Big Stories

Nandyal Politics: పుష్ప కి శిల్ప స్ట్రోక్.. ఫైర్ అవుతున్న బెట్టింగ్‌బాబులు

- Advertisement -

దేశ రాజకీయాలలో ఏపీ లోని కర్నూలు జిల్లాలో గల నంద్యాల సెగ్మెంట్ కి ఒక ప్రత్యేక పేరు ఉంది. గతంలో ఇద్దరు రాష్ట్రపతులను అందించిన ఈ స్థానం ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటుంది. ఏపీలో ఎన్నికల కోసం 58 రోజులపాటు జరిగిన ప్రచారపర్వంలో.. రాష్ట్రంలో రెండు నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటిలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం ఒకటైతే.. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ పోటీ చేసిన నంద్యాల మరొకటి. ప్రత్యక్షంగా వచ్చి కొంతమంది. సోషల్ మీడియా ద్వారా మరి కొంతమంది పవన్ కోసం సపోర్ట్ చేసి పిఠాపురాన్ని హైలైట్ చేస్తే.. తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలలో రోడ్డు షో నిర్వహించటం హాట్ టాపిక్ అయ్యింది.

- Advertisement -

పిఠాపురంలో చివరి రోజు ప్రచారంలో బాబాయ్ కి సపోర్టుగా రామ్ చరణ్ ప్రచారాన్ని నిర్వహించారు. అదే రోజు నంద్యాల నియోజకవర్గంలో శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశారు. పవన్ కోసం కాకుండా వైసీపీ అభ్యర్ధికి ప్రచారం చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. మెగా బ్రదర్ నాగబాబు సైతం పరోక్షంగా ట్వీట్ ద్వారా స్పందించారు. మనతో ఉండే వాడే మనవాడు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దానిపై అల్లు ఫ్యాన్స్ అంతా నాగబాబుపై ట్రోలింగ్ చేయడం చివరికి ఆయన ఆ ట్వీట్ డిలీట్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ టోటల్ ఇష్యూతో నంద్యాలలో వైసీపీ గెలుపు పక్కా అని భావించారు.

ఇక ఎన్నికల రోజు ఓటు వేసేందుకు వచ్చిన అల్లు అర్జున్ తన మిత్రుడు కోసం మాత్రమే ప్రచారం చేశానని.. గతంలో ట్వీట్ చేశానని.. అందుకే ఈసారి డైరెక్ట్ గా వచ్చానని చెప్పారు. ఐదు సంవత్సరాలుగా అనేక రకాల కార్యక్రమాలు చేశారని.. ఆ కార్యక్రమాలను చూసి మరోసారి తన మిత్రుడికి అవకాశం ఇవ్వాలని కోరారు.

ప్రచార అనంతరం అల్లు అర్జున్ మీద.. పోలీసులు మీద ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని కేసులను కూడా నమోదు చేశారు. కొందరు అధికారులపై వేటు కూడా పడింది. ఆ క్రమంలో నంద్యాలలో వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని కోట్లల్లో కూడా బెట్టింగు జోరుగా సాగిందట. కానీ అనూహ్యంగా వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో పుష్పరాజుని నమ్ముకుని మోసపోయామని బెట్టింగ్ రాయుళ్లు ఫైర్ అవుతున్నారట.

Also Read: రోజా.. ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక

మరోవైపు నంద్యాలలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో దానిపై మరింత ఫోకస్ పెరిగింది. జాతీయస్థాయిలో నంద్యాల పేరు మారుమోగింది. దాంతో ఎక్కడైతే తాము అవమానానికి గురయ్యామో.. మళ్లీ అక్కడే ఈసారి ఎలాగైనా వైసీపీని బలంగా ఢీకొట్టేలా ప్లాన్లు వేశారట. అందుకే నంద్యాల సెగ్మెంట్లో అత్యధికంగా ముస్లిం మైనార్టీలు ఉన్న ఓటు బ్యాంకుని క్యాచ్ చేసుకోవడం కోసం మైనార్టీ నేతను బరిలో నింపింది. సీనియర్ నాయకులు మాజీమంత్రి ఎన్ఎండి ఫరూక్ పోటీలో ఉండడంతో సర్వత్రా ఈ సీటు గెలుపోటములపై చర్చ నడిచింది.

ఓటమి భయంతోనే వైసీపీ ఇలా సినిమా హీరోలను ప్రచారానికి వాడుకున్నారని మొదటి నుంచి ఆరోపిస్తూ వచ్చింది. ఫలితాలు వెల్లడయ్యే నాడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా వెలువడిన ఫలితాలలో నంద్యాల నుంచి ఫరూక్ గెలవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. అల్లు అర్జున్ ప్రచారం చేసిన కూడా ఓడిపోవడం ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాలలో కూటమి కైవసం చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు ఖంగుతిన్నారు.

మొత్తానికి ఫ్రెండ్ కోసం.. ఫ్యామిలీని కాదని మరీ వెళ్లి ప్రచారం చేసిన అల్లు అర్జున్ కి ఈ ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఇక వైసీపీ ఘోర పరాభవంలో శిల్పా రవిచంద్ర కిషోర్ కూడా కొట్టుకుపోయారని తెలుగు తమ్ముళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News