Big Stories

Best 125cc Bikes: మైలేజ్ కింగ్‌లు.. కేక పెట్టించే బైకులు.. యువతకు ఇవంటే పిచ్చక్రేజ్!

Best 125cc Bikes: దేశంలో బైకుల వాడకం విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు గళ్లీకో బైక్ ఉండే ఇప్పుడు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఉంటుంది. బైక్‌లు అనేవి మన జీవితంలో అవసరంగా మారాయి. ఈ క్రమంలోనే దేశంలో 125cc బైక్ సెగ్మెంట్ ఇప్పుడు చాలా పెద్దదిగా మారింది. యువత బాగా ఇష్టపడే సెగ్మెంట్ ఇది. 125 cc ఇంజన్ ఉన్న బైక్‌లలో మీరు మెరుగైన మైలేజీతో పాటు మంచి పర్ఫామెన్స్ పొందుతారు. మీరు ఈ సెగ్మెంట్‌లో సింపుల్, స్టైలిష్ డిజైన్‌లతో బైక్‌లను సులభంగా కనుగొనవచ్చు. రోజువారీ ఉపయోగంలో హైవేలో బాగా పర్ఫామ్ చేసే 5 అత్యంత అద్భుతమైన బైక్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Bajaj CT 125X
చిన్న పట్టణాలు, గ్రామాల వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని బజాజ్ ఆటో CT 125Xని మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది హెవీ డ్యూటీ బాడీతో వస్తుంది. ఈ బైక్ డిజైన్ చాలా సులభం కానీ బాడీ గ్రాఫిక్స్ దీనికి మంచి అనుభూతిని అందించడంలో సహాయపడతాయి. ఈ బైక్ ఎక్స్-షో రూమ్ ధర రూ.77 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 125సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజన్ 10 బిహెచ్‌పి పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ బైక్ ఒక లీటర్‌లో 59.6 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని ముందు టైరులో 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనుక టైరులో 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్  ఉంది. దీని రెండు టైర్లు 17 అంగుళాలు. ఇందులో హెడ్‌లైట్ గార్డ్, ఇంజన్ క్రాష్ గార్డ్, వెనుక లగేజ్ ర్యాక్ కూడా ఉన్నాయి.

- Advertisement -

Also Read: జీప్ నుంచి చౌకైన SUV.. ధర ఎంతంటే?

Hero Super Splendor
హీరో సూపర్ స్ప్లెండర్ ప్లస్ ఫ్యామిలీ క్లాస్‌కి చాలా ఇష్టమైన బైక్. ఇందులో 124.7సీసీ ఇంజన్ 10.7బిహెచ్‌పి, 10.6ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ బైక్‌లో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. దీని ముందు టైరులో 240ఎమ్ఎమ్ డిస్క్, బ్యాక్ టైరులో 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ ఉంది. ఇందులో 18 అంగుళాల టైర్లు ఉన్నాయి. రోజువారీ ఉపయోగం కోసం ఇది మంచి బైక్. ఈ బైక్‌ను మీ సైడ్ స్టాండ్‌లో పార్క్ చేస్తే అది స్టార్ట్ అవ్వదు. భద్రత కోసం ఇది మంచి ఫీచర్. ఇది ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్‌తో అడ్జస్ట్‌మెంట్ సస్పెన్షన్, వెనుక వైపున స్ప్రింగ్‌ను కలిగి ఉంది. బైక్ ధర రూ.80,848 నుంచి ప్రారంభమవుతుంది.

Honda Shine 125
125సీసీ బైక్ సెగ్మెంట్లో హోండా షైన్ చాలా ఫేమస్. ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా నిలిచింది. ఈ బైక్‌లో 124 సిసి ఎస్‌ఐ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 7.9 kW పవర్, 11 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ARAI ప్రకారం ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌లో 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. బైక్‌లో ముందువైపు 240 ఎమ్ఎమ్ డిస్క్, వెనుక 130 ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ ఉంది. ఇందులో 18 అంగుళాల టైర్లు ఉన్నాయి. ఈ బైక్ ధర రూ.79,800 నుంచి ప్రారంభమవుతుంది.

TVS Raider 125
TVS రైడర్ 125 బైక్‌కి అయితే దాని మైలేజ్ దాని ప్లస్ పాయింట్. ఈ బైక్‌లో 124.8 cc ఇంజన్ ఉంటుంది. ఇది 8.37 kW పవర్, 11.2 Nm టార్క్ ఇస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. బైక్‌లో రెండు 17 అంగుళాల టైర్లను అమర్చారు. ఇందులో ముందువైపు 240 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. ఇది 5-అంగుళాల TFT క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌లో స్ప్లిట్ సీట్ ఉంది. ఇది స్పోర్టీ లుక్‌ని అందించడంలో సహాయపడుతుంది. బైక్ డిజైన్ అత్యంత స్పోర్టీ, స్టైలిష్‌గా ఉంది. బైక్ ధర రూ.95,219 నుంచి ప్రారంభమవుతుంది.

 

Also Read: డిమాండ్ తగ్గేలా లేదు.. దూసుకెళ్తున్న ఫుల్ సైజ్ ఎస్‌యూవీ అమ్మకాలు!

Hero Glamour Xtec
హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ ఇప్పుడు మంచి మైలేజీని, స్ట్రాంగెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తోంది. ఈ బైక్‌లో 125సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 10.7 బిహెచ్‌పి పవర్, 10.6 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో ముందువైపు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. బైక్ ఇప్పుడు పూర్తిగా డిజిటల్ స్పీడోమీటర్‌ను కలిగి ఉంది. ఇందులో బ్లూటూత్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, USB ఛార్జర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, బ్యాంక్ యాంగిల్ సెన్సార్, LED హెడ్‌ల్యాంప్ ఉన్నాయి. Hero Glamour Xtec ధర రూ. 85,218 నుండి ప్రారంభమవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News