Big Stories

Ramoji Rao Real Story: రాజీ లేని రామోజీ.. అక్షర యోధుని జీవన యాత్ర..

- Advertisement -

చెరుకూరి రామయ్య.. అందరికి తెలియని పేరు. కానీ రామోజీరావుగారి అసలు పేరు అదే.. ఆయన ఓ మీడియా మొఘల్.. ఓ ఇన్‌ఫ్లుయెన్సర్.. ఓ కింగ్‌ మేకర్.. ఓ మూవీ ప్రొడ్యూసర్.. ఓ ఇండస్ట్రియలిస్ట్.. వాట్ నాట్.. ఆయనో నిత్యశ్రామికుడు.. అలుపెరగని బాటసారి.. అంతకుమించిన రాజీలేని పోరాటయోధుడు..యస్.. ఆయన డిక్షనరీలో రాజీ అన్న పదానికి చోటే లేదు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా.. వెరవలేదు.. తలవంచలేదు. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా.. తను అనుకున్నది చేయడం.. అందులో ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టించుకోకపోవడం వాటిని సక్సెస్‌ఫుల్‌గా అధిగమించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆఖరి శ్వాస వరకు దానినే ఫాలో అయ్యారు రామోజీరావు.

- Advertisement -

నిజానికి రామోజీరావుగారి రూటే సపరేట్.. ఆయన ఆలోచనలో కాస్తా విప్లవాత్మకంగా ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని పత్రికలు విజయవాడ కేంద్రంగా నడుస్తున్న సమయంలో ఆయన విశాఖ కేంద్రంగా ఈనాడు ప్రారంభించారు. విజయవాడలో ప్రింట్‌ అయిన పేపర్.. శ్రీకాకుళం చేరుకునే సరికి మధ్యాహ్నం సమయం అయిపోతుందని గుర్తించిన రామోజీరావు సూర్యుడు ఉదయించకముందే ప్రతి గడపకు పేపర్ అందాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. విశాఖ నుంచి మొదలైన ఈ ఉద్యమం. చాలా తక్కువ సమయంలోనే అప్పట్లో అత్యాధునిక టెక్నాలజీ, వసతుల సాయంతో.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.

Also Read: Ramoji Rao Funeral: రామోజీ ఫిల్మ్‌సిటీలో అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు

హైదరాబాద్‌లో యూనిట్‌ను ప్రారంభించిన సమయంలో కూడా తెల్లవారుజామున ఆయన కొన్ని ప్రాంతాల్లో పర్యటించేవారు.. పేపర్ సరైన సమయానికి చేరుతుందా? లేదా? అని.. ఏ పని చేసినా పక్కాగా, భారీగా చేయడం ఆయనకే చెల్లింది. ఏదైనా రంగంలోకి అడుగుపెడుతున్నారంటే చాలా కొత్తగా.. భారీగా పడేవి ఆయన అడుగులు.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆయనకు తెలుగు భాషపై ఉన్న అభిమానం మాత్రం తగ్గలేదు.. మన సాంప్రదాయాలను వీడలేదు.. దీనికి ఉదాహరణే ఆయన చేసిన అక్షర సేద్యం.. సాహితి సంపదను కాపాడేందుకు ఎన్నో అనుబంధ పత్రికలను ప్రారంభించారు..

అయితే ఆయన లైఫ్‌లో ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది మార్గదర్శి కేసు.. మాములుగా కొన్ని కోట్ల సొమ్ము పోగు కాగానే బోర్డు తిప్పేసే అనేక సంస్థలను చూశాం మనం.. బట్ మార్గదర్శి అలా కాదు. నిజానికి మార్గదర్శి చిట్‌ ఫండ్ రామోజీరావు వ్యాపారాల్లో ఒకటి.. ఇది 10 వేల కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్న సంస్థ. అయితే ఇది చట్టపరమైన నిబంధనలు పాటించడం లేదంటూ కేసులు నమోదయ్యాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. బట్.. ఇప్పటి వరకు డిపాజిట్ దారులకు ఒక్క రూపాయి కూడా ఆలస్యంగా పడిన దాఖలాలు లేవు.. ఎవరిని మోసం చేశారన్న వార్త కూడా లేదు. అది రామోజీరావుకున్న క్రెడిబులిటీ.. డిపాజిట్‌దారులకు చెల్లించేందుకు డబ్బు లేకపోతే ఈటీవీలో వాటాలు అమ్ముకున్నారు తప్ప ఏ ప్రభుత్వ నేత వద్ద దేహీ అనలేదు. కేసులు మాఫీ చేయ్యండి అంటూ వాళ్ల చుట్టూ తిరగలేదు.. తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్తారని చెప్పడానికి దీనికి మించిన నిదర్శనం మరొకటి లేదు.

Also Read: సినీ రంగంలో రామోజీరావు మార్క్.. అలాంటి సినిమాలు మళ్లీరావు

వైఎస్ఆర్‌, వైఎస్ జగన్‌ ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు రామోజీరావు.. అనేక కేసులు చుట్టుముట్టాయి.. విచారణల పేరుతో ఆయనను కోర్టుల చుట్టూ తిప్పాలని చూశారు. బట్ ఆ ఇద్దరి వల్ల ఏదీ సాధ్యం కాలేదు. కాస్త ఇబ్బందులు పెట్టడంలో సక్సెస్‌ కావొచ్చు కానీ.. ఆయన ఆత్మస్థైర్యాన్నీ మాత్రం దెబ్బతీయలేకపోయారు. నిజానికి ఆయనను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. అనేక సంస్థలల్లో వారంతా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన సంస్థల్లో జీతాలు పడకపోవడం అటుంచి..
ఆలస్యంగా పడ్డ దాఖలాలు కూడా లేవంటే నమ్ముతారా? కానీ అది నిజం.. ఈనాడు కావొచ్చు.. ఈటీవీ కావొచ్చు.. ప్రియా కావొచ్చు.. మార్గదర్శి కావొచ్చు. ఇలా సంస్థ ఏదైనా ఉద్యోగులను కళ్లల్లో పెట్టి చూసుకున్నారు రామోజీరావు అందుకే వారందరికి దేవుడితో సమానం..

నిజానికి రామోజీరావు పక్కా వ్యాపారీనే.. ప్రతి దాంట్లోనూ వ్యాపార కోణం చూస్తారు. అన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉంటారు. అందుకే ఆయనపై చాలా విమర్శలు కూడా ఉన్నాయి. కానీ కేవలం మంచితనం ముసుగు వేసుకొని ఉంటే.. నమ్ముకున్న వేలాది మంది కుటుంబాలకు న్యాయం చేయలేరు కదా.. అందుకే అంత పట్టుదల తప్పదని ఆయన చెప్పకనే చెబుతారు రామోజీరావు.. పత్రికా రంగంతో అక్షరసేద్యం చేశారు.. ఈటీవీ నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా చానల్స్‌ ప్రారంభించారు. డిజిటల్ మీడియాలో కూడా ఓ ట్రెండ్‌ను సెట్‌ చేసిన ముందు చూపు గల వ్యక్తి రామోజీరావు..

Also Read: Ramoji Rao Funeral: దేశంలోనే ప్రథమం.. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు..!

ఇక అన్నింటికంటే ముఖ్యమైనది రామోజీ ఫిల్మ్‌ సిటీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్‌ సిటీ ఇది. వరల్డ్‌ వైడ్‌గా లక్షలాది మూవీ షూటింగ్స్‌కు కేరాఫ్‌ RFC..మరి ఇలాంటి సిటీ ఒకటి అవసరం.. దానిని నిర్మించాలని ఆలోచన ఆయనకు ఆ సమయంలోనే వచ్చిందంటే ఆయన దార్శనికతకు ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. RFC నిర్మాణంపై కూడా అనేక విమర్శలు, వివాదాలు.. బట్ ఆయన అడుగులు ముందుకే పడ్డాయి.. ఆ మొండితనమే ఇప్పుడు ఆయన పేరును చరిత్రలోకి ఎక్కేలా చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News