Big Stories

Reason for Roja Defeat: రోజా.. ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక..

Reason for Rk Roja’s Defeat in AP Elections 2024: ప్రజలు వద్దన్నారు.. పార్టీ నేతలు ఛీ కొట్టి ఒంటరిని చేశారు. సొంత అనుచరులే హ్యాండ్ ఇచ్చారు. మొత్తానికి నగరిలో మాజీ మంత్రి ఆర్‌కే రోజారెడ్డి ఒంటరయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫైర్ బ్రాండ్ దారేటు..? ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఐదెళ్ళుగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అమె.. ఓటమి తరువాత కనిపించకుండా పోయారు. దాంతో ఆమె భవితవ్యంపై పెద్ద చర్చే జరుగుతుంది. ఆమె మళ్ళీ మొహానికి రంగులు చేసుకుంటారా..? బుల్లితెరపై తళుక్కుమంటారా..? రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అసలామె నెక్స్ట్ స్టెప్ ఏంటి?

- Advertisement -

చిలుక ఏతోడూ లేక ఎటు వైపమ్మా ఒంటరి నడక.. ఈ పాట రోజా నటించిన శుభలగ్నం సినిమాలోది. ఆ మూవీలో ఆ పాట అమనికి బ్యాక్‌గ్రౌండ్‌గా ప్లే అయింది. ఇప్పుడదే సాంగ్ ఆ సినిమాలో నటించిన మాజీ హీరోయిన్ రోజారెడ్డికి సరిగ్గా సింక్ అవుతుంది. ఓటమి తర్వాత ఆ పాటు ఇప్పుడు అ పాట ఆమెకు సరిగ్గా సెట్ అయ్యిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలుగు రాజకీయాల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటే ఫైర్. ఫైర్ అంటే రోజా అన్నట్లు నడిచింది. గత పదేళ్లలో ప్రత్యర్థులపై ఆమె చేసిన విమర్శలు అంత ఘాటుగా ఉండేవి.. ఆ నోటి దూకుడుతో ఆమె బూతు మంత్రుల లిస్టులో చేరిపోయారు.

- Advertisement -

ఏ అంశం మీద అయినా ప్రత్యర్థుల్ని ఏకిపారేయడం రోజా స్టైల్.. రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో తీవ్రస్థాయిలో అలకబూనడంతో.. జగన్ ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ ఆ తరువాత పర్యటక శాఖ మంత్రి పదవి ఇచ్చారు.చంద్రబాబు నుండి పవన్ కళ్యాణ్ వరకు.. ఆఖరికి వారి కుటుంబసభ్యులను కూడా వదలకుండా నోరుపారేసుకున్నారు రోజా చివరకు తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్‌ను సైతం రోజా వదలలేదు.

Also Read: Ys Jagan Defeat: జగన్ కొంపముంచింది ఆ షాడో సీఎంలేనా..?

ఇప్పుడు ఆ మాజీ హీరోయిన్ బొమ్మ రివర్స్ అయింది. ప్రత్యర్ధిగా పోటీచేసిన టీడీపీ అభ్యర్ధి గాలి భాను ప్రకాష్ చేతిలో 45 వేల ఓట్ల తేడాతో దారుణ పరాజయం పాలయ్యారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు నగరి వైసీపీ నేతలతో సఖ్యత లేదు. ఎంతసేపు జగన్‌ మెప్పు పొందడానికి అన్నట్లు.. ప్రతర్ధులపై నోరుపారేసుకోవడానికే టైం కేటాయించారు. ఆ క్రమంలో సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలతో కూడా గిల్లిగజ్జాలు పెట్టుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి , సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన పాపానపోలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత ఆదాయం జబర్దస్త్‌గా పెంచుకున్నారు.

టిడిపి నేత గాలి భాను ప్రకాష్ ఆమెపై వ్యతిరేకతను చక్కగా క్యాష్ చేసుకుని.. ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారు. అధికారంలో ఉన్నామని ధీమాతో స్వంత పార్టీ నేతలపై కక్షగట్టినట్లు వ్యవహరించడంతో.. ఆ పార్టీ కీలక నేతలే ఆమెకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇదే సమయంలో అసంతృప్తి నేతలందరినీ తమ గేమ్ ప్లాన్ లో భాగంగా ఎన్నికల ముందు టీడీపీలో చేర్చుకుని రోజా ఓటమిని ఎన్నికల ముందే కన్ఫామ్ చేశారు భాను ప్రకాష్.. ఆ క్రమంలో పోలింగ్ తర్వాత మీడియా ముందుకొచ్చిన రోజా సొంత పార్టీ వారే వెన్నుపోటు పొడిచారని బేల ముఖం పెట్టాల్సి వచ్చింది.

Also Read: జగన్ కొంపముంచింది ఆ షాడో సీఎంలే!

2014, 19లో స్వల్ప ఓట్లతో గెలిచిన రోజాకు ఈసారి మాస్టర్ స్ట్రోక్ ఇస్తూ నగరి చరిత్రలో లేనివిధంగా భారీ మెజార్టీతో గెలుపొందారు భాను ప్రకాష్.. ఇటు ప్రజలు నో చెప్పడం పార్టీ నేతలు ఛీ కోట్టి వెళ్ళిపోవడంతో ఇప్పుడు పార్టీలో ఉన్న కేజి శాంతి నేతలు నగరికి పట్టిక శని వదిలిపోయిందని ఇక సినిమాలకు కూడా ఆ ఐరన్‌లెగ్ పనికిరారని ధ్వజమెత్తుతున్నారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు విభేదాలున్నాయి. ఆయన వర్గం కూడా నగరిలో రోజాకు సహకరించలేదు.

దానికి తోడు టిడిపి అభ్యర్ది భాను ప్రకాష్‌పై ఎన్నికల ముందు కర్రలు, రాడ్లతో దాడి చేయించడం.. వాహనాలు ధ్వంసం చేయడం లాంటి ఘటనలతో నగరి తెలుగు తమ్ముళ్లు రోజా టీమ్‌పై కసితో రగిలిపొతున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత రోజా, అమె అన్నదమ్ములు చేసిన అక్రమాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, దోచుకున్న కోట్లాది రూపాయలపై విచారణ జరిపిస్తామని భాను ప్రకాష్ ప్రకటించడం రోజా అనుచరుల్లో గుబులు రేపుతోందంట.

Also Read: Nandyal Politics: పుష్ప కి శిల్ప స్ట్రోక్.. ఫైర్ అవుతున్న బెట్టింగ్‌బాబులు

టీడీపీలో చేరిన రోజా వ్యతిరేకవర్గీయులు కూడా.. రోజా అక్రమ దందాలపై విచారణ జరిపించాలని .. ఆధారాలు తాము ఇస్తామని అంటున్నారు. ఇలా ఇంటా బయటా సమస్యలు చుట్టూ ముడుతున్న నేపధ్యంలో రోజా మాత్రం ఫలితాలు తరువాత సైలెంట్ అయిపోయారు. ఎవరిని కలవడానికి ఇష్టపడలేదంట.. జిల్లాలోను, నియోజకవర్గంలోను రాజకీయంగా పార్టీలో సైతం ఒంటరి అవ్వడంతో ఆమె భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఆమె రాజకీయాల్లో కొనసాగుతారని కొందరు అనుచరులు అంటుంటే.. మరికొందరు మాత్రం సినిమాల్లోకి తిరిగెళ్తారని చెప్తున్నారు. సినిమాల కంటే టీవీ షోలతో ఎక్కువ పాపులర్ అయిన రోజా.. తిరిగి బుల్లితెరనే నమ్ముకుని కాలం గడిపేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మంత్రిగా తెగ వెనకేసుకున్న ఆమె చెన్నై,హైదరబాద్‌ లేదా బెంగుళూరులో సెటిల్ అవుతారన్న టాక్ మరోవైపు నడుస్తుంది. భర్త సెల్వమణి తమిళ మాజీ డైరెక్టర్ అవ్వడంతో.. సంపాదించుకున్న సొమ్ముతో చెన్నై వెళ్లి సినిమాలు తీసుకుంటారన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.

Also Read: Galla JayaDev: గల్లా వాట్ నెక్స్ట్? రీ ఎంట్రీ ఎప్పుడు?

మొత్తానికి ఐదేళ్ళుగా ప్రత్యర్థి నేతలను ఓ ఆట ఆడుకున్న రోజా సీన్.. ఒక్క ఓటమితో పూర్తిగా రివర్స్ అయింది. నగరిలో ఆమె తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ ఉన్న ఆమె పెయిడ్ గ్యాంగు కూడా అదే భయంతో తమదారి తాము చూసుకుంటున్నారంట. పాలిటిక్స్‌లో బ్యాడ్ టైం స్టార్ట్ అయితే అలాగే ఉంటుంది మరి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News