Big Stories

YS Jagan Absent for Speaker Election: స్పీకర్ ఎన్నికకు జగన్ డుమ్మా.. కారణం ఇదేనా..?

YS Jagan Mohan Reddy Not Attends To Speaker Election: తడబడుతూ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన మాజీముఖ్యమంత్రి జగన్.. సభా సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారు. స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియలో ప్రతిపక్షం పాలుపంచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్పీకర్‌ను అన్ని పార్టీలు కలిసి సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ.. అయితే మాజీ సీఎం మాత్రం ఆ ఆనవాయితీని పక్కనపెట్టి పులివెందుల వెళ్లిపోయి. రివర్స్‌ సంప్రదాయానికి తెరతీశారు. ఇంతకీ జగన్‌ ఎందుకిలా చేస్తున్నారు? ఓటమి బాధ నుంచి బయటపడలేకపోతున్నారా..?

- Advertisement -

ఘోర పరాజయం దెబ్బకి తన పేరునే రెండో సారి చెప్పాల్సివచ్చింది మాజీ ముఖ్యమంత్రికి  ప్రతిపక్షనేత హోదా కూడా దక్కక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చేసిన ప్రమాణస్వీకారానికి రెండో రోజే తిలోదకాలిచ్చారు జగన్. సభాసంప్రదాయాలు పాటిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసిన జగన్‌ స్పీకర్‌ ఎన్నిక విషయంలో ఆనవాయితీకి మంగళం పలికారు. స్పీకర్‌ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సభా సంప్రదాయం.

- Advertisement -

అసెంబ్లీలో ప్రాతినిథ్యం ఉన్న అన్ని పార్టీల నుంచి ఒక్కో సభ్యుడు వచ్చి స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తిని సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెడతారు. పార్టీ తరఫున అభినందనలు తెలుపుతారు. 2019లో టీడీపీ 23 స్థానాలు మాత్రమే గెలుచుకున్నప్పుడు చంద్రబాబు కూడా అప్పటి స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఎన్నిక సమయంలోనూ అదే ఆనవాయితీని కొనసాగించారు. పార్టీ తరఫున అచ్చెన్నాయుడును సభాధ్యక్ష స్థానం వద్దకు పంపారు. ఆ తర్వాత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: YS Jagan: స్పీకర్‌కు జగన్ లేఖ.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ..

కానీ, జగన్‌ మాత్రం ఇప్పుడు తాను రాకపోవడమే కాదు. వైసీపీ ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు పొంగిపోయిన జగన్‌ 2024లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయే సరికి షాక్‌ తిన్నారు. ఆ షాక్‌ నుంచి ఆయనింకా బయటకు రావడం లేదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్కచెల్లెమ్మల ఓట్లు, అవ్వా తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని దాదాపు ఏడ్చినంత పనిచేశారు.

ఓటమిని హుందాగా స్వీకరించలేకపోతున్న జగన్ ఆ క్రమంలో రాజకీయ సంప్రదాయాలూ పాటించకుండా, రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండడం విమర్శల పాలవుతోంది. నిజానికి ఓటమి బాధలో ఉన్న జగన్‌పై కూటమి ప్రభుత్వం హుందాతనం ప్రదర్శించింది. శాసన సభ కొలువుదీరిన మొదటిరోజే వైసీపీ సభ్యుల గౌరవానికి భంగం కలగించొద్దని కూటమి సభ్యులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతిపక్ష హోదా లేకుండా పోయిన జగన్‌ వాహనానికి నిబంధనల ప్రకారం అనుమతిలేకపోయినా జగన్‌ కాన్యాయ్‌ని అసెంబ్లీ ప్రాంగణం ప్రధాన పోర్టికో వరకు అనుమతించారు.

Also Read: మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం..

వైసీపీ సభ్యుల విజ్ఞప్తి మేరకు మంత్రుల తర్వాత జగన్‌ ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు అంగీకరించారు. రెండున్నరేళ్ల క్రితం అదే అసెంబ్లీలో చంద్రబాబును ఘోరంగా అవమానించింది జగన్ ప్రభుత్వం.. దాంతో చంద్రబాబు సీఎంగానే సభలో అడుగుపెడతానని.. లేకపోతే అసలీ రాజకీయాలే తనకు వద్దని  శపధం చేసి బయటకొచ్చారు.

అప్పటి అవమానాలను గుర్తుపెట్టుకోకుండా చంద్రబాబు పెద్దమనసు చాటుకున్నా జగన్ మాత్రం సభాసంప్రదాయాలను తుంగలో తొక్కేస్తున్నారు. సభలో ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌ ఆ తర్వాత కాసేపైనా సీట్లో కూర్చోకుండా బయటకు వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక స్పీకర్‌ బాధ్యతల స్పీకారాన్నీ బహిష్కరించి జగన్‌ మరిన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నారు.

Also Read: Chandrababu Emotional Comments: మళ్లీ జన్మ అంటూ ఉంటే కుప్పంలోనే పుడతా: సీఎం చంద్రబాబు భావోద్వేగం

అటు చూస్తే జగన్ వెకిలి నవ్వులతో జగన్ అవహేళన చేసిన పవన్‌కళ్యాణ్‌ని అందరూ ఆకాశానికెత్తేస్తున్నారు. అసెంబ్లీ గేటు తాకనీయమని రోజా లంటి వారు కూడా ఆనాడు తెగ హడావుడి చేశారు.. ఇప్పుడు వారంతా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు.

ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం ఆపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తే అంతంత మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రావడం.. ఈ మధ్యలో రుషికొండ రాజ్‌మహల్ రహస్యం వెలుగుచూడటం ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని షాకులు తగులుతున్నాయి. దానికి తోడు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసికట్టుకున్న పార్టీ ఆఫీసులకు టైం దగ్గర పడింది. నిర్మాణంలో ఉన్న వైసీపీ సెంట్రల్ ఆఫీసుని ఇప్పటికే కూల్చేశారు. 26 జిల్లాల్లో కట్టుకుంటున్న ఆఫీసులకు ఒకటొకటిగా నోటీసులు వెళ్తున్నాయి.

Also Read: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్

అసెంబ్లీ ఎగ్గొట్టి మరీ పులివెందుల పర్యటనకు వెళ్తే రాయలసీమ నేతలు ఇద్దరు ముగ్గురు తప్ప పెద్దగా పేరున్న నేతలెవరూ ఆయన చుట్టుపక్కన కనిపించలేదు. ఇక సొంత ఊళ్లో సొంత పార్టీ కార్యకర్తలే ఝలక్ ఇచ్చారు. మాజీ సీఎంను చూసేందుకు నాయకులు రాకపోయినా.. పెద్ద ఎత్తున నియోజకవర్గ కార్యకర్తలు, వచ్చారు అయితే.. జగన్‌ను కలవడానికి చాలా మంది కార్యకర్తలు ప్రయత్నించగా వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ అడ్డుకున్నారు. దాంతో సహనం కోల్పోయిన కార్యకర్తలు మాజీ సీఎం ఇంటి అద్దాలు పగులకొట్టారు. వైఎస్ జగన్ డౌన్.. డౌన్ అంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఊహించని పరిణామంతో వైఎస్ జగన్ సైతం షాకయ్యారట.

మరోవైపు పులివెందుల బయలుదేరేటప్పుడు జగన్ మోహన్ రెడ్డికి వీడ్కోలు పలకడానికి గన్నవరం విమానాశ్రయానికి ఒక్క ఎమ్మెల్యే కూడా రాకపోవడం చర్చాంశనీయంగా మారింది. తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమనాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక వైసీపీకి చెందిన నాయకులు గానీ, ఓటమి చెందిన ఒక్క ఎమ్మెల్యేగానీ రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టించుకుని తిరిగిన జగన్ పరిస్థితి అలా అయిపోయిందిప్పుడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News