Big Stories

YCP YS Jagan Palace List: జగన్ కు ఊరికొక్క ప్యాలెస్‌.. మొత్తం ఎన్నో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

YCP YS Jagan Mohan Reddy Palace List: రాష్ట్రంలో అక్రమ భవనాలు ఉండడానికి వీల్లేదు.. అలాంటి వాటిని మా ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజా వేదిక కూడా అలాంటిదే కాబట్టి కూల్చేసామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జగన్ గొప్పగా చెప్పుకున్నారు. అయితే తన పాలనలో ఆయన చేసినవన్నీ ఆక్రమణలే అని బట్టబయలవుతున్నాయి.. ప్యాలెస్‌లలోనే బతకాలని డిసైడ్ అయినట్లు ఆయన పార్టీ ఆఫీసుల్ని కూడా కోటల్లా నిర్మించుకున్నారు. విశాఖలో నివాసానికి రుషికొండ ప్యాలెస్‌ను నిర్మించుకుంటే.. ఆయన పార్టీ కూడా అనుమతులు లేకుండా ప్రతి జిల్లాల్లో పార్టీ ఆఫీసు పేరుతో ప్యాలెస్‌లు కట్టేసుకుంది. ఇప్పుడా భాగోతాలు బయటపడుతూ.. ఆ కట్టడాల సోయగాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

- Advertisement -

బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ.. ఇలా ఊరూరా రాజప్రాసాదాల్ని తలదన్నే సొం ప్యాలెస్‌లు.. ఎక్కడ చూసినా భూములు.. వేల కోట్ల ప్రాజెక్టులు, కంపెనీలు, ఆస్తులు.. ఇదీ మాజీ ముఖ్యమంత్రి ఎదురింటిసందింటి జగన్మోహన్‌రెడ్డి రాజవైభోగం.. తాను పేదలకు ప్రతినిధినని పదేపదే ఊదరకొట్టే మాజీ సీఎం జగన్ ఒక్కరి పేరు మీదే 529.87 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు తాజా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు .. ఇక అఫిషయల్‌గా ఆయన చూపించిన లెక్కల ప్రకారం ఆ ఫ్యామిలీ ఆస్తులు 757.65 కోట్లు.

- Advertisement -

జగన్‌పై అక్రమ ఆస్తుల కేసులు చాలానే ఉన్నాయి. 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తెర వెనుక పెత్తనం చేసి లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈడీ ఆయనతో పాటు భారతికి సంబంధించిన 40 వేల రూపాయల ఆస్తులను అటాచ్ చేయడమే ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. జగన్ మోహన్ రెడ్డికి అదేం ఫాంటసీనో కానీ ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ఓ ప్యాలెస్ ఉండాలనుకుంటారు. ఊరికో బిల్డింగ్ కట్టుకుంటారు.

Also Read: YSRCP Defeat : నాయకులకు తెలిసిన నిజం.. జగన్ తెలియలేదా ?

ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి సొంత ప్రాంతం పులివెందులలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్యాలెస్ లాంటి భవనం కట్టుకున్నారు. కడపలో మరో ప్యాలెస్ ఉంది. ఇక ఇడుపులపాయలో కూడా ప్యాలస్ లాంటి భవనం ఉంది. జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ గురించి చెప్పనవసరం లేదు… అంతే కాదు జగన్ బెంగళూరు ప్యాలెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. సుమారు 23 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్ లో హెలిపాడ్, ఇండోర్ థియేటర్స్ వంటి ఎన్నో అధునాతన హంగులు ఉన్నాయంటారు. ఇప్పుడు జగన్ నివాసం ఉన్న తాడేపల్లి ప్యాలెస్ గా పిలవబడే భవనం కూడా కోటే.

జగన్ సీఎం అయ్యాక విశాఖ రుషికొండను తొలిచేసి ప్రపంచం అబ్బురపోయేలా రాజప్రసాదాన్ని ప్రజల సొమ్ముతో నిర్మింపచేసుకున్నారు. పాపం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఆ ప్యాలెస్‌ను ఎలా వినియోగించుకోవాలో కూడా అర్థం కావడం లేదు. అయినా వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ధనదాహం తీరలేదు. సొంతానికే కాదు.. పార్టీ జిల్లా కార్యాలయాలకూ మైసూరు రాజమహల్‌ని తలదన్నేలా భవనాల్ని కట్టించుకోవడం విభ్రాంతికి గురిచేస్తుంది. 30 ఏళ్లు తానే అధికారంలో ఉంటానన్న భ్రమలో500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి విశాఖలోని రుషికొండపై అత్యంత విలాసవంతమైన భవనాల్ని కట్టుకున్న ప్యాలెస్‌లపై జగన్‌కు మోజు తగ్గలేదు.

పార్టీ కార్యాలయాల పేరుతో ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ భూములను అధికారికంగా కబ్జా చేశారు. 33 ఏళ్ల లీజు ముసుగులో కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు టెండర్‌ పెట్టారు. చేతిలో అధికారం ఉందని చెలరేగిపోయారు. అత్యంత విలువైన భూముల్ని చెరబట్టారు. నగరాలు, పట్టణాల నడిబొడ్డున, జాతీయ రహదారులకు పక్కన అత్యంత ఖరీదైన భూముల్ని తన స్వాధీనం చేసుకున్నారు. గతంలో వివిధ విభాగాలు, సంస్థలకు కేటాయించిన భూముల్నీ బలవంతంగా లాక్కున్నారు.

Also Read: YS Jagan: స్పీకర్‌కు జగన్ లేఖ.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ..

ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తిన జిల్లా కలెక్టర్లు, అధికారగణం పైనుంచి ఉత్తర్వులు రావడమే తడవు జీ హుజూర్‌ అంటూ.. భూముల కేటాయింపు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో కోట్ల విలువైన భూముల్ని ఏడాదికి ఎకరానికి వెయ్యి రూపాయల చొప్పున లీజుకు కట్టబెట్టేశారు. ప్రజావేదిక కూల్చి వేసినప్పుడు అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లయినా కూల్చేస్తామన్న జగన్ ఊరూరా అనుమతి లేకుండానే పార్టీ కార్యాలయ భవనాలు కట్టేసుకున్నారు.

ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీకి వచ్చిన రూ.వందల కోట్లే వెచ్చించారో, మరే రూపంలో వచ్చిన డబ్బు ఖర్చు చేస్తున్నారో గానీ.. ఏ భవనం చూసినా కళ్లు తిరిగిపోయేలా డిజైన్ చేశారు. వైసీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు కొన్నిచోట్ల ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మిగతాచోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. విశాఖ, ఒంగోలులో కార్యాలయాల్ని ఇప్పటికే ప్రారంభించారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో జలవనరుల శాఖకు చెందిన స్థలంలో అనుమతుల్లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వం కూల్చి వేసింది. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నిర్మించుకుంటున్న కార్యాలయాలు వెలుగుచూశాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరం నుంచి 2 ఎకరాల చొప్పున భూములు కేటాయించారు. 26 జిల్లాల్లో కలిపి 42.24 ఎకరాలు కేటాయించగా.. ఆ భూముల విలువ 688 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read: దూకుడు పెంచిన పవన్ కల్యాణ్.. యాక్షన్ ప్లాన్ మామూలుగా లేదుగా

ఆ అనుమతులు లేని కార్యాలయన్నిటినీ వైసీపీ రాజ్యసభ సభ్యుడుఆళ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ ఇన్‌ఫ్రా సంస్థే నిర్మిస్తుండటం గమనార్హం… ఇప్పుడా భాగోతాలన్నీ బయటపడుతూ… ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. అయిదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసిన జగన్.. తన రాజసాన్ని అలా కొనసాగించేశారు మరి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News