Big Stories

Airtel Hikes Tariffs: జియో బాటలో ఎయిర్‌టెల్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు!

Airtel Hikes Recharge Plans: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్ టారిఫ్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు జులై 3 నుంచి అమలులోకి వస్తాయని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది.

- Advertisement -

దేశంలోని అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయితే, రిలయన్స్ జియో సంస్థ.. తమ టారీఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎయిర్‌టెల్ కూడా ధరలను పెంచడం గమనార్హం.

- Advertisement -

అపరిమిత వాయిస్ ప్లాన్‌లలో ఎయిర్‌టెల్ టారిఫ్‌ను రూ.179 నుంచి రూ.199కి పెంచింది. అదే విధంగా రూ.299 నుంచి రూ.349, రూ. 399 నుంచి రూ. 449 వరకు పెరిగాయి. అలాగే రూ.455 నుంచి రూ.599 వరకు పెంచగా.. రూ.1,799 నుంచి రూ.1,999 వరకు పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

రిలయన్స్ జియో మొబైల్ 12 నుంచి 27 శాతం వరకు ప్రకటించగా.. ఎయిర్‌టెల్ మాత్రం రీఛార్జ్ ధరలు 10 నుంచి 21 శాతం పెరిగాయి. అయితే రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ టెలికాం సంస్థలు కస్టమర్లపై భారం మోపాయి.

Also Read: భారీగా పెరిగిన జియో రీచార్జ్ ధరలు..అంబానీపై ట్రోల్స్!

కాగా, దేశంలో టెల్కోలకు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాలను ప్రారంభించేందుకు ప్రతీ కస్టమర్‌పై ఆవరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్(ఏఆర్పీయూ) రూ.300 కంటే ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్‌టెల్ మీడియా ప్రకటనలో తెలిపింది.

గతంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు పెంచాయి. ఈ సంస్థలు 2021 డిసెంబర్‌లో మొబైల్ సర్వీస్ రేట్లను పెంచాయి. అంతకుముందు 2019 లో టెలికాం సంస్థలు రేట్లను 20 నుంచి 40 శాతం వరకు పెంచాయి. అలాగే 2021లో 20 శాతం వరకు పెంచాయి. అయితే, తాము రీఛార్జ్ ధరలు పెంచినా.. కస్టమర్లపై ఎక్కువ భారదం పడకుండా చూసుకుంటామని ఎయిర్‌టెల్ సంస్థ చెప్పింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News