెబుతన్నాయి. రాబోయే ఎలక్ట్రిక్ SUVలో 45 kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉండొచ్చు. ఇది సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.

- Advertisement -

Maruti Suzuki eVX
మారుతి సుజుకి eVX మారుతి తన మొదటి ఎలక్ట్రిక్ కారు. దీన్ని 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించవచ్చు. రాబోయే ఎలక్ట్రిక్ SUV మారుతి సుజుకి eVX టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ఈ ఎలక్ట్రిక్ SUVలో 2 బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. ఈ కారు 48 kWh బ్యాటరీపై 400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. 60 kWh బ్యాటరీపై 550 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.

Also Read: రూ.1,499లకే EV.. దేశంలోనే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ టైమ్‌కే ఫుల్ ఛార్జ్!

Tata Harrier EV
టాటా హారియర్ EV టాటా హారియర్ EVని 2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. దీనిని 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రారంభించవచ్చు. రాబోయే ఎలక్ట్రిక్ SUVలో 60 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.

Skoda Compact SUV
స్కోడా కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌కు దేశంలో అత్యధిక డిమాండ్ ఉంది. ఇందులో టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్ వంటి SUVలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు స్కోడా తన కొత్త SUVని ఈ విభాగంలో 2025 ఆటో ఎక్స్‌పోలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే SUV 1.0-లీటర్ TSI ఇంజన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 115bhp పవర్, 178Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది.

Also Read: మారుతి నుంచి కొత్త డిజైర్.. మైలేజ్ 31కిమీ కంటే ఎక్కువే!

Toyota Fortuner MHEV
భారతీయ కస్టమర్లలో బాగా డిమాండ్ ఉన్న టొయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ వేరియంట్ వచ్చే ఏడాది జరగనున్న ఆటో ఎక్స్‌పోలో విడుదల చేయవచ్చు. రాబోయే SUV ప్రస్తుతం ఉన్న 2.8-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. దీనిలో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం ఉపయోగించారు. రాబోయే SUV ఇంజన్ గరిష్టంగా 201bhp పవర్ 500Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేయగలదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News