Big Stories

2024 Hero Destini 125: మాస్ అప్డేట్‌లతో మళ్లీ వస్తున్న ‘హీరో డెస్టినీ 125’.. ఇక చూసుకో మావా..!

2024 Hero Destini 125: హీరో కంపెనీకి మార్కెట్‌లో క్రేజ్ మామూలుగా లేదు. ఈ కంపెనీ వాహనాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్లనే హీరో కంపెనీ ఓ వైపు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. అలాగే తమ వాహన ప్రియులకు మరింత అనుభూతిని అందించేందుకు పాత మోడళ్లను కూడా అప్డేట్ చేస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా 2024 హీరో డెస్టినీ 125 స్కూటర్ భారీ అప్‌గ్రేడ్స్‌తో మళ్లీ వానప్రియుల ముందుకు రావడానికి సిద్ధమైంది. 2018 చివరలో రిలీజ్ అయిన ఈ స్కూటర్ మళ్లీ ఇప్పుడు భారీ మార్పులతో వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

త్వరలో ఈ స్కూటర్ విడుదల కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ స్కూటర్ వివరాలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఈ లీక్స్ ప్రకారం.. త్వరలో మార్కెట్‌లోకి రాబోయే ఈ మోడల్ టర్న్ సిగ్నల్స్ స్లీక్‌గా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అందులో హాలోజెన్ ఎల్‌ఈడీ యూనిట్లను చూడవచ్చు. అలాగే బాడీ ప్యానెల్స్ మళ్లీ అప్డేట్ చేయబడ్డాయి. వీటితో పాటు 2024 డెస్టీనీ 125కి ముఖ్యంగా డ్యూయల్-స్పోక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ అప్డేట్‌తో స్పోర్టీలుక్‌ను అందిస్తుంది.

- Advertisement -

Also Read: సరికొత్త‌గా యమహా RX 100.. పిచ్చెక్కిస్తున్న లుక్!

అంతేకాకుండా సైడ్ మిర్రర్‌లు, టెయిల్ ల్యాంప్స్‌ సహా సైడ్ బాడీ వర్క్‌లో చాలా ఛేంజెస్‌తో ఇవి రానున్నాయి. ఈ స్కూటర్ బ్లాక్ పర్ల్‌తో పాటు మరికొన్ని కొత్త కలర్ ఆప్షన్లలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త కలర్స్ హీరో డెస్టినీకి మరింత అందాన్ని, లుక్‌ను తెచ్చిపెడతాయి. కాగా ఇందులో హీట్ షీల్డ్ ఎగ్జాస్ట్, ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్‌లను చూడవచ్చు. వీటితో పాటు మరెన్నో అప్డేట్‌లతో ఈ స్కూటర్ త్వరలో అందుబాటులోకి రానుంది.

ఈ స్కూటర్ టాప్ స్పెక్ వేరియంట్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉండే ఛాన్స్ ఉంది. ఇది 124.6 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. బిఎస్‌విఐ స్టేజ్ 2 కంప్లైంట్ ఇంజిన్ 7000 ఆర్‌పిఎమ్ వద్ద 9బిహెచ్‌పి, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.4 ఎన్‌ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. కాగా దీని ధర ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News