Big Stories

Jagan: ఆనం, కోటంరెడ్డిలపై వేటు వేయరా? జగన్ వ్యూహమేంటి?

Jagan: జగన్ ను ధిక్కరించారు. ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీలో బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. పార్టీలో ఉంటూ ఇంత రచ్చ చేస్తుంటే.. జగన్ చూస్తూ ఊరుకుంటారా? వెంటనే ఆ ఇద్దరిపై వేటు వేసేయరా? అనుకున్నారంతా. కానీ, అంత సీరియస్ యాక్షన్ అయితే లేదు. ఇప్పటికీ ఆనం, కోటంరెడ్డిల ఎమ్మెల్యే పదవులు భద్రంగానే ఉన్నాయి.

- Advertisement -

చేతిలో ఉన్న పవర్ తో.. సింపుల్ గా పార్టీ పదవులు మాత్రం తీసేశారు. కొత్త ఇంఛార్జిలను నియమించారు. ఎందుకోగానీ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయలేదు. అంతటి ధిక్కార ధోరణికి పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తే సరిపోతుందా? అనేది మిగతా నేతల ప్రశ్న. వేస్తే గీస్తే.. ఎమ్మెల్యే పదవిపై వేటు వేయాలి గానీ.. అలా ఎందుకు చేయలేకపోతున్నారనేది చర్చ.

- Advertisement -

గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇలానే జగన్ కు రెబెల్ గా మారారు. ప్రతీరోజూ రచ్చబండతో ఇప్పటికీ రచ్చ రచ్చ చేస్తున్నారు. రఘురామను టార్గెట్ చేసిన వైసీపీ సర్కార్.. ఆయనకోసారి సీఐడీ టార్చర్ రుచి చూపించింది. వరుస కేసులు పెట్టి మళ్లీ ఏపీలో అడుగుపెట్టకుండా చేసింది. అక్కడితో రఘురామను వదలలేదు వైసీపీ. ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ.. లోక్ సభ స్పీకర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అవన్నీ బుట్టదాఖలయ్యాయి. రఘురామకు కేంద్రంలోని బీజేపీ ఆశీస్సులు మెండుగా ఉండటంతో.. ఆయన ఇప్పటికీ ఎంపీగా చెలామని అవుతున్నారు.

సరే, రఘురామపై అనర్హత ఎపిసోడ్ లోక్ సభ స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి అది వేరే విషయం. కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల వ్యవహారం అసెంబ్లీ పరిధిలోకే వస్తుందిగా. మరి, ఆ ఇద్దరిపై స్పీకర్ తమ్మినేనిచే అనర్హత వేటు వేయిస్తారా? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.

ఆప్షన్స్ 1: త్వరలో జరగబోవు అసెంబ్లీ సమావేశాల్లో వారి ప్రస్తావన తీసుకొస్తారని అంటున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ.. ఆనం, కోటంరెడ్డిలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంటుంది. ఆధారాలు, విచారణ లాంటివి అవసరం లేకుండా.. స్పీకర్ విచక్షణ మేరకు ఎలాంటి సంచలన నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉంటుంది.

ఆప్షన్స్ 2: ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేయడం.. మళ్లీ ఉప ఎన్నికలు రావడం.. అందులో ఫలితాలు అటూఇటూ అయితే? ఇప్పుడంత రిస్క్ అవసరమా? అనే భావనలో ఉందట వైఎస్సార్ సీపీ. ఆనం, కోటంరెడ్డిలు ఇద్దరూ ప్రజాక్షేత్రంలో బలమైన నాయకులే. ఉప ఎన్నికల్లో వారిని ఓడించడం అంత ఈజీ విషయమేమీ కాకపోవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉండగా.. ఈలోపే బై ఎలక్షన్ లాంటి రిస్కులు ఎందుకనేది జగన్ అభిప్రాయం అంటున్నారు. అందుకే, సలహాదారు సజ్జల సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పదవీకాలం ఏడాదేగా.. వారిపై చర్యలు అవసరం లేదంటూ మాట్లాడారు.

అంటే, రఘురామ విషయం మూడేళ్ల కిందటి మాట.. అందులోనూ ఆయనపై తప్పక గెలుస్తామనే ధీమా. కానీ ఆనం, కోటంరెడ్డిల పదవీ కాలం మరో ఏడాది మాత్రమే. అందులోనూ బలమైన నేతలు. అందుకే, వారి ఎమ్మెల్యే గిరిపై వేటు వేయకపోవచ్చనే అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News