Big Stories

Congress on PM Modi: దేశమంతా లీకులు, వీక్‌లే.. మోదీపై తిరుగుబాటు మొదలు..!

- Advertisement -

దేశవ్యాప్తంగా హిందువులు కొన్ని దశాబ్ధాలుగా ఎదురు చూసిన అయోధ్య రామందిర నిర్మాణం ఎంతో అట్టహాసంగా జరిగింది. భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు, జనవరి 22న, రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చేశారు ప్రధాని మోడీ. ఆలయ నిర్మాణం పూర్తిగా నిర్మాణం కాకముందే ప్రాణ ప్రతిష్ట సమంజసం కాదంటూ చాలా మంది విమర్శించారు. కొందరు స్వాము సైతం ఈ కార్యక్రమానికి హాజరుకామంటూ ప్రకటించారు. విపక్షాలైతే ఇదంతా మోడీ రాజకీయ కార్యక్రమం అంటూ ప్రాణ ప్రతిష్టకు దూరంగా ఉన్నారు. అయితే, దేశంలో హిందూ జనాభా భక్తి భావన ముందు విమర్శల ప్రభావం పెద్దగా పనిచేయలేదు. ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ ఎన్డీఏ కూటమి సహకారంతో మోడీ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటయ్యింది. అయితే, ఎంతో మంది ఇంజనీర్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయం మాత్రం లీకులతో కాకరేపింది.

- Advertisement -

వందల ఏళ్ల పోరాటం తర్వాత రామలల్లా ఆలయంలో దేవుడి దర్శనం జరుగుతోందనే ఆనందం కంటే… తొలి వర్షంలోనే దేవాలయంపై ఉన్న లక్షలాది మంది రామభక్తుల విశ్వాసం కొండెక్కిందని రామ్‌లల్లా ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి నీరు లీక్ అవుతుందని అన్నారు. జూన్ 22న అర్ధరాత్రి అయోధ్యలో కుండపోతగా వాన కురింసింది. దీనితో.. రామ్‌లల్లా ముందు పూజారి కూర్చునే ప్రదేశంలో… అలాగే, వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్‌ అవుతున్నట్టు గుర్తించామని సత్యేంద్ర దాస్ వెల్లడించారు. ఇలాగే భారీగా వానలు కురుస్తుంటే గర్భగుడిలో కూర్చుని లోపల పూజ చేయడం కూడ కష్టమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Telangana Police: దారి తప్పుతున్న ఖాకీలు.. పోలీస్ డ్రస్ కు అవినీతి మరకలు!

అయోధ్య రామ మందిరం నిర్మించిన తర్వాత వచ్చిన వర్షాల సీజన్‌లోని తొలి వర్షానికే గర్భగుడిలో నీరు కారడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రామ్ లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట నీరు లీకవ్వడం, ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు నిలిచిపోవడంతో పాటు ప్రధాన పూజారి గుడికి వెళ్లే పదమూడు రోడ్లూ జలదిగ్బంధంలోనే ఉన్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. అంతేకాక ఆ రహదారుల్లోని పలు ఇళ్లలోకి మురుగునీరు చేరిందని స్థానికులు చెబుతున్నారు. ఇక గర్బగుడిలో నీరు లీకేజీ కావడంపై ప్రతిపక్షాలు బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. రామ మందిర నిర్మాణంలో బీజేపీ అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం పేలవంగా నిర్మాణాన్ని పూర్తి చేసి, బీజేపీ అయోధ్యను అవినీతి కేంద్రంగా మార్చిందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఆరోపించారు.

ప్రధాని మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రామాలయం వ్యహారం ఇలా ఉంటే… దేశవ్యాప్తంగా పలు వంతెనలకు కూడా మోడీ హయాంలోనే కాలం చెల్లింది. గత పదేళ్లలో కూలిపోయిన వంతనెలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఉండటం వెనుక కూడా పలు విమర్శలు వచ్చాయి. ఆ మధ్య గుజరాత్‌లో కూలిపోయిన బ్రిడ్జ్ ఘటన సంచలనం అయ్యింది. ఇటీవల భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన సంఘటనలలో ఒకటిగా దీన్ని పేర్కొన్నారు. ఈ ఘోరమైన ఘటనలో కనీసం 134 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, 2019 మార్చి 14న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు.

Also Read: మోదీ వర్సెస్ ఆర్ఎస్ఎస్.. ప్రధానికి ఇబ్బందులు తప్పవా?

ఈశాన్య భారతదేశంలోని మిజోరాంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో కనీసం 26 మంది మరణించారు. బీహార్‌లో గంగానదిపై నిర్మాణంలో ఉన్న ఓ కేబుల్ బ్రిడ్జి ఒక్కసారిగా నదిలో కూలిపోయింది. ఈ బ్రిడ్జ్ ఇప్పటికి రెండు సార్లు కూలింది. బీహార్‌లో.. బెగుసరాయ్, కిషన్ గంజ్, సహర్సా జిల్లాలో కూడా వంతెనలు కూలిపోయాయి. ఇలా, చెప్పుకుంటూ పోతే.. ఈ పదేళ్ల కాలంలో దేశంలో పలు వంతెన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలకు ప్రకృతి వైపరీత్యాలతో పాటు.. 10 శాతానికి పైగా వంతెనలు విఫలమవడానికి మెటీరియల్ క్షీణత కారణమని తెలుస్తుంది. అలా, ఓవర్‌లోడింగ్ వల్ల కూడా 3.28 శాతం వంతెనలు కూలుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, లీకులతో పాటు వీకైన వంతెనలు కూడా మోడీ పాలనలోనే జరుగుతున్నాయని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

దేశంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలను కప్పిపుచ్చడానికే మోడీ పాత సంగతులు ప్రస్తావిస్తున్నారనీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా విమర్శించారు. మోడీ తన మొదటి లోక్ సభ సమావేశం సందర్భంగా..  నాటి ఎమర్జెన్సీ రోజులను ప్రస్తావించారు. నాటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాలరాస్తూ.. ఎమర్జెన్సీని విధిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు రాజ్యాంగంపై కపట ప్రేమ చూపిస్తున్నారంటూ మోడీ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోడీ పాలన వచ్చిన తర్వాత అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని తెలిపారు. మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు ప్రాథమిక హక్కులకే హాని ఏర్పడిందని అన్నారు. మోడీకీ, బీజేపీ పార్టీకీ వ్యతిరేకంగా ఉన్నవారిపై కేసులు పెట్టడం, జైలుకు పంపించడమే ధ్యేయంగా మోడీ ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యనించారు.

Also Read: YS Jagan Mohan Reddy: స్పీకర్ గారూ.. నాదొక రిక్వెస్ట్.. జగన్ వింత కోరిక

ఏది ఏమైనప్పటికీ.. ప్రస్తుతం దేశంలో లీకుల రాజ్యం కొనసాగుతుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతున్న ప్రశ్నాపత్రాల లీక్, ప్రతిష్టాత్మకంగా కట్టుకున్న రామాలయం లీక్ వంటి ఘటనలు ఇకపై ఉండకూడదని అంతా ఆశిస్తున్నారు. అలాగే, మూడో సారి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం ఈ టర్మ్‌లో అయినా ప్రజా పాలన చేయాలనీ విమర్శకులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News