Big Stories

2025 Kia Seltos: కియా కొత్త కారు లాంచ్.. ఈసారి మరిన్ని అధునాతన ఫీచర్లతో.. ధర ఎంతంటే?

2025 Kia Seltos revealed in USA: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ ఆటో మొబైల్ మార్కెట్‌లో తనదైన శైలిలో దూసుకుపోతోంది. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కొత్త కొత్త కార్లను వాహన ప్రియులకు పరిచయం చేస్తూ అట్రాక్ట్ చేస్తుంది. లుక్, డిజైన్, ఫీచర్ల పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ కంపెనీ అమెరికాలో 2025 సెల్టోస్‌ను లాంచ్ చేసింది.

- Advertisement -

తాజాగా లాంచ్ అయిన 2025 కియా సెల్టోస్ నుంచి ఈఎక్స్, టాప్ ఎండ్ మోడల్ ఎస్ఎక్స్ వంటివి ఉన్నాయి. ఈ రెండు మోడల్స్ అదిరిపోయే ఫీచర్లున పొందినట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. యూఎస్‌లో ఎంట్రీ ఇచ్చిన 2025 కియా సెల్టోస్.. ఇండియా మార్కెట్‌లో ఉన్న కియా సెల్టోస్ కంటే కాస్త భిన్నంగా ఉంటుందని సమాచారం. అమెరికాలో లాంచ్ అయిన ఈ కారుకు.. ఇండియాలో అందుబాటులో ఉన్న కార్లకు డిఫరెంట్ ఛేంజెస్ ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

యూస్ మార్కెట్‌లో లాంచ్ అయిన 2025 కియా సెల్టోస్ నుంచి ఈఎక్స్ అండ్ ఎస్ఎక్స్ మోడల్స్ స్మార్ట్ పవర్ లిఫ్ట్‌గేట్, రివర్స్ పార్కింగ్ డిస్టెన్స్ వార్ణింగ్‌ను పొందినట్లు తెలుస్తోంది. అయితే ఇవి కేవలం ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లలో మాత్రమే లభిస్తున్నట్లు సమాచారం. మిగిలిన వేరియంట్‌లలో ఇవి ఉండే అవకాశం లేదని అంటున్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: దేశీయ మార్కెట్‌లోకి మరొక కొత్త కారు.. యమహో యమ ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడంటే..?

కాగా కియా మోటార్ కంపెనీ ఈ కొత్త మిడ్ స్పెక్ 2025 సెల్టోస్ ఈఎక్స్ మోడల్‌ను సన్‌రూఫ్‌తో తీసుకొచ్చింది. దీని కారణంగానే ఎస్‌ మోడల్‌ 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ను కోల్పోతుంది. అయితే దీని ప్లేస్‌లో 4.25 ఇంచెస్ యూనిట్‌ని అందించారు. వీటితో పాటు డ్రైవర్ సైడ్‌పవర్ విండోస్విచ్ కోసం ఇందులో ఆటోమేకర్ ఆటోఅప్/ డౌన్ ఫంక్షన్‌ను అందించారు.

అలాగే ఇందులో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అందించారు. అంతేకాకుండా ఈ 2025 సెల్టోస్‌ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 146bhp పవర్, 179nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా ఈ మోడల్ సీవీటీ ఆటోమేటిక్‌తో లభిస్తుంది. అమెరికా మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ కొత్త 2025 సెల్టోస్ కారు ఇండియాకి వస్తుందా లేదా అనే దానికి ఎలాంటి అప్డేట్ లేదు. అంతేకాకుండా దీని ధర విషయాలు తెలియనప్పటికీ.. ఈ కారు దాని ముందు మోడల్ కాంటే కాస్త ఎక్కువ ధరకే అందుబాటులో ఉంటందని తెలుస్తోంది. త్వరలో దీని అధికారిక ధరలో వెల్లడికానున్నాయి. దీని ప్రారంభ ధర USD 25,090 (సుమారు రూ. 20.4 లక్షలు).. అలాగే టాప్ ఆఫ్ లైన్ ట్రిమ్‌ల కోసం USD 31,090 (సుమారు రూ. 26 లక్షలు) వరకు ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News